Sunday, August 26, 2012

సాయి ఈ జగమే నీ ద్వారకా మాయి.- నాగార్జున సాయి పాటలు

 నాగార్జున శిరిడి సాయి పాటల గురించి చెప్పాల్సి ఉంది. నాగ్ first look లో చాలా బాగున్నాడు అనిపించింది. కానీ తెచ్చిపెట్టుకున్నట్టు లేకుండా , unwanted gait లేకుండా హాయిగా సహజంగా నటిస్తే ఇంకా బాగుంటుంది.

కీరవాణి stable నుంచి వచ్చిన ఈ album బాగుంది అని చెప్పవచ్చు. నాకు ముఖ్యంగా నాలుగు పాటలు నచ్చాయి.

1) నీ పదముల ప్రభవించిన గంగా యమున : చిలుక పలుకుల composer chose to sing the best song of the album. కీరవాణికి ఈ ’పాడు’ గుణం ఎప్పటికి పోతుందో. పాట ఎత్తుగడ పీలగా అందుకోవటం బాగాలేదు. ఈ పాట బాలు పాడితే గొప్పగా ఉండేది. సునీత మంచి గాయని కానీ గొంతులో పీచు మిఠాయి లేదా నెమలి ఈక పెట్టుకుని పాడినట్టు ఉంటుంది. స్పష్టత తక్కువ. కొంతమంది perform చేస్తే బాగుంటుంది. మరికొందరు mentors లేదా tutors గా ఉంటేనే నయం. కళాకారులు ఈ విషయం గుర్తెరగాలి. అయితే ఒకటి. నలుగురి ముందు ప్రదర్శన ఇచ్చి మెప్పుపొందాలనుకోవటం అత్యంత సహజమైన విషయం. అయితే ఇప్పుడు సునీత గారికి ఉన్న matured voice మరొకరికి లేదు.

పాటలో మనసును తాకే రెండు పదాలు:" నీవులేని చోటు లేదు సాయి. ఈ జగమే నీ ద్వారకా మాయి". రచన రామ జోగయ్య. పాటలో ’ముక్కోటి దైవాలు ఒక్కటైన నీవు ఏకమనేకమ్ముగా విస్తరించినావు’ అన్న చోట ఎంతో హృద్యంగా కళ్యాణి రాగం వినిపించింది.

2) వస్తున్నా బాబా వస్తున్నా: పాటలో pathos పలకాలంటే శుభపంతువరాళి సరైన రాగం. భక్తులను సాయి అనునయిస్తూ, అభయమిస్తూ పాడటం బాగుంది. నానావళికి (?) మాత్రం కీరవాణి గొంతు బాగానే నప్పింది.

3) ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి : పాట బాగుంది. మధు బాలకృష్ణ గొంతు హాయిగా ఉంటుంది. కానీ శ్రుతి కొంచెం sine wave లా ఉంటుంది. తిన్నగా సరళరేఖలా ఉంటే ఇంకా బాగుంటుంది. పాట మధ్యలో శహన లో సునీత గొంతు కలపటం బాగుంది.

4) మానవసేవే మాధవసేవని : విన్నవెంటనే ఆకట్టుకునే గుణం ఉన్న పాట ఇది. దీపు, అదితి పాల్ . బాగానే పాడారు కానీ పదాల ఉచ్చారణ leaves a lot to be desired. సత్వమూర్తి అన్న పదం స్పష్టంగా పలకొద్దూ. for once the composer chose not sing this song and wrote the lyrics instead. ఈ పాట వింటూ హాయిగా నిద్దురలోకి జారుకోవచ్చు.

బాలు సునీత పాడిన సాయి అంటే తల్లి పాట కూడా బాగుంది. సాయి పాదం పాట సాహిత్యం అత్యుత్తమంగా (వేద వ్యాస) ఉంది. పాట ఎత్తుగడ మాండ్ రాగంలో బాగుంది. కానీ ఎందుకో మాండ్ రాగాన్ని bits and pieces లోనే ఎప్పుడూ వాడుతున్నారు.

తక్కిన పాటలు కథాగమనానికి తోడ్పడేలా ఉన్నాయి. చూస్తూ వింటేనే బాగుంటాయి. శంకర్ మహదేవన్ పాడిన పాట అంతగా ఆకట్టుకోలేదు. తనకు ఇంకా మంచి బలమైన పాట ఉండాలి.

ముక్తాయింపు: కీరవాణి మంచి సంగీతం కూర్చాడు. ఇళయరాజా, ఆదిత్య పౌడ్వాల్ బాణీలు కట్టిన సాయిబాబా చిత్రాలపాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ పాటలు కూడా  వింటే బాగున్నాయి.   cinema లో రాఘవేన్ద్రరావు మార్కు crudeness లేకుండా ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను.





2 comments:

  1. మీ టపా చదివేసి, ఒక్కో పాట వింటూ.. మీరు రాసింది చదివాను. మీ పరిశీలనలన్నీ నిశితంగా ఉన్నాయి; సముచితంగా ఉన్నాయి. ‘మానవ సేవే’ బాణీ బాగుంది. ‘సాయి పాదం’ సాహిత్యం మీరన్నట్టే బాగుంది. ట్యూన్ కూడా తగినట్టుగా సరిపోయింది.

    ఈ ఆల్బమ్ లో బాలుకు రెండు పాటలే ఇవ్వటం మాత్రం లోటుగా అనిపిస్తోంది..

    కీరవాణిని ‘చిలుక పలుకుల కంపోజర్’ అనటం నవ్వు తెప్పించింది.:)

    ReplyDelete
  2. వేణు గారు: నెనర్లు.-- తెలుగు అభిమాని

    ReplyDelete