Tuesday, October 1, 2024

దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీ గీతాలు


Great masters.

Their work is laden with finesse. Emanates an unmissable radiance. Has a natural fragrance.

కృష్ణశాస్త్రి గారు వ్రాసిన సినీ గీతాలకు ప్రత్యేకత ఉంది.  దేవులపల్లి పల్లవులు వెంటనే ఆకట్టుకుంటాయి. ఎత్తుగడలు సంభాషణ రూపం లో విలక్షణంగా ఉంటాయి. 

సరళమైన భాష. లోతైన భావం.

సందర్భానికి తగినట్లుగా,  తెరపై కనిపించే పాత్రలు సహజంగా పాడుతున్నారు అనిపిస్తాయి. దర్శకుడి ఆలోచనను ఆవిష్కరించే విధంగా ఉంటాయి. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లాది రామకృష్ణశాస్త్రి గారు ఇరువురికి అచ్చ తెనుగు పదాలతో పాటలు అలవోకగా వ్రాయడం ఇష్టం కావచ్చు.  అయితే అద్భుత సంస్కృత గీతాలు కూడా వ్రాయగలిగిన మహా పండితులు.

ఆయనచేత మరిన్ని సినీ గీతాలు వ్రాయించుకొని ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది.

మల్లీశ్వరి చిత్రం లోని అన్ని పాటలు golden classics గా నిలిచి పోయాయి.

కొన్ని పాటల పల్లవులు 

--------------

తెరచి ఉంచేవు సుమా పొరబడి నీ హృదయము,  బిర బిరా ఏ సుందరియో చొరబడితే ప్రమాదము (ధనవంతులు గుణవంతులు)

 - who else can write such lines🙏

ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు -(ఈ నాటి బంధం ఏనాటిదో ) 

ఎదుటనుంచి కదలను పదములింక వదలను కళ్లకు నా చిన్న తండ్రి కనిపించే తీరాలి (వాడే వీడు) - gem of a song. Excellent tune by satyam in suddha saranga /bangala ragam.

కుశలమా నీకు కుశలమేనా (బలి పీఠం)- probably GOAT.

ఘనా ఘన సుందరా, సడిసేయకో గాలి, రావమ్మా మహాలక్ష్మీ, ఆకులో ఆకునై, ముందు తెలిసినా ప్రభూ, ఈ గంగ కెంత దిగులు, ప్రతిరాత్రి వసంత రాత్రి, ఇది మల్లెల వేళయని, చీకటి వెలుగుల...

కొలువైతివా రంగశాయి గీతం కూడా దేవుల పల్లి రచన అని తెలుస్తుంది. ఇది సంప్రదాయ కీర్తన కాబోలు అనిపించేది.

కొలువైతివా... రంగశాయి...

చరణం 1:

సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి..ఏవోయి...

కొలువైతివా... రంగశాయి..

చరణం 2:

సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట

పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి

కొలువైతివా... రంగశాయి...

చరణం 3:

ఔరా.. ఔరౌరా......

రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి

వురమందు తులసి సరులంతు కలసి మణి అంతముగ వహించి

సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి

ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి

జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి

ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ

శ్రీ రంగ మందిర నవసుందరా పరా కొలువైతివా... రంగశాయి...హాయి..కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి

కొలువైతివా... రంగశాయి

----------------------

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి - భరత మాత ను కీర్తిస్తూ రచించిన సుందర సుమధుర సంస్కృత గీతం. అందులో లాక్షారుణ పదయుగళా అన్న పదం అద్భుతం. పాదాలకు ఎర్రని పారాణితో భరతమాత ఎదురుగా వెలసిన భావన కలుగుతుంది 

పల్లవి :

జయ జయ జయ ప్రియ భారత

జనయిత్రి దివ్యధాత్రి

జయ జయ జయ శత సహస్ర

నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల

సుశ్యామచలచ్చేలాంచల

జయ వసంత కుసుమ లతా

చలిత లలిత చూర్ణకుంతల

జయ మదీయ హృదయాశయ

లాక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత

దివ్యగాన పరితోషణ

జయ గాయక వైతాళిక

గళ విశాల పద విహరణ

జయ మదీయ మధుర గేయ

చుంబిత సుందర చరణ |||

జయ జయ జయ |||

దేవులపల్లిగారి విశాల సాహితీ క్షేత్రం లో సినీ గీతాలు మల్లె తీగల వంటివి.  పుస్తకంలో ఒక అధ్యాయం వంటిది అని చెప్పవచ్చు. 

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?చంద్రికలనేల వెదజల్లు చందమామ?ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? 

(ఏల ప్రేమింతును? - కృష్ణ పక్షము)

🙏


No comments:

Post a Comment