తెలుగులో యుగళగీతాలకు పరిపూర్ణత తెచ్చినవారు ఘంటసాల సుశీల. వారు పాడిన వందల పాటలలో పది అత్యుత్తమమైనవి అని నాకు అనిపించినవి ఒక జాబితా.
ఇవి మనతెలుగువారి అపురూప సంపద.
పదే ఎందుకు ? ఈ జాబితా అవసరమా ? అంటే ఏమీ లేదు. ఉబుసుపోక అంతే.
ఈ పాటల ఎంపికలో నేను పాటించిన ప్రాథమ్యాలు 1) మాధుర్యం 2) పాట బాణీ 3) ఎన్నిమార్లు విన్నా హాయిగా ఉండటం 4) సాహిత్యం.
1) మనసు పరిమళించెనే - శ్రీ కృష్ణార్జున యుద్ధంలోని ఈ పాట లో అణువణువునా మాధుర్యం తొణికిసలాడుతుంది. సంగీతం పెండ్యాల . పాట వింటే చాలు పదిమాటలేల. నా మొదటి వోటు ఈ పాటకే
2) కొండగాలి తిరిగింది. గుండె ఊసులాడింది. : చిత్రం ఉయ్యాల జంపాల. సంగీతం పెండ్యాల పాటను మలయా మారుతంలో చక్కగా స్వరపరిచాడు. ఆరుద్ర మలయమారుతాన్ని అచ్చతెనుగులో కొండగాలిగా మార్చాడు.
ఆరుద్ర ఈ పాటలో విశ్వరూపం చూపాడు. 'పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది'; 'మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది'; 'ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోయింది'...
3) మోహనరాగమహా మూర్తిమంతమాయే : చిత్రం మహామంత్రి తిమ్మరుసు. సంగీతం పెండ్యాల రచన పింగళీ. ఈ పాటలో ఘంటసాల సుశీల ఆలాపనలు విని పరవశించిపోవచ్చు. పెండ్యాల గీతాలలో ఆలాపనలకు తప్పక చోటు ఉంటుంది. ఆయన trademark అని చెప్పవచ్చు.
4) ఎంతహాయి ఈ రేయి : చిత్రం గుండమ్మ కథ. సంగీతం ఘంటసాల. రచన పింగళి. insominiac లకు చక్కటి మందు ఈ పాట. పింగళి మార్కు brevity కి ఒక మచ్చుతునక.
5) ప్రేయసీ మనోహరి వరించి చేరవే: చిత్రం వారసత్వం సంగీతం ఘంటసాల. ఘంటసాల ఎంతగొప్ప గాయకుడో అంతకుతగ్గ సంగీతకర్తకూడా. పాటను జనరంజకంగా బాణి కట్టడం ఆయనకున్న ప్రత్యేకత.
6) నన్ను వదలి నీవు పోలేవులే : చిత్రం మంచి మనసులు. సంగీతం కె.వి. మహదేవన్. హిందోళం లో స్వరపరచిన ఐ పాట ఒక classic.
7) ఆకాశ వీధిలో అందాల జాబిలి : చిత్రం మాంగల్య బలం. సంగీతం మాస్టర్ వేణు. రచన శ్రీ శ్రీ పాటలో ఒక simplicity, innocence ఉన్నాయి.
8) నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని: చిత్రం గులేబకావళి కథ , రచన సినారె, సంగీతం విజయ కృష్ణ మూర్తి. సినారె తొలిపాట. పాటనిండా అందమైన పదబంధాల గుంఫనం పొందుపరిచాడు. కర్పూరం గంధం గుబాళింపు అనుభూతినిస్తుంది ఈపాట
9) మాధవా మాధవా నన్ను లాలించరా : చిత్రం శ్రీరామకథ (?) సంగీతం s p కోదండపాణి. ఇది ఒక విలక్షణమైన పాట. రాగం కళ్యాణ వాసంతం .
10) సంగమం సంగమం : చిత్రం కోడెనాగు. సంగీతం పెండ్యాల. last but not the least. ఈ పాట ఒక చక్కని యుగళగీతం. ఘంటసాల గొంతు అప్పటికే పాడయింది. కానీ సుశీల గారు తన గాన మాధుర్యంతో more than compensate చేసింది. it is one of my personal favourites.
almost there: ఐనదేమో అయినది , నీ జిలుగుపైట నీడలోన నిలువనీ, పాడవేల రాధిక, ఆడుతు పాడుతు పనిచేస్తుంటే.. the list continues..
అమ్మయ్య. ఎప్పటినుంచో ఘంటసాల సుశీల గార్ల పాటలను ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఒక టపా వ్రాయాలి అనుకున్నాను. ఆ కోరిక తీరింది.
పాటల ఎంపిక, వాటి ప్రత్యేకతలను వివరించటం బాగుంది.
ReplyDeleteGood selection
ReplyDeleteమీ బ్లాగుని "పూదండ" తో అనుసంధానించండి.
ReplyDeletewww.poodanda.blogspot.com
చాలా మంచి పాటలు ఎన్నుకున్నారు.
ReplyDelete'చిట్టి తల్లి'(1972)లోని "ఈ రేయి తీయనిది" పాట
'జేగంటలు లోని "వందనాలు వందనాలు" పాటనీ డవున్లోడ్ ఎక్కాడి నుంచి చేసుకోవచ్చో వివరిస్తారా?
వేణు గారు, సూర్యుడు గారు: నెనర్లు.
ReplyDeleteసత్య: గూగుల్ లో పాటలను వెతికి పట్టుకోవటం తేలికేనండి. allbestsongs.com లో మంచి collection ఉంది.
మాధవా మాధవా పాట నా ఫేవరిట్ :-)
ReplyDeleteసుశీల గొంతులో మాధుర్యాన్ని ఏం పెట్టి కొలవాలో తెలీదు
I like two songs from Devatha.
ReplyDeleteKannullo misamisalu kanipinchanee
Tholi valape pade pade
Both has some hindustani style and different from their regular duets and so pleasant to listen with less instruments.