కొన్ని పాటలకు మనసును దేశ, కాలాంతర సంచారం చేయించే లక్షణం ఉంటుంది. పాటలు విన్నతరువాత కాలమాగినట్టు, నయగారా జలపాతం హిమంగా మారే మహిమ ఏదో జరిగినట్టు అనిపిస్తుంది.
'విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం, నిజాంతర్గతం' అన్నట్టుగాను కొండ అద్దమందు కొంచమై ఉండదా అనికూడా అనిపిస్తూ మనసులోనే విశ్వదర్శనం అవుతుంది. .
ఆత్మసౌందర్యం ఉట్టిపడే అలాంటి మూడు పాటలను ఒక్కసారి గుర్తు చేసుకుంటాను.
మూడింటికీ ఇళయరాజా సంగీతం.

2) పుత్తం పుదు కాలై అనే ఈ పాట 'అలైగళ్ ఓయ్వదిల్లై ' (1981) (తెలుగులో సీతాకోక చిలుక) చిత్రంలోనిది. గానం s జానకి గారు. పాటను ఎంతో గొప్పగా 'clean vocals ' తో పాడారు.
3) 'పూ మాలయే' - పగల్ నిలవు (1985) చిత్రంలోనిది. పాడినవారు ఇళయరాజా, s జానకి గారు.
ఇళయరాజా best output 1980 నుంచి 1988 కాలంలో ఇచ్చాడని నా అభిప్రాయం. సినీ సంగీతాన్ని తన avant garde quality తో redefine చేసాడు అని చెప్పవచ్చు.
పై పాటలు వచ్చి ముప్పై ఏళ్ళు అయినా ఇంకా contemporary గా అనిపిస్తున్నాయి. అది గొప్ప పాటల లక్షణం. విన్నకొద్దీ sense of deja vu.
మొదటి పాట, మూడో పాట నాక్కూడా చాలా ఇష్టమైన పాటలండి. రెండో పాట మాత్రం ఇదివరకు వినలేదు. ఆ పాట తెలుగులో "మాటే మంత్రము" పాట సిచ్యువేషన్ లో వస్తుందా? ఏమైనా ఇంకో అందమైన పాటని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు :)
ReplyDeleteఇళయరాజా అందించిన చాలా పాటల్లో గొప్పతనం అదే. ఎన్నిసార్లు విన్నా విసుగు పుట్టించవు. విన్నకొద్దీ తరగని మాధుర్యం. తరచి చూసేకొద్దీ అచ్చెరువొందించే అందం! మీరు పేర్కొన్న మూడు పాటలూ బాగున్నాయి.
ReplyDeleteశ్రావ్యమైన పాటలు అరుదైపోతున్న ఈ రోజుల్లో sense of deja vu కలిగించే ఇలాంటి ఆణిముత్యాల పాటల కోసం కాలంలో వెనక్కి ప్రయాణించాల్సిందే !
వేణు గారు, జ్యోతి గారు! thank you
ReplyDelete