ఈ గీత రచన ఒక విలక్షణ ప్రయోగం గా భావిస్తున్నాను.
ఒక గాడిద 🐴 ఒక పంది 🐖 మధ్య మంచి స్నేహం ఉండి వారిరువురూ కలిసి ఆనందంగా ఒక పాట పాడుకుంటే ఎలావుంటుంది అన్న ఊహ లోనుంచి ఈ గీతం వచ్చింది. ఇది ఒక సరదా ప్రయోగం మాత్రమే తప్ప ఎటువంటి వెటకారం లేదా చెడు తలంపు లేదు అని మనవి. అనాదిగా మనుష్యులతో కలిసి జీవిస్తున్న రెండు జంతువుల పై అభిమానం తో వ్రాసిన పాట. నిజానికి ఆ రెండు జంతువుల మనసులోకి నేనే ప్రవేశించి వ్రాశాను.
నేను ముచ్చట పడి వ్రాసుకున్న పాట ఇది. ఎవరినీ ఉద్దేశించినది కాదు ఎటువంటి అపోహలకు తావులేదు అని మరొక్క సారి మనవి చేస్తున్నాను.
-----------------
గా : నేనొక గాడిదను.
నీవొక మంచి పందివి -2
పం: నీవొక గార్దభము
నేనొక వరాహమును..
యుగళం :
మనమిరువురము మంచి మిత్రులము
ఒకరికి ఒకరు తీసిపోము
గా: నేనొక గాడిదను
నీవొక సూకరమవు -2
నేనొక మేలిమి గాడిదను...
గా: గార్దభమని నను పిలుచుచుందురు -2
పం: సూకరమని నను కొందరందురు -2
గా: ఖరమని కూడా పేరు పొందితిని
పం: వరాహమని నను ప్రీతి బిలిచిరి
గా : నేనొక గాడిదను.
నీవొక మంచి పందివి -2
పం: నీవొక గార్దభము
నేనొక వరాహమును..
గా: నిందలు విని విని చెందితి ఖేదం
గానముతో మరి పొందెద మోదం
పం: కలలో చెదరని మన మైత్రి
సృష్టిలో కడు వైచిత్రి
యుగళం : కలుగును మనకు ఘనకీర్తి
పం: నీవొక గార్దభము
నేనొక వరాహమును..
గా: నా గానం అమృత తుల్యం ....
పం: కర్ణపేయం నా గాత్రం ....
గా: నా కంఠములో రసవృష్టి
పం: ఆస్వాదించే నా రసదృష్టి
యుగళం: కలిసి చేద్దాము స్వరసృష్టి
గా: సుగుణములు కల నా క్షీరం
పం: ఔషధములకై ఈ శరీరం
యుగళం : మనుజుల సేవకే మన మంకితం
నేనొక గార్దభము
నీవొక సూకరమవు -2
నేనొక మేలిమి గార్దభము...
--------------
🙏🏻🙏🏻
ఇదేదో శర్మగారు జిలేబీ ల పైన సెటైరులా వుంది :)
ReplyDeleteసుగుణములు కలిగిన నా క్షీరం.... :)
ఎంత మాత్రమూ కాదు అని మనవి🙏🏻
Deleteవాగ్గాయ కారుడిగా
ReplyDeleteante?
ReplyDeleteవాగ్గేయ కారుడు అని చెప్పుకుంటే టూ మచ్ అవుతుంది అనిపించి వాగ్గాయ కారుడు అని వ్రాశాను. 🐀🐁🐴🐖🐏🐓🐦🐥🦜🐧🐦⬛🦆🦚
Deleteavi vidividga rayakudademo, okate padam kadoo? bahuvrihi? ావాగ్గాయ ante emiti?
Deletebahuvrihi vigrahavakyala samasala saram nenu jivitamlo cheranochani tiram annadevaru?
అయ్యో అంత ఆలోచించలేదు. ఎవ్వరూ కనిపెట్టకుంటే కొత్త పదాలు ఎలా పుడతాయి అన్నట్టుగా వాగ్గాయకారుడు అన్న పదం వ్రాశాను. వాక్కు + గాయకుడు అని చెప్పవచ్చేమో🙏🏻
Deleteవాక్ + గాన
Deleteమీరు కొంటెగా వాగుడుకాయ అన్న సరదా ప్రయోగంతో ఆ పదాన్ని అంటుగట్టి అలా ప్రయోగించి ఉంటారని నేను -ర్ధం చేసుకున్నా తూచ్.
Deleteవాక్కు తో గాయం చేసేవాడు వాగ్గాయకారుడు అని అనుకున్నా ఓకే. 🙊📢. ఇంతకీ గీతం ఎలా ఉందో ఎవరూ చెప్పారు కాదు.
Deleteవాగ్గేయకారుడు - వాక్కే గేయంగా కలవాడు - బహువ్రీహి సమాసం
ReplyDeleteవాక్కు తో గాయం - మాటల్తో కొడతానంటారు, సరే :)
ReplyDeleteవాగ్గాయకారుడు
ReplyDeleteవాక్కే కాయము గా గలవాడు
అనగా చాటర్బాక్స్ :)