Tuesday, December 24, 2013

నీవులేవు. నీ జడనుంచి జారిన మల్లెల పరిమళం నిచిచే ఉంది. - చారుకేశి.


చారుకేశి - చక్కని కురులు కల స్త్రీ. 'ప్రతిదినం  నీ దర్శనం'  దొరకినా మంచిదే. మద్రాసులో మార్గళి మాసపు సాయంత్రాలు చిరుచలిలో కచ్చేరీలు వింటూ మధ్యలో పొగలు కక్కే 'కాపి' తాగిన ఆనందం. 

 'కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలార్పి ఏమార్చేవు?'

' నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వున కద్దము చూపేను'.

 ఇటువంటి awesome lyrics కలిగిన 'ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ' పాట.
ఆత్రేయ వ్రాసిన ఈ  పాటలోని మాటలు మదురై మల్లెపూల పరిమళంలాగా  కమ్ముకుంటాయి.

త్యాగరాజు 'ఆడ మోడి గలదే' చారుకేశి కి ఒక పాఠ్య పుస్తకం వంటిది.  bombay జయశ్రీ గొంతులో.

పాటలో 'చదువులన్ని' దగ్గర నెరవులు కడిమి చెట్టును అల్లుకున్న అడవిమల్లెతీగల్లాగా అనిపిస్తాయి.

ఇదే పాట బాలమురళి గొంతులో ఇక్కడ.  ముఖ్యంగా ప్రవిస్తారమైన, అనితరసాధ్యమైన  ఆలాపన ఆకట్టుకుంటుంది. 

త్యాగరాజస్వామి మాటల్లోని purity , authenticity కొట్టవచ్చినట్టు కనపడుతాయి.

'సంక్షిప్తంగా పాటలో నాకు అర్థమైన  భావం:  చదువులన్ని తెలిసిన సాక్షాత్  శంకరాంశ సంభూతుడైన హనుమంతుడంతటి  వాడు  సుగ్రీవుని పనుపున వచ్చి నీకు మ్రొక్కి వివరమడిగితే నీవు నేరుగా భాషింపక అనుజుడైన లక్ష్మణుడితో చెప్పించావు. అలాగే నీవు నిన్నే నమ్ముకున్న నాతో ఏదో ఒక తీరున  మాటలాడుతావా రామా? '

చారులత మణి (ఒక gifted singer and columnist ) చారుకేశి గురించి ఇచ్చిన demo lecture ఇక్కడ వినవచ్చు. తమిళంలో ఉన్నా సులభంగా అర్థమవుతుంది. 

చారుకేశి రాగం విన్న తరువాత మనసుకు సాంత్వన గా ఉంటుంది.  పాట అయిపోయిన తరువాతకూడా పాటలోని పరిమళం జడనుంచి జారిపడిన మల్లెలా నిలిచే ఉంటుంది.













  

15 comments:

  1. చారుకేశి గురించి రాసి, చక్కని పాటలు వినేలా (చూసేలా) చేశారు. కవిత్వాంశతో కూడిన మీ వర్ణన ఈ రాగానికి చారుతర నీరాజనం!

    ReplyDelete
  2. వేణుగారు. thank you

    ReplyDelete
  3. చారు కేశి లో ఒక రకమైన తమాషా ఉంటుంది. అదేంటో పట్టుకోలేం కానీ ఆస్వాదించగలం:-)
    ఊరేల పేరేల ఓ చందమామా అని లీల పాడుతుంటే అబ్బ, ఇది చారు కేశి అని వెంటనే ఆ చమక్కుని పట్టుకునేలా

    ఈ పగలు రేయిగా పాట వింటుంటే ప్రేమికులింత ఆర్దృం గా పాడుకుంటారా అనిపించేంత గాఢత కల్గిన రాగం!

    మంచి రాగం ఎత్తుకున్నారు తెలుగు అభిమాని గారూ, థాంక్యూ

    ReplyDelete
  4. సుజాత గారు: ఊరేల పేరేల ఓ చందమామా' పాట ఏ చిత్రంలోనిది. నేను వినలేదు.

    ReplyDelete
  5. రాజ మకుటం లోదండీ! ఊరేది పేరేది ఓ చందమామా ..(నేను తప్పుగా కోట్ చేసాను)

    "ఎందుండి వచ్చేవో ఏ దిక్కు పోయేవో" అన్న సాకీ తో మొదలవుతుంది. ఆ పాట మొదట్లో బుల్ బుల్ తో మరో వాద్యమేదో కలిపారనుకుంటాను. అద్భుతంగా ఉంటుంది. లీల మరీ అద్భుతం కదా అసలు! చెప్పేదేముంది

    http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=610

    ఇక్కడ వినండి!

    ReplyDelete
  6. ఈ పాట నేను ఇదే మొదటిసారి విన్నాను. బాగుంది. కొంచెం పెళ్ళి చేసి చూడు చిత్రంలోని 'ఎవరో ఎవరో' పాటను తలపించింది. thanks సుజాత గారు. -తెలుగు అభిమాని

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete
    3. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete
    4. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete
    5. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete
    6. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete
    7. This comment has been removed by the author.

      Delete
    8. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete
    9. ఎవరో వారే పాట కూడా చారుకేశిలోనిదే! అన్నింటికంటే మదన్‌ మోహన్‌ మ్యూజిక్‌లో వచ్చిన దస్తక్‌ సినిమాలో ఓ బందీష్ ఉంటుంది. భయ్యా న ధరో అన్న ఈ పాట విని చూడండి...లత గొంతు ఎంత అద్భుతంగా ఉంటుందో....

      Delete