మలయమారుతం ఉదయరాగం. మేలుకొలుపులకు అనువుగా ఉంటుంది. మల్లెమొగ్గలపై నిలిచిన నీటి తుంపరలంత నవ్యంగా ఉంటుంది.
ఒక్క పాట ను పునశ్చరణ చేసుకుంటాను.
ఈ పాట 'ఒరు ఓడై నదియాగిరదు' అన్న చిత్రం లోనిది. పాడినవారు కృష్ణ చంద్రన్, శశిరేఖ. సంగీతం ఇళయరాజా. ఈ పాట మలయమారుతానికి ఒక చక్కని ఉదాహరణ. పాటలో రఘువరన్ dance చేస్తే amusing గా అనిపిస్తుంది. ఇదే cinema లో ఇళయరాజా రీతిగౌళ లో ఒక అద్భుతమైన పాట స్వరపరిచాడు.
మలయమారుతం విన్న తరువాత వేసంకాలంలో తెల్లారగట్ల చన్నీటిస్నానం చేసినట్టుగానూ పునర్జన్మ ఎత్తినట్తుగానూ అనిపిస్తుంది. కొత్తకుండలో నీళ్ళు తాగినట్టుగా కూడా ఉంటుంది. మంచిగంధం మైనలదికొన్నట్టుగా కూడా ఉంటుంది.
వేసవి మధ్యాహ్న వేళ చలివేన్దిర పెట్టినట్టుగా, మజ్జిగలో నిమ్మపండుపిండి, చిటికెడు ఉప్పు, కరివేపాకు వేసి తాగి సేదతీరినట్టుగా కూడా ఉంటుంది.
మలయమారుతంలోని 'కొండగాలి తిరిగింది పాటను, మేలుకో శృంగార రాయ' అన్నమయ్య పాటను పాత టపాలలో చెప్పుకున్నాను.
అయినా చైత్రంవచ్చీరాకముందే చిత్రంగా ఎండలు చిటపటమంటున్నాయి ఎందుకో. తొందరపడి ఏ కోయిలైనా ముందే కూసేసిందేమో.
వసంత రుతువును స్మరిస్తూ మీరు పంచుకున్న ఈ పాట బాగుంది. దీనికి తగ్గట్టుగా మీ వ్యాఖ్యానం... మలయమారుత సదృశం!
ReplyDeleteసాఫ్ట్ విలనీకి మారుపేరైన రఘువరన్ ఇంత సాఫ్ట్ గా డాన్స్ చేయటం విచిత్రమనిపించింది. చైత్రమాసాన్ని స్ఫురింపజేే ఈ పాటలో కనిపించిన నటి మనోచిత్ర !
వేణు గారు: thank you
ReplyDelete