🥭🥭🥭🥭
"వన్నెగలరు పసుపు వర్ణాల పండు,
కమ్మనైన వాసనల ఈ పండు,
తియ్యనైన తియ్యటి రసమిచ్చు పండు,
మామిడి పండు మన జాతీయ పండు!" (From Google)
🥭🥭🥭
మామిడి పండ్లు అయినా మల్లె పూలు అయినా ఎండా కాలంలోనే సహజంగా సీజనల్ గా దొరుకుతాయి.
ఎన్నో దశాబ్దాలుగా మామిడి పండ్లు తింటూనే ఉన్నాము. ఈ ఏడాది కొంచెం ఎక్కువగానే తింటున్నాము.
కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాలలో మంచి పండ్లు, అనేక రకాలు దొరుకుతాయి. రాయలసీమ ప్రాంతంలో బంగినపల్లి ఎక్కువగా ఇష్టపడతారు. నేను అనంతపురం లో నివసించినప్పుడు బంగినపల్లి తప్ప మరొక రకం తెలియదు.
హైదరా బాదులో కూడా మంచి పండ్లు బాగానే లభిస్తున్నాయి.
🥭🥭🥭
బంగిన పల్లి రకం - king of mangoes. అయితే మే 15 తరువాతే కొనడం మంచిది. అంతకుముందు రుచి చూస్తే పైకి పచ్చగా లోపల చప్పగా లేక పుల్లగా ఉంటాయి.
బంగిన పల్లి రకం లో ఉలవ పాడు వి నంబర్ వన్ పండ్లు. మరే ఇతర పండు దీనికి సాటి రాదు అని ఘంటా పథం గా చెప్పవచ్చు.
🥭🥭🥭
హైదరాబాదులో మే మొదటి వారం నుంచి దశేరి రకం దొరుకుతాయి.చాలా బాగుంటాయి. పైకి ఆకుపచ్చ లేదా లేత పసుపు రంగు లో చిన్నవిగా కోలగా ఉంటాయి.
అయితే ఉత్తర ప్రదేశ్ పంజాబ్ రాష్ట్రాల్లో జులై ఆగస్టు నెలలలో పెద్ద దశేరీ పండ్లు వస్తాయి. చాలా బాగుంటాయి.
🥭🥭🥭
చెరుకు రసాలు రకం హైబాద్ లో ఇటీవల బాగా వస్తున్నాయి. Evergreen variety with minimum guarantee. చెరుకు పానకం లాగా చాలా బాగుంటాయి.
🥭🥭🥭
ఈ సారి కేసర్ రకం పండ్లు కూడా బాగా వచ్చాయి అవి కూడా చాలా బాగున్నాయి.
🥭🥭🥭
ఇక పెద్ద రసాలు, చిన్న రసాలు, నూజివీడు రసాలు మంచి క్వాలిటీ దొరికితే అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక్కోసారి పుల్లగా ఉంటాయి
🥭🥭🥭
కొత్తపల్లి కొబ్బరి రకం ఇక్కడ అంతగా దొరకదు ఖరీదు కూడా ఎక్కువ. చాలా బాగుంటుంది. ఇది రెండువిధాలుగా ఉపయోగపడుతుంది. ఆవకాయకు నంబర్ వన్ రకం. పీచు పులుపు బాగా ఉంటుంది . పండుగా మారితే కూడా చాలా మధురంగా ఉంటుంది.
🥭🥭🥭
ఇమామ్ పసంద్ రకం పీచు అనేది ఉండదు బాగా పండితే ఐస్ క్రీమ్ లాగా నోటిలో కరిగిపోతుంది. బాగుంటుంది.
ఉత్తర భారతం రకాలు కేసరి, langara , మల్లికా, కర్ణాటక వారి బాదామి కూడా బాగానే ఉంటాయి.
ఈ సారి పంచదార కలశ రకం కూడా రుచి చూసాను.
🥭🥭🥭
మహారాష్ట్ర వాళ్ళు Alphonso రకం మామిడిపండ్లకే రారాజు అంటారు. చాలా ఖరీదైన రకం. నేను ముంబాయి వెళ్ళినప్పుడు ఒక పెట్టే కొన్నాను. రుచి నాకు అంత గొప్పగా అనిపించలేదు. అయితే export quality పండ్లు చాలా బాగుంటాయి అని విన్నాను.
🥭🥭🥭
మా ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంది. అది ఏమి రకము అర్థం కాదు. ఏటా కాయలు బాగానే కాస్తుంది. పులుపు ఉండదు. అయితే పండితే మాత్రం ఒక మోస్తరు రుచి ఉంటుంది. నీలం పండు అయి ఉండవచ్చు.
సీజన్ అయిపోతుండగా కలెక్టర్ కాయలు లేదా తోతాపురి వస్తుంటాయి. ముక్కలు చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటే బాగానే ఉంటాయి. కొంతమంది వీటితో బెల్లం అవకాయ చేస్తారు అని తెలుస్తుంది. జ్యూస్ లకు, తాండ్ర చెయ్యటానికి కూడా ఉపయోగిస్తారు.
ఇప్పుడు బంగినపల్లి రూ. 50 -70 , రసాలు - 70-80 అలా దొరుకుతున్నాయి. అయితే సీజన్ మొత్తానికి ఆవకాయ, మాగాయ, మామిడి పళ్ళ ఖర్చు వేల రూపాయలు అవుతోంది.
ఎన్ని రకాల పండ్లు ఏడాది పొడుగునా దొరికినా మామిడి పండ్ల సీజన్ కోసం అందరూ ఎదురు చూస్తారు. వేసవి లో నెయ్యి వేసుకుని ఆవకాయ అన్నం , మామిడికాయ పప్పు, పెరుగు అన్నంలో లేదా విడిగా మామిడి పండు తినడం కంటే ఇంకేమి కావాలి.
🥭🥭🥭🥭
No comments:
Post a Comment