Tuesday, February 23, 2010
ఇళయరాజా టాప్ 10 పాటలలో ఒక్కటి

Saturday, February 20, 2010
’హంసనాదం’ లో ఈ రెండు పాటలు
ముందు ’ఈ పాట’ (తెండ్రల్ వందు - జేసుదాసు, జానకి ) తదుపరి ’ఇదీ’ (సొర్గమే ఎండ్రాలుమ్ - ఇళయరాజా-జానకి-1990) వినండి. చిత్రీకరణను పట్టించుకోవద్దు.
హంసనాదం రాగాన్ని ఇళయరాజా చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా రాజా సంగీతంలో percussion instruments కు ఒక విశిష్టత కనిపిస్తుంది. ఎన్నిరకాల beats సృష్టించాడో. పైరెండు పాటలలో beat ను గమనించండి. హంసనాదంలో నాకు తెలిసి ’నీవు నేను వలచితిమీ’ అన్న బాలమురళి-సుశీల గార్లు పాడిన పాట కర్ణ సినిమాలో ఉంది. ఎమ్మెస్వీ సంగీతంలో. చాలా హృద్యమైన రాగం. బంటురీతి కొలువియ్యవయ్యరామ ప్రసిద్ధ కీర్తన.
ఒక చిన్నమాట:అంతగా హిట్టవ్వని ఒక చిరంజీవి సినిమాలో కూడా రాజా హంసనాదంలో ఒకగీతం స్వరపరిచాడు. tune బాగుంటుందికానీ వేటూరి మసాలా లిరిక్కులు బాగుండవు .

Thursday, February 18, 2010
బాలమురళి + ఇళయరాజా + రీతిగౌళ = ఒక మంచి పాట
ఈ అపురూపమైన పాట బాలమురళీ, ఇళయరాజా ఇంకా కొన్ని పాటలకోసం కలిసి పనిచేసిఉంటే ఎంతబాగా ఉండేదో అనిపిస్తుంది. అసలు బాలమురళి గొంతును సినీపరిశ్రమ సరిగా వినియోగించుకోలేదు. అదొక తీరని వెలితి. ఒక విషయం ..
గొప్పగాయకులకు పాట (మధ్యలో వచ్చే సంగతులు కూడా) టేకాఫ్ ఎలా చేయాలి లాండింగ్ ఎక్కడచేయాలి అన్న విషయంమీద గట్టి పట్టు ఉంటుంది. నేను విన్నంతలో బాలమురళి, ఘంటసాల గారలకు ఈ విషయం లో సంపూర్ణ ఆధిపత్యం ఉంది.
ఈ రీతిగౌళ లోనే ఏదో లాగేసుకునే మాయ ఉంది (ఇదే విధంగా చాలా రాగాలవిషయంలో నాకు అనిపిస్తుంది). ఇప్పటికి ఇదిసత్యం. ఇదే సత్యం.
ఇంతమంచి పాటలను కొత్తతరంవారు కూడా వినాలని నాకోరిక. ఏపాట అయినా సంగీతాన్ని, సాహిత్యాన్ని విడివిడిగానే ఆస్వాదించడం బాగుంటుంది. . టీనేజీలో వింటూ పెరిగిన తమిళ్/కన్నడ పాటలు శాశ్వతంగా మనస్సులో తిష్ట వేశాయి.
:ఇదే రాగంలో శేషశైలావాస గీతం, రామాకనవేమిరా పాట అందరికీ సుపరిచితమే.

Subscribe to:
Posts (Atom)