Saturday, October 12, 2024

బొల్లోజు బాబా గారు సనాతన ధర్మం అంశం పై వ్రాసిన పోస్టు - నా సమాధానం

 

బాబా గారి పోస్టు లింకు -


సనాతన ధర్మం అంటే ఏమిటి? - కొన్ని చర్చనీయాంశాలు


ఆ బ్లాగులో పోస్టు చేసిన నా సమాధానం. మరికొన్ని అంశాలు జోడించడం జరిగింది.

-------

అయిష్టంగా నైనా సనాతన ధర్మం మానవాళికి అందించిన కొన్ని గొప్ప విషయాలను ఏకరువు పెట్టారు. సంతోషం.

అయితే సనాతన ధర్మాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం, బ్రాహ్మణ వ్యతిరేక భావనల వ్యాప్తి వ్యాసం ఉద్దేశ్యంగా కనబడుతుంది. 


1) వేదరాశిని పరమ పవిత్రంగా, పరమ ప్రామాణ్యంగా స్వీకరించడం, గోవులను మాతృ భావంతో వ్యవహరించడం, గోసంరక్షణ సనాతనధర్మంలో  అతి ముఖ్యమైన అంశాలు. 


2) పునర్జన్మ సిద్ధాంతం హిందువులు విశ్వసిస్తారు. మరణానంతరం జీవాత్మ  ప్రయాణం గురించి సనాతన ధర్మాన్ని ఆచరించేవారి విశ్వాసాన్ని చార్వాకులు అంగీకరించక పోతే పోనివ్వండి. సమాజం లో అందరూ ఏకాభిప్రాయం ఉండాలని లేదు  కదా. ఇందులో బలవంత మేమీ లేదు.


చాగంటి, సామవేదం వంటి సనాతన ధర్మ ఆచార్యుల ప్రవచనం అనేకమంది ఇష్టపడి సాత్విక ధార్మిక భావాలు అలవరచుకుంటున్నారు. ధర్మచార్యుల బోధనలతో హైందవ సమాజానికి ధర్మ మార్గ నిర్దేశ్యం చేస్తున్నారు. ప్రకృతిలోని అణువణువు లో పరమాత్మను దర్శించి ఆరాధించే దర్శనం సనాతన ధర్మం అందిస్తున్నది. అయితే


కొంతమందికి రాం గోపాల్ వర్మ వంటి వారి భావాలు ఇష్టం కావచ్చు. మరికొందరికి గోగినేని బాబు అభిప్రాయాలు ప్రియం కావచ్చు. ఎవరి స్వభావం అనుసరించి వారికి ఆయా మార్గాలు నచ్చుతాయి. లోకో భిన్న రుచి:


3) ప్రపంచ వ్యాప్తంగా శాఖాహారం పట్ల సానుకూల భావన, స్వీకరించే వారి సంఖ్య పెరుగుతున్నది. ఆరోగ్య రీత్యా, మానవ శరీర నిర్మాణ రీత్యా, జీవ హింస దృష్ట్యా మాంసాహారం కంటే శాఖాహారం మంచిది అన్న విషయం అనేక పరిశోధన లలో తెలుస్తుంది. మానవాళి సాత్విక ఆహార అలవాట్లు దిశగా మళ్లటం మంచిదే కదా. హిందువులకు పరమ పవిత్రమైన గోమాత ను హింసించడం, గోమాంస భక్షణ చేయడం  అత్యంత క్లేశం కలిగిస్తుంది. అందుకే రాజ్యాంగం లో కూడా గో సంరక్షణ కోసం ఇలా పొందుపరిచారు


Article 48 of the Constitution of India States that the State shall endeavour to organise agriculture and animal husbandry on modern and scientific lines and shall, in particular, take steps for preserving and improving the breeds, and prohibiting the slaughter, of cows and calves and other milch and draught cattle.


నిజానికి మేకలు, గొర్రెలు వంటి జంతువులను కూడా సంరక్షించుకోవడం బాగుంటుంది. అయితే సమాజం లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వీలైనంత తక్కువ జీవహింస చేయడం ధర్మం మానవాళికి శ్రేయోదాయకం అవుతుంది.


4) వర్ణ వ్యవస్థ : చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ: అని భగవద్గీత లో ఉంది. గుణము కర్మ బట్టి వర్ణ విభజన అని గీతాచార్యుడు తెలిపాడు. అయితే దేశ కాల పరిస్థితులను అనుసరించి వర్ణ వివక్ష జరిగి ఉండవచ్చు. ఒక్క భారత దేశం లోనే కాదు ప్రతి దేశం లో ప్రతి మతావలంబీకులలో కూడా ఏదో ఒక రూపంలో వివక్ష అనేది కనబడుతుంది. దానికి వ్యతిరేకంగా సంఘ సంస్కర్తలు చేసిన పోరాటం కనబడుతుంది. 

మనుస్మృతి లోని అభ్యంతర కరమైన విషయాలను హైందవ సమాజం నిరాకరిస్తుంది. Most of Hindu society has moved on by reforming  itself. A few leftist pseudo secular self declared  intellectuals refuse to acknowledge this and try to harp on non existent issues. ఆదిశంకరులు , రామానుజులు వంటి ఆచార్యులు కాలం నుండి, గాంధీ, అంబేద్కర్ వంటి నాయకులు కృషి వల్ల చాలావరకు వర్ణ వివక్ష అనేది ప్రస్తుత కాలంలో తగ్గిపోయింది. దళితులకు స్వతంత్ర భారత రాజ్యాంగంలో అనేక రక్షణలు కల్పించ బడ్డాయి. హైందవ సమాజంలో సమస్యలు లేవని కాదు. అయితే కొన్ని విభేదాలు, వైరుధ్యాలు ఉన్నప్పటికీ సూత్రే మణిగణా ఇవ అన్నట్లు సనాతన ధర్మం అంతస్సూత్రం గా ఒకటిగా ఉంచుతున్నది.


నిజానికి అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం బ్రాహ్మణులు ఆర్థికంగా సామాజికంగా వివక్ష, దాడులకు గురి అవుతున్నారు. పౌరోహిత్యం  వృత్తి లో ఉన్న వారు, డిల్లీ వంటి చోట రిక్షా నడుపుకునే బ్రాహ్మణులు, ఎటువంటి రిజర్వేషన్లు లేక చిన్న చితక పనులు చేసుకుంటున్న బ్రాహ్మణులు, ఆర్థికంగా, సామాజికం గా దుర్భర పరిస్థితుల్లో ఉన్న GC కులాల వారు మేధావులకు కనిపించరా ?


GC Hindus and especially Brahmins are being discriminated against now. 


5) పితృ దేవతలకు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు చేయడం అన్నది సనాతన ధర్మం లో ముఖ్య భాగం. ఏదో ఒక విధానం లో మరణించిన వారి పట్ల కృతజ్ఞతతో, వారికి ఆత్మ శాంతికోసం దాన ధర్మాలు, రిచువల్స్, ప్రార్థనలు చేయడం, అన్న సంతర్పణ చేయడం అన్ని మతాల లోనూ ఉంది. హిందువులలో వారి వారి సంప్రదాయం అనుసరించి శ్రాద్ధ కర్మలు నిర్వహించుకుంటారు. వారి విశ్వాసం పట్ల ఇతరులకు అభ్యంతరం ఎందుకు ? ఒక ప్రాణిగా కాకికి పిండం తినిపిస్తే తప్పేముంది. హిందువుల సంప్రదాయాలను చులకన చేయడం ఎందుకు ?


యోగి వేమన ఒక అవధూత స్థాయికి చెందిన వ్యక్తి. ఆయన చెప్పిన మాటను సందర్భం బట్టి అన్వయించుకోవాలి. ఆయన లాగా సర్వ సంగ పరిత్యాగి యైన వారికి  ఆచార వ్యవహార నియమాలు వర్తించవు. సామాన్యులు ఆచారాలను కట్టుబాట్లను వదిలివేస్తే సమాజం పతనమౌతుంది.


5) స్త్రీ మూర్తికి సనాతన ధర్మం అత్యున్నత స్థానం కల్పించింది. దైవాన్ని మాతృమూర్తి గా, శక్తి స్వరూపిణి గా భావన చేసి ఆరాధించే విధానం కేవలం సనాతన ధర్మం లో మాత్రమే ఉంది. స్వభావ, శారీరిక, సమాజ పరిస్థితుల దృష్ట్యా కొన్ని నియమాలు, ఆచారాలను ఏర్పరిచారు. అవి కాలానుగుణంగా మార్పులు చెందుతూ సంస్కరణలు జరిగాయి.


6) పురుషసూక్తములోని “ బ్రాహ్మణో స్య ముఖమాసీత్ బాహూ రాజన్య: కృతః/ఊరూ తథస్య యద్వైశ్యః పద్భ్యాగ్ం శూద్ర: అజాయత" అనే శ్లోకం వివరిస్తుంది. బ్రాహ్మణుడు మహాపురుషుని ముఖంనుండి, క్షత్రియుడు భుజాలనుండి, వైశ్యుడు తొడలనుండి, శూద్రుడు పాదాల నుండి ఉద్భవించారని అర్ధం. More than in the literal meaning, it has to understood as a symbolic description.


ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే సమాజం అనే పిరమిడ్ నిర్మాణం గోచరిస్తుంది. ఈ శ్లోకాన్ని కుల దృష్టితో చూడడం సరికాదు. శరీరం లోని అన్ని భాగాలు సమానమే. ముఖ్యమే.


ధర్మాన్ని బోధించి నిలబెట్టేవారు, సమాజానికి మార్గ నిర్దేశనం చేసే వారు ఒక వర్గం. దేశాన్ని ప్రజలను రక్షించి క్రమ శిక్షణతో ఉంచే వారు, శత్రువులను, దుర్మార్గులను శిక్షించే వారు ఒక వర్గం. వ్యవసాయం, వర్తకం చేసి ప్రజలను పోషించే వారు ఒక వర్గం, వివిధ మార్గాలలో శారీరిక శ్రమ, కృషి చేస్తూ సమాజానికి పునాది వంటి వారు ఒక వర్గం. పాదాల నుంచి ఉద్భవించిన వారు ముఖ్యమైన వర్గం. కార్మిక వర్గం లేని సమాజం కుప్ప కూలిపోతుంది. ఏ దేవతకైనా గురువుకైనా పాదాలకు నమస్కరించడం, పూజ చేయడం సనాతన ధర్మంలో  భాగం. పాదములకు సామాన్య లోక వ్యవహారం లోని అర్థాన్ని పై శ్లోకాన్ని అన్వయించడం సరికాదు. అందువల్ల పురుష సూక్తం లోని పై శ్లోకాన్ని సరైన రీతిలో అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రోత్రియ బ్రాహ్మణులకు ధర్మ శాస్త్రాలు కఠినమైన నియమాలు, ఆచారాలు , విహితకర్మలు విధించాయి.


7) కర్మ సిద్ధాంతం అవగాహన చేసుకోవడం కష్టం. గహనా కర్మణో గతి: అని గీత లో ఉంది. కర్మ ఫలితం ఎప్పుడు లభిస్తుంది అన్నది చెప్పటం కష్టం. కర్మ సిద్ధాంతం హిందువులు నమ్ముతారు. ఆ విధంగా కష్టాలను సుఖాలను సమ దృష్టితో స్వీకరించే అవకాశం ఉంటుంది. బాధలు అనుభవిస్తున్న వారు నా కర్మ ఇంతే అని ఉండిపోరు. కష్టాలను అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే పోరాటం చేస్తారు. కేవలం ఫలితం మీదే దృష్టి ఉంచకుండా కర్మలను కుశలత తో చేయమని గీత బోధిస్తుంది. ఫలితం ఒక్కోసారి అనుకూలం కావచ్చు కాకపోవచ్చు.

కర్మ సిద్ధాంతం పై నమ్మకం లేనివారు తమ అభీష్టం ప్రకారం జీవిస్తారు. ఇందులో వివాదానికి చోటెక్కడ.

8) వివిధ గ్రామ దేవతలు, గిరిజన దేవతలు కుల దేవతలు కూడా సనాతన ధర్మంలో భాగమే. ఈనాటికీ గిరిజనులు, గ్రామీణులు తమ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సంప్రదాయాలను ఏ ధర్మాచర్యుడు నిరాకరించలేదు. అయితే గాసట బీసట గా ఉన్న ఆరాధనా పద్ధతులను ఒకరి కొకరు కలహించు కాకుండా ఆదిశంకరాచార్యులు పంచాయతనం పూజా విధానం స్థిరపరిచారు. షణ్మత స్థాపనాచార్య అని పిలిచారు. శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య , సౌర, స్కంద అని ఆరు శాఖలు గా హిందూ దేవతల ఆరాధన ను వర్గీకరించారు. అయితే వేదాలు, పురాణాల ఆధారంగా ప్రధాన దేవతల ఆరాధన కొనసాగుతుంది. ఇతర దేవతా మూర్తులు వారి వారి సంప్రదాయం అనుసరించి చేసుకుంటున్నారు. హిందువులలో ఎవరికీ ఈ విషయం లో పేచీ లేదు. కేవలం కువిమర్శకులకు హిందూ వ్యతిరేకులకే సమస్యగా కనిపిస్తుంది.


హిందువులు మైనారిటీ గా మారితే భారత దేశం పరిస్థితి ఏమౌతుందో ఒకసారి ఊహించండి. India is secular in nature because of Hinduism and Sanatan Dharma. The so called critics cannot even raise a single issue about other religions.


సనాతన ధర్మం అందించిన జ్ఞానరాశి, అద్భుత సాహిత్యం, కళలు, గో సంరక్షణ, అన్య మతాలపట్ల సహనం, గౌరవం, యోగ, ఆయుర్వేదం, ఇత్యాది గొప్ప విషయాలు సకల మానవాళికి అందించిన అమూల్య సంపద . స్మృతులు లేక శాస్త్రాలలో అందించిన గొప్ప సమాజ హితమైన ధార్మికమైన భావనలను స్వీకరించుదాము. ఆమోదయోగ్యం కాని అంశాలను వదిలి వెద్దాము. న అన్య: పంథా అయనాయ విద్యతే.


నాకు చేతనైన విధంగా సనాతన ధర్మం పై మీ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాను. అందులో తప్పులుంటే అంగీకరించడానికి, మార్చుకోవడానికి సిద్ధం.


Hope you read with open mind. Prejudice will blind one's vision.


సర్వే జనా సుఖినోభవంతు 🙏





15 comments:

  1. I didn't read the original post but your response is very balanced one with one exception.
    "సనాతన ధర్మం అందించిన మార్గంలో సాగడం సకల మానవాళికి శ్రేయస్కరం."
    Why the whole world has to follow one religion? This is the problem with a few in every religion that is causing problem to the whole world.

    ReplyDelete
    Replies
    1. మీ భావం అర్థమైంది. అందరూ ఒకే ధర్మం పాటించాలి అన్నది నా ఉద్దేశ్యం కాదు. ఆ వాక్యం మార్చాను.ధన్యవాదాలు. 🙏

      Delete
  2. Beautiful and balanced rebuttal of highly opinionated and prejudiced column of Bulloju. At one time I used to read his posts with interest since they used to be informative. But of late he seems to have made his focus to ceaselessly criticize brahmins and sanatana dharma. I am now getting tired of his tirades. To be fair I think he should now turn his focus on criticizing the drawbacks other religions as well - Islam, Christianity, etc.

    ReplyDelete
    Replies
    1. Thank you for your appreciative words.🙏

      Delete
    2. As an intellectual I respect Baba garu. However, in my opinion, he is having a very prejudiced and narrow view about Sanatan Dharma and Brahmins. Not sure he is open to self introspection or change his outlook. He seems to be too far invested in his skewed ideology.

      Delete
  3. మీ వివరణ బాగుంది. తన సంస్కృతి పట్ల సదభిప్రాయం ఏర్పడాలి అంటే విస్తృతమైన అధ్యయనం అవసరం. కానీ బాబాజీ గారి పద్దతి ఎలా అనిపిస్తుంది అంటే కొందరు వ్రాసిన పుస్తకాలు చదివి ఒక ధోరణి అలవాటు చేసుకొని అన్ని సమస్య లకు మూలకారణం ఒకటే అనుకోవడమే అసలు సమస్య. భారతీయ సనాతన ధర్మం పట్ల అసహన వైఖరి కలిగి ఉన్నపుడు అన్నీ ఆపసవ్యంగా అనిపిస్తాయి. ఈ వైఖరితో అభిప్రాయాలను వెలువరిస్తేనే ప్రస్తుత సమాజం లో ఒక గుర్తింపు లభిస్తుంది అన్నట్లుంది. కానీ వాస్తవం అర్ధం చేసుకోవడానికి విస్తృత అధ్యయనం, సదరు అంశాలపై పెద్దల మార్గ దర్శనం నిష్పాక్షిక వైఖరి చాలా అవసరం. దురదృష్టం కొద్దీ వారి బ్లాగులలో ఇదే కొరవడుతుంది. కొన్ని అంశాలపై ఉదాహరణ కు థెరి కవితలు, ప్రాకృత గాధలు చక్కగా పరిచయం చేశారు. అందుకు వారి కృషి ప్రశంసనీయం. సనాతన ధర్మం పట్ల వారి వైఖరి సుస్పష్టం. మీరు అడిగిన ప్రశ్నలకు వారి అభిమానుల ప్రతిస్పందన ఎలా ఉంది అంటే మీకు ప్రశ్నించే అర్హత ఉందా అన్నట్లు అడుగుతున్నారు. కానీ మీరు ఇచ్చిన సమాధానం చాలా వివరంగా ఉంది. మీరు చెప్పిన ఉపనిషత్ లను, ఇతి హాసాలను మూల రూపంలో చదివి అర్ధం చేసుకొని, వివిధ ప్రాంతీయ చారిత్రక వారసత్వ విశేషాలు అర్ధం చేసుకుంటూ ధర్మం పట్ల అవగాహన పెంచుకుంటే వారి వైఖరి లో సానుకూల మార్పు ఆశించ వచ్చు.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు. మీ స్పందనకు ధన్యవాదాలు.🙏

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. I generally read with interest Bulloju's posts since they add to my knowledge base in some areas I am not familiar with (Jainism, Budhism,.certain aspects of Indian history). I do not mind accepting Bulloju as an intelligent person and serious writer with varied interests. But I have serious reservation about calling him an intellectual. At least in his recent posts (regarding Hinduism/Sanatana dharma, Brahmins) he does not seem to have the objectivity and rigor which are the hallmarks of an intellectual. One should complete a deep study of the Upanishads and the philosophy in them before writing on Sanatana Dharma. A superficial knowledge of Vedic rituals, Manu SmRti, caste system, etc. will lead one to get a partial and distorted view of Sanatana Dharma. I hope Bulloju will benefit from the feedback from this and other comments.

    ReplyDelete
  6. చాలా బాగా చెప్పారండి

    సనాతన ధర్మం అందించిన జ్ఞానరాశి, అద్భుత సాహిత్యం, కళలు, గో సంరక్షణ, అన్య మతాలపట్ల సహనం, గౌరవం, యోగ, ఆయుర్వేదం, ఇత్యాది గొప్ప విషయాలు సకల మానవాళికి అందించిన అమూల్య సంపద . స్మృతులు లేక శాస్త్రాలలో అందించిన గొప్ప సమాజ హితమైన ధార్మికమైన భావనలను స్వీకరించుదాము

    ReplyDelete
  7. బాగుంది.
    సనాతన ధర్మం ఎప్పటికప్పుడు మారుతూ వచ్చింది,కాలానుగుణంగా. ఐతే కొందరు మనుస్మృతిలో ఒకటో రెండో మాటలు ముందు వెనుకల అన్వయం లేక మాటాడుతూనే ఉన్నారు. అక్కడే ఆగిపోయారు. కాలంతో సనాతన ధర్మం మారినా వీరు మారలేకపొయారు.స్మృతులు పద్దెనిమిది. కాలంతో పాటువచ్చినవి,వీటిని దేశమంతా పాటించనూ లేదు. కొన్ని చోట్ల కొన్ని స్మృతులు పాటించారు.వీటిని వేటినీ పట్టించుకోరు,వీరంతా. ద్వేషమే పరమావధిగా ఉన్నవారికి ఏమి చెప్పి ఉపయోగం.

    ఇక బ్రాహ్మణ ద్వేషం అన్నది నరనరాల ఇంకిపోయి ఉంది.ప్రచార యుగం కదా! బ్రాహ్మణులెప్పుడూ పాలకులు కాదు. పాలకులెవరు, నేటికీ మార్పులేని వారే! చిత్రం కొందరు ఇప్పటికీ తమకులనామాల చివర బ్రాహ్మణులు అనే చెప్పుకుంటారు, ఇదేమి? కొంతమంది ఏవైపూ బ్రాహ్మణులు పూర్వీకులుగా లేనివారు కూడా బ్రాహ్మణులం అని చెప్పుకుంటున్నారు, ఇది మరో విచిత్రం. అంత ద్వేషం పెంచుకున్నవారి పేరు ఎందుకు త్యజించలేదు. నేటికిన్నీ గ్రామాలలో బలహీనవర్గాల వారిని పీడిస్తున్నవారెవరు?చుండూరు వగైరాలెవరి చలవ? తెలియదా? తెలిసి కూడా అంటే వారినేమీ అనలేరు.ఎందుకనలేరు? ఏమన్నా మాటాడనివారు బ్రాహ్మణులే, లోకువ వారు.
    చదువుకున్నవారు ఈ ద్వేషానికి లొంగిపోవడమే జరుగుతున్న చరిత్ర.

    టపారాసిన మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  8. Thought Bolloju is an intellect, unfortunately he proved me wrong. His argument seems to be not open discussion but seeing through collard glasses. He is a confused man not an intellect.

    ReplyDelete