Monday, September 30, 2013

'ఘటాకాశం' లో 'కొంతకాలం' విద్యా విహారం

ఆకాశంలో కుండ ఉందా కుండలో ఆకాశం ఉందా అంటే రెండూ నిజమే. కానీ ఆకాశంలో ఘటం ఉంది అందులో శబ్దం ఉంది. అది ఇలాంటి పాటలో చెవులను తాకుతుంది అన్నది నిండునిజం. రాగం దాదాపుగా శుద్ధ ధన్యాసి. కొన్ని అన్య స్వరాలు వేయటం విద్యసాగర్ కు అలవాటే.

పాటలో ఘటం చక్కగా ఉపయోగించాడు విద్యసాగర్. పాడినది మధు బాలక్రిష్ణన్. బాగానే పాడాడు కానీ ఇదేపాటను జేసుదాసు గొంతులో 80 లలో  వినిఉంటే  ఇంకా బాగుండేది.

విద్యాసాగర్ చంద్రముఖి చిత్రానికి మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులోని కొంతకాలం పాట చాలా బాగుంటుంది. పాట mostly శ్రీ రంజని లో ఉన్నది.పాట మొత్త్తం హాయిగా ఉంటుంది. ముఖ్యంగా రెండవచరణానికి ముందు వచ్చే interlude ఆకట్టుకుంటుంది

'both the above songs are contemporary in feel and

 traditional at the roots'  

ఇవి నా పదాలు కావు. ఒక ఆంగ్ల వ్యాసం లో నుంచి 

దించుకున్నాను.



సంప్రదాయ రాగాలు ఆలంబనగా ఆధునిక బాణీలను కట్టడం అనే ఈ విద్యను విద్యాసాగర్ బాగా నేర్చుకున్నాడు.


పాట లో ఒక finesse తో కూడిన  కల్పన చేయటం masters కే 

సాధ్యం అనిపిస్తుంది.


3 comments:

  1. రెండు పాటలూ శ్రావ్యంగా ఉన్నాయ్. దీటుగా మీ విశ్లేషణ కూడా! మీ శీర్షిక ప్రత్యేకంగా బాగుంది.

    ReplyDelete
  2. అవునండీ, ఆ సినిమాలో నాకు నచ్చేదీ కొంత కాలం కొంత కాలం పాటే!

    అలాగే స్వరాభిషేకం సినిమాలో "ఇది నాదనీ అది నీదనీ" పాట కూడా చక్కని బాణి.

    విద్యాసాగర్ బాణీల్లో అందం తెలియాలంటే కొంత పరిజ్ఞానం అవసరమేమో! వినగానే ఆకట్టుకోవు గానీ వింటున్న కొద్దీ రసాలూరతాయి

    ReplyDelete
  3. మీరు చెప్పిన తమిళ్ పాట అమ్మాయి నచ్చింది మూవీలో కలే కన్నానులే పాటని గుర్తుకు తెచ్చింది.

    ReplyDelete