శరన్నవరాత్రులలో బొమ్మలకొలువు పేర్చడం తమిళ నాడు, కర్నాటకలో కొంతమేరకు రాయలసీమ ప్రాంతం లో కనిపిస్తుంది.
ఆంధ్ర ప్రాంతం లో సంక్రాంతికి బొమ్మల కొలువులు చేసే సంప్రదాయం ఉంది.
దశావతారాల సెట్టు
భక్త కన్నప్ప
తంజావూరు బొమ్మలు
పద్మావతి అమ్మవారు శ్రీనివాసులు.
త్రిమూర్తులు
బొమ్మలకొలువు పేరంటం
సేతు బంధనం ఘట్టం చూపే బొమ్మలు
చెక్క పెట్టెలలో భద్రంగా దాచిపెట్టిన రంగు రంగుల మట్టి బొమ్మలు ఏటికేడు బయటకు తీసి, ఉన్న బొమ్మలకు అనుగుణంగా మెట్ల స్టాండు (పడి) చక్కగా ఏర్పాటు చేసి దానిపై తెలుపు లేదా ఇతర రంగులలో ఉన్న వస్త్రం పరచి దానిపై బొమ్మలను ఒక పద్ధతి లో మెట్లపై వరుసగా పేర్చుకుంటూ వీలైతే రంగు విద్యుద్దీపాలు కూడా ఏర్పాటు చేసి స్త్రీలు, పిల్లలు, పెద్దలు మురిసిపోతుంటారు.
ఎంత అందమైన ముచ్చట. తెలుగునాట ఈ సంప్రదాయం కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. తమిళ నాడులో మాత్రం ఈ నాటికీ అనేక చోట్ల అద్భుతంగా బొమ్మల కొలువులు (గోలు) పెడుతున్నారు.
దశావతారాల సెట్టు, రాములవారి సెట్టు, అష్ట లక్ష్ముల సెట్టు, రాధాకృష్ణులు, శివపార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, గోమాత, వివిధ దేవతా మూర్తుల బొమ్మలు, ఇవి కాక papier mache తో అచ్చు కూరగాయలు, పండ్లను పోలిన బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, తంజావూరు బొమ్మలు, వివాహ వేడుక ను చూపే బొమ్మలు, పిల్లలకు నచ్చే బొమ్మలు ...
బొమ్మల కొలువు పెట్టిన ఇళ్లన్నీ తిరిగేస్తూ సందడి చేసే పిల్లలు, పేరంటాలకు పిలుచుకునే స్త్రీలు - ఇది చాలా ఆహ్లాదం కలిగించే సంప్రదాయం.
దేవుడు చేసిన బొమ్మలు మనుషులైతే, మనుషులే దేవుళ్ళ బొమ్మలు చేసి, పేర్చి ఆనందించే వేడుక ఇది.
ఏటికేడు కొన్ని పాత బొమ్మల స్థానం లో కొత్త బొమ్మలు వచ్చి చేరుతుంటాయి.
అన్ని వస్తువుల లాగే బొమ్మల ఖరీదు పెరిగింది. కొత్తగా బొమ్మల కొలువు పెట్టాలంటే దాదాపు 20-30 వేలు ఖర్చు అవుతుంది. అందుకే ఒక సామూహిక ఉత్సవం లాగా కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది.
ఈ వేడుకను మరింతగా ప్రోత్సహించి ఆచరించాల్సిన అవసరం ఉంది.
అందరికీ ఒకే వర్ణం, ఒకే రూపు, ఒకే మతం, ఓకే దేవుడు ఉండాలి అని కోరుకునే వారికి సనాతన ధర్మం లో ఉన్న ఇలాంటి వేడుకలు,
సృష్టి లో ఉన్న వైవిధ్యం రుచించవు. వేల ఏళ్ల నాటి బొమ్మ లను పగులగొట్టే వారు, సుందమైన శిల్పాలను ధ్వంసం చేసే వారు అందమైన బొమ్మల కొలువు చూసి ఆనందించలేరు.
మనదేశం లోని బొమ్మల కొలువు వంటి ప్రత్యేక హైందవ సంప్రదాయాలు నిరంతరంగా కొనసాగాలి అని కోరుకుందాము.
No comments:
Post a Comment