చారుకేశి - చక్కని కురులు కల స్త్రీ. 'ప్రతిదినం నీ దర్శనం' దొరకినా మంచిదే. మద్రాసులో మార్గళి మాసపు సాయంత్రాలు చిరుచలిలో కచ్చేరీలు వింటూ మధ్యలో పొగలు కక్కే 'కాపి' తాగిన ఆనందం.
'కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు?'
' నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దము చూపేను'.
ఇటువంటి awesome lyrics కలిగిన 'ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ' పాట.
ఆత్రేయ వ్రాసిన ఈ పాటలోని మాటలు మదురై మల్లెపూల పరిమళంలాగా కమ్ముకుంటాయి.
త్యాగరాజు 'ఆడ మోడి గలదే' చారుకేశి కి ఒక పాఠ్య పుస్తకం వంటిది. bombay జయశ్రీ గొంతులో.
పాటలో 'చదువులన్ని' దగ్గర నెరవులు కడిమి చెట్టును అల్లుకున్న అడవిమల్లెతీగల్లాగా అనిపిస్తాయి.
ఇదే పాట బాలమురళి గొంతులో ఇక్కడ. ముఖ్యంగా ప్రవిస్తారమైన, అనితరసాధ్యమైన ఆలాపన ఆకట్టుకుంటుంది.
త్యాగరాజస్వామి మాటల్లోని purity , authenticity కొట్టవచ్చినట్టు కనపడుతాయి.
'సంక్షిప్తంగా పాటలో నాకు అర్థమైన భావం: చదువులన్ని తెలిసిన సాక్షాత్ శంకరాంశ సంభూతుడైన హనుమంతుడంతటి వాడు సుగ్రీవుని పనుపున వచ్చి నీకు మ్రొక్కి వివరమడిగితే నీవు నేరుగా భాషింపక అనుజుడైన లక్ష్మణుడితో చెప్పించావు. అలాగే నీవు నిన్నే నమ్ముకున్న నాతో ఏదో ఒక తీరున మాటలాడుతావా రామా? '
చారులత మణి (ఒక gifted singer and columnist ) చారుకేశి గురించి ఇచ్చిన demo lecture ఇక్కడ వినవచ్చు. తమిళంలో ఉన్నా సులభంగా అర్థమవుతుంది.
చారుకేశి రాగం విన్న తరువాత మనసుకు సాంత్వన గా ఉంటుంది. పాట అయిపోయిన తరువాతకూడా పాటలోని పరిమళం జడనుంచి జారిపడిన మల్లెలా నిలిచే ఉంటుంది.