Friday, January 10, 2025

ధనుర్మాసం సంగీత విశేషాలు - భాగ్యనగరం

మార్గళి మాసం  చెన్నైలో కర్నాటక సంగీత కచ్చేరీల సీజన్. అనేక సంగీత సభలలో వర్ధమాన సంగీత కళాకారుల నుంచి నిష్ణాతుల  దాకా సంగీత కార్యక్రమాలు జరుగుతాయి. శ్రోతల నుంచి విశేష ఆదరణ కూడా ఉంటుంది. వారి ధనుర్మాసం అంటే మనకు మార్గశిర పుష్య మాసాలలో సగం సగం రోజులు కలుస్తాయి.

హైదరాబాద్ లో కూడా వివిధ సంగీత సభలు పుష్య మాసంలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు , సంగీత సప్తాహాలు జరపడం ఆనవాయితీ.


ఈ ఏడాది సంప్రదాయ సంగీత ట్రస్టు అనే సంస్థ వారిచే సంకీర్తనోత్సవ్ -2025 జరుగుతోంది. ఉన్నత శ్రేణి విద్వాంసులతో కచేరీలు ఏర్పాటు చేశారు. వాణీ నగర్, మల్కాజ్ గిరి లో ఉన్న విజయ గణపతి ఆలయం ప్రాంగణంలో  కొన్ని రోజులుగా ఈ సభలు జరుగుతున్నాయి. గొప్ప సంగీత కళాకారుల కచ్చేరీ వినే మంచి అవకాశం వచ్చింది. కొన్ని విశేషాలు


1) డి వి మోహనకృష్ణ - 4-1-25 vocal

2) జొన్నలగడ్డ శ్రీరాం  - 5-1-25 vocal

3) విఘ్నేశ్ ఈశ్వర్ - 6-1-25 vocal

4) సంగీత కళానిధి టీ ఎమ్ కృష్ణ - 7-1-25 vocal

5) డి శ్రీనివాస్ - 8-1-25 - వీణ

6) సంగీత కళానిధి లాల్గుడి జి జె ఆర్ కృష్ణన్ - వయొలిన్ 9-1-25

7) మల్లాది బ్రదర్స్ - 10-1-25  vocal 


అన్ని కచేరీలు అద్భుతంగా జరిగాయి. పక్క వాద్యాలు కూడా పేరొందిన కళాకారులు సహకారం అందించారు.


4th Jan - మోహన కృష్ణ గారు బాలమురళి గారి బాణీ ని చక్కగా ప్రెజెంట్ చేశారు.  అక్కడక్కడా కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నా ఓవరాల్ గా బాగుంది. ఆయన వయసు ఇతర పరిమితుల రీత్యా ఒక్కరే కచ్చేరీ చేయడం కంటే శిష్య బృందం తో కలిసి చేస్తూ ఒకటిరెండు పాటలు వరకే పాడితే నయమేమో అనిపించింది.


5-1-25 జొన్నలగడ్డ శ్రీరాం మంచి ప్రతిభ ఉన్న యువ గాయకుడు. He is a talented singer with good repertoire. అతని కచ్చేరీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దీక్షితుల వారి ఆనంద నటన ప్రకాశం కృతి కేదార రాగం లో అద్భుతంగా వచ్చింది. Good accompanying artists enhanced the concert. ఇతను సంగీత ఆచార్యుడిగా కూడా రాణిస్తున్నాడు అని తెలిసింది. He was one of the key persons behind these concerts. 


On all days Sriram gave introduction and conclusion speeches with good narration about the artistes. He is very fluent in English too.


6th Jan - చెన్నై కు చెందిన  విఘ్నేశ్ ఈశ్వర్ కచ్చేరీ బాగా సాగింది. మంచి గాత్రం, రేంజి, ప్రతిభ కల గాయకుడు. He has gained a good name in Chennai circuit. It was really nice to hear his live concert. Mrudangam by Delhi Sai Ram was a blast. Sometimes it felt as though singer's voice was getting drowned in the accompanying instruments.


7 వ తారీఖున టి. ఎమ్ కృష్ణ కచ్చేరీ జరిగింది. ఈ సంవత్సరం మ్యూజిక్ అకాడమీ వారిచే సంగీత కళానిధి అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఇతనికి అవార్డు ఇవ్వడం పై పెద్ద వివాదమే జరుగుతోంది. అతని భావజాలం, ideology  పక్కన  పెడితే ఒక గాయకుడిగా ప్రతిభ కలవాడు అన్నది నిజం. జనం అధిక సంఖ్యలో వచ్చారు. కచ్చేరీ బాగా సాగింది. ముఖ్యంగా మనోధర్మం తో అతను ఎాడిన అలాపనలు ఆకట్టుకున్నాయి. He knows the art of playing to the gallery. He has a strong voice. He may not be a genius singer but with dint of hardwork he has achieved good success.ముఖ్యంగా వయొలిన్ సహకారం అందించిన హెచ్ ఎన్ భాస్కర్ అద్భుతంగా వాయించాడు. HN Bhaskar was too good.



8th Jan - Surprise. Real surprise package was the veena recital by D Srinivas Garu from Hyderabad. I didn't know that he plays so well. ఈతని వీణ కచ్చేరీ అద్భుతంగా జరిగింది. He has a pleasant demeanor and played in a relaxed manner. ముఖ్యంగా పక్క వాద్యం లెజెండ్ కార్తీక్ ఘటం వాయించడం అద్భుతం. పారుపల్లి ఫల్గుణ మృదంగం, కొమండూరు కృష్ణ వయొలిన్ సహకారం కూడా బాగుంది.


9-1-25 నాడు సంగీత కళానిధి సంగీత సామ్రాట్ లాల్ గూడి జయరామన్ తనయుడు 2022 సంగీత కళానిధి గ్రహీత లాల్గూడి కృష్ణన్ గారి వయొలిన్ కచ్చేరీ జరిగింది.

మోహన రాగం లో నను పాలింప నడచి వచ్చితివో.  ప్రధానమైన అంశంగా వినిపించారు. అధ్భుతం. భావప్రియ అనే అరుదైన రాగం లో  శ్రీకాంత నీ యెడ బలాతి బల అనే త్యాగరాజ స్వామి కీర్తన అలవోక గా వాయించారు.


I felt fortunate to hear the Great master from such proximity. His violin music flows like a river and virtually feels like a vocalist singing through violin 🎻. Felt happy to take a photo with him for which he agreed with a smile. 



10-1-25 - మల్లాది బ్రదర్స్ గాత్ర కచ్చేరీ జరిగింది. సంప్రదాయ సంగీత పద్ధతిలో సాహిత్యం, భావ ప్రకటన కు ప్రాధాన్యం ఇస్తూ సాగింది. As individual singers their performance is underwhelming. We can't expect elaborate and intricate alienations in their voice,  but when they sing together, they sound good. They are well trained singers with good repertoire and knowledge. Even though their voice is not very melodious, when they sing together, it is good to hear. 

భైరవి రాగం లో దీక్షితార్ కృతి 'బాల గోపాల పాలయ ఆశు మాం' ప్రధాన కీర్తన గా పాడారు. 
ఈ కచేరీ లో మల్లాది శ్రీరాం కుమార్ గారి తనయుడు మల్లాది శివానంద్ మృదంగం అద్భుతం గా వాయించాడు. I have no doubt in saying that he is an outstanding artiste. చిన్న వయసులోనే ఇంత గొప్పగా వాయించాడు. తను గాయకుడు గా కూడా రాణిస్తున్నాడు. He has bright future and will make malladi brothers proud. ప్రముఖ విద్వాంసుడు  ఎంబార్ కణ్ణన్ గారు వయొలిన్ అద్భుతంగా వాయించారు. He gracefully agreed to click a picture with him. మల్లాది శ్రీరాం గారు భద్రాచల రామదాసు కీర్తనలు శ్రోతలతో కలిసి పాడించారు. బాగుంది. 

ఈ వారం అంతా ఇలా అద్భుత సంగీత కళాకారుల కచేరీలు వినే భాగ్యం కలిగింది. ప్రతి రోజూ కార్యక్రమం చివర్లో  ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు.  నిర్వాహకుల కృషి, శ్రమ ఎంతైనా అభినందనీయం. 
పుష్య బహుళ పంచమి నుంచి మరో సంస్థ వారిచే సంగీత కార్యక్రమాలు  జరగనున్నాయి. 🙏🏻

No comments:

Post a Comment