Wednesday, October 25, 2023

శ్రీ జస్విందర్ ధని- కృష్ణ భక్తి గీతాలు


భక్తి గీతాలు మధురంగా, నెమ్మదిగా సాగుతూ శ్రోతలకు ప్రశాంతతను,  ఆనందాన్ని కలిగించేలా ...


పాటలో సాహిత్యం లలితమైన, అర్థవంతమైన పదములతో...


సంగీతం గానం మనసుకు హాయి గొలిపే విధంగా... 


ఉంటే బాగుంటుంది.


ఇటువంటి భక్తి గీతాల ఆల్బమ్ శ్రీ జస్విందర్ ధని గారు (10-11 సంవత్సరాల క్రితం) స్వరపరచి పాడారు. కృష్ణా శ్రీ కృష్ణా అనే పేరుతో ఉన్న ఆల్బమ్ లో మంచి భక్తి గీతాలు ఉన్నాయి.


గణేశ్ నవరాత్రులలో, శివరాత్రి, దసరా, ఉగాది .. పండుగల సందర్భంగా కొందరు ఔత్సాహికులు కొత్త గీతాలు స్వరపరచి పాడుతున్నారు. వారి ప్రయత్నం మంచిదే.  అయితే అధిక భాగం ఆ గీతాల్లో భక్తి భావం, ప్రశాంతత అంతగా అనిపించదు. వేగంగా పరుగులు తీసినట్లు పాడితే అది హృదయాన్ని చేరదు.


అలాగే శృతి విషయం లో మన వైపు గాయకులు హిందూస్థానీ గాయకుల లాగా కృషి చేయడం బాగుంటుంది.


జస్విందర్ గారి గాత్రం మధురం. తెలుగు మాతృ భాష కానందువల్ల పదముల ఉచ్చారణ లో కొంత వ్యత్యాసం ఉంది. అయినా ఈ పాటల మాధుర్యం, భక్తి భావం వలన ఆ విషయం అంతగా తెలియలేదు.


ఈ పాటల సాహిత్యం వెంపటి రాయంచ అనే రచయిత వ్రాసినట్లు తెలుస్తుంది. సాధారణ పదాలతో మంచి భావం అందించారు.


ఈ పాటలు భక్తి ఛానెల్స్ లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.


ఓ చక్రధారి ఓ వనమాలి 


ఆడి పాడే చూడు భలే మాయల వాడు


ఈ పాటలు వింటూ ఉంటే బృందావనంలో రాధా కృష్ణుల సన్నిధి లో ఉన్నట్లు ఆ సన్నివేశం ఎదురుగా జరిగినట్లు భావన కలుగుతుంది. ఈ పాటలు విన్న ప్రతిసారీ సాహిత్యం లో భక్తి భావం, శరణాగతి, ప్రేమ అనుభూతి కలిగిస్తాయి.

--------

ఆడి పాడే చూడు భలే మాయలవాడు

కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు


మోవిని ముద్దుల దరహాసం వాడు

పింఛము తలపై తగిలించిన వాడు

భాగ్యశాలిగా ఆ వెదురు

స్వామి పెదవులపై పిల్లనగ్రోవై


చంద్రుని తేజం రాధారాణి

దీపపు కళిక ఆ మహరాణి

కంఠంలో ధరించే ఆ కృష్ణ హారము

నింగి చుక్కలైన బలాదూరెగా.


పావనమైనది రాధా ప్రేమ

జీవన వేణువు తానే కాదా

ప్రేమంటే అర్థం రాధే మరి

ఆ గోవిందుని చేరే మరి


ఆడి పాడే చూడు భలే మాయలవాడు

కృష్ణ గోవిందుడు రాధతోడ ఆడే చూడు


-------



No comments:

Post a Comment