కర్ణాటక సంగీత ప్రపంచంలో కె.వి. నారాయణస్వామి (1923-2002) గారిది సమున్నత స్థానం .
melody+ pure tradition+ mastery+classicism+ manodharmam అన్నిటి మేలుకలయికే వారి గానం. 'నెరవల్' నారాయణస్వామి అని వారిని అభిమానంతో పిలుచుకుంటారు. నెరవులు (singing a phrase in the charanam in kaliedoscopic melodic structures bringing out the essence of the ragam) వైవిధ్యభరితంగా పాడటం వారి ప్రత్యేకత.
పాలఘాట్ మట్టిలో , నీటిలో, గాలిలో ఏమి మహత్తు ఉందొ కానీ కర్ణాటక సంగీతానికి fountainhead గా నిలిచింది.
kvn పాడిన 'పక్కల నిలబడి' ( ఖరహర ప్రియ- త్యాగరాజ స్వామి) కీర్తనలో నెరవుల మెరుపులు విరుపులు (మనసున తలచి) వినవచ్చు.
----------------------------------
పక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగా తెల్ప రాదా |
చుక్కల రాయని కేరు మోము గల
సు-దతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు (పక్కల) |
తనువుచే వందనమొనరించుచున్నారా
చనువున నామ కీర్తన సేయుచున్నారా మనసున తలచి మై మరచియున్నారా నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీరిరు (పక్కల) |
ఖరహరప్రియ రాగంలో
ఒకపరి కొకపరి వయ్యారమై (అన్నమయ్య - ఉన్ని కృష్ణన్)
సంగీత సాహిత్య సమలంకృతే (స్వాతికిరణం-SPB -సినారె-kvm) - అత్యుత్తమమైన సాహిత్యం, సంగీతం, బాలు అద్భుత గానం.
బాలనురా మదనా (మిస్సమ్మ, సుశీల, SRR , పింగళి).
ఇళయరాజా సంగీతం లో 'ఆనందం పొంగిడ' (KJY - సునంద ) అనే అద్భుతమైన పాట ఉంది. ముఖ్యంగా ఈ పాటలో interludes చాలా బాగుంటాయి.