Wednesday, November 23, 2016

నగుమోము గనలేని మా జాలి తెలియని ఆబాలగోపాలమురళి

ద్విశతాబ్దగాయకుని మహాభినిష్క్రమణం జరిగింది. 86 వసంతాల జీవితం లో 80 ఏళ్ళు సంగీత వేదికను వీడని కళాకారుడు భూప్రపంచములో మరొకరు లేరు.  వారి నగుమోము, మృదు సంభాషణ, సున్నిత హాస్యభరిత ధోరణి, అన్నిటినీ మించి వారి గాత్రమాధుర్యం అభిమానులకు మిగిలిన జ్ఞాపకాలు. 

వారు ఠీవిగా నడిచివచ్చి 'భారత రత్న' పురస్కారం అందుకుంటుంటే చూడాలని ఎంతో ఆశ పడ్డాము. మనకిక ఆ అదృష్టం లేదు. భారత రత్న గౌరవానికి ఆయనకు మించిన అర్హులు లేనేలేరు. కనీసం మరణానంతరమైనా ప్రకటించి భారత ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని ఆశిస్తాను. 

3 octaves range మాధుర్య, శ్రుతి లోపం లేకుండా సాధించిన ఏకైక గాయకుడు అంటే అతిశయోక్తి కాదు. 

నగుమోము, ఎందరో మహానుభావులు, త్యాగరాజ పంచరత్న కీర్తనలు , రామదాసు కీర్తనలు, తత్వాలు, తిల్లానాలు, రాగం తానం పల్లవి ...  ఆయన పాడితే వచ్చే నిండుతనం మరెవరికీ సాధ్యం కాదు.  

ఎందరో గొప్ప గాయకులు ఉన్నారు. Some have melody. Some have range. Some have immaculate sruthi. Some have good pronunciation. Some know how to regale audiences.  Some have creativity. Some bring out the essence of sahitya. Some sing with manodharma. Very few become trendsetters. Fewer artistes set benchmarks. Balamurali is the combination of all these qualities. He has the magical voice to mesmerise audiences.

 Another likeable trait is his openmindedness to all kinds of music genres. His classic jugal bandis with Pt. Bhim sen joshi are legendary.  He embraced and elevated film music as well. His voice was not fully utilized by the film industry. 

శంకరాభరణం, త్యాగయ్య, అన్నమయ్య వంటి చిత్రాలలో ఆయన పాడి ఉంటే ఎంతో బాగుండేది. It would have lent authenticity to the music. That was not to be. Maybe the film folks were diffident to approach a towering personality like him. 

During later stages of his career he wanted to be known as vaggekayara. He invented ragas and composed kritis. In my opinion they serve as new syllabus for advanced performers. 

ఆయన ఎన్ని కొత్త కీర్తనలు పాడినా రసికులు ' నగుమోము' లేదా 'ఎందరో మహానుబావులు' లేదా ' ఏమి చేతురా లింగా', 'పలుకే బంగారమాయెనా' కావాలని అడిగి పాడించుకుంటారు.  
బాలమురళి స్వరపరచిన 'తిల్లానా' లు 'thrillana ' లుగా పేరుపొందాయి. 

This youtube video has a rare gem of the concert he gave at Bombay to the accompaniment of the legendary performers Lalgudi and Umayalpuram in 1962. 
నగుమోము గలవానికి  నివాళిగా వారే వెలిగించిన అఖండజ్యోతి. 

mandolin శ్రీనివాస్, పినాకపాణి, నేదునూరి, బాలమురళి. . తెలుగునాట కర్ణాటక సంగీతానికి మరి దిక్కెవ్వరు? 









Monday, September 19, 2016

కళ్యాణ వసంతం లో ఒక కొంత సేపు కాలమాగి పోతుంది.

యధాలాపంగా ఇటీవల గాయని సునీత పాడిన ఈ అన్నమయ్య పాట విన్నాను. సంగీతం సాయి మధుకర్. (1.40 to 9.05)
SVBC వారి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో.
పాట బాణీ , సునీత చక్కగా పాడిన తీరు, సంగీతం and of  course అన్నమయ్య lyrics అన్ని కలిసి అరుదైన, ఇట్టే ఆకట్టుకునే  రాగంలో ఉన్న ఒక మంచి పాటను  విన్న అనుభూతి కలిగింది. సునీత has done 100 % justice to the song. అలమేలు మంగ పాడుకున్న ఈ పాటకు కళ్యాణ వసంతం రాగం బాగా కుదిరింది.  This ragam seems to be particularly apt for the female devotee who longs for the Lord.

సాయి మధుకర్. ఇటీవలి కాలంలో మంచి స్వరకర్తగా పేరు తెచ్చు  కుంటున్నాడు. ప్రముఖ భక్తిసంగీతకారుడు  సాయి కృష్ణ   యాచేంద్ర కు బంధువు. వేంకటగిరి రాజా వారి మనుమడు అన్న విషయాలు తెలిసాయి. 
He seems to have the ability to compose good fusion music. I saw his interview and liked it. He seems to have a fair knowledge of traditional music and is nicely adding modern elements. 
He has already worked with great singers such as SPB Sir, Chitra Garu, Shankar Mahadevan and classical music legends viz. Pt. Shiv kumar Sharma, Ronu Mazumdar. He has a bright future. The best thing about him is that he prefers devotional music to routine meaningless film music with banal lyrics. It is not my intention is to belittle film music.

కళ్యాణ వసంతం. ఈ రాగం కీరవాణి జన్యం. strikingly similar yet delightfully different. 
ఈ రాగం లో బాగా తెలిసిన పాట 'మాధవా మాధవా నను లాలించరా ' (శ్రీరామకథ - SP కోదండపాణి- ఘంటసాల-సుశీల). i think that this is one of the top duets sung by Ghantasala susheela garu. 

MSV compose చేసిన 'కాంచి పట్టుడుతి'  (MSV-KJ Yesudas, Vani Jayaram). A beautiful song which brings out the essence of the ragam. 

త్యాగరాజ స్వామి ప్రసిద్ధ కృతి ' నాదలోలుడై' (KS Gopalakrishnan flute+MSG Violin + Umayalpuram mridangam)

సునీత గారి  పాట worked like a trigger and prompted me to write this post.

చిన్నప్పుడు భక్తి రంజని లో వేదవతి ప్రభాకర్ గారు పాడిన మీరా భజన్ తెలుగు  గీతాలు (సినారె) . అందులో మ్రోగించేనే మురళి మ్రోగించేనే అనే పాట. Songs which appeal to one's heart stay with you for life. 















Thursday, August 18, 2016

ఖరహరప్రియ లో 'స్వామి' 'పక్కల నిలబడి' పాడిన పాట .


 కర్ణాటక సంగీత ప్రపంచంలో కె.వి. నారాయణస్వామి (1923-2002) గారిది సమున్నత స్థానం .


melody+ pure tradition+ mastery+classicism+ manodharmam అన్నిటి మేలుకలయికే వారి గానం. 'నెరవల్' నారాయణస్వామి అని వారిని అభిమానంతో పిలుచుకుంటారు. నెరవులు (singing a phrase in the charanam in kaliedoscopic melodic structures bringing out the essence of the ragam)   వైవిధ్యభరితంగా పాడటం వారి ప్రత్యేకత. 
పాలఘాట్ మట్టిలో , నీటిలో, గాలిలో  ఏమి మహత్తు ఉందొ కానీ కర్ణాటక సంగీతానికి fountainhead గా నిలిచింది. 

 kvn పాడిన  'పక్కల నిలబడి'  ( ఖరహర ప్రియ- త్యాగరాజ స్వామి) కీర్తనలో నెరవుల మెరుపులు విరుపులు (మనసున తలచి) వినవచ్చు. 
----------------------------------
పక్కల నిలబడి కొలిచే ముచ్చట
బాగా తెల్ప రాదా


చుక్కల రాయని కేరు మోము గల
సు-దతి సీతమ్మ సౌమిత్రి రామునికిరు (పక్కల)


తనువుచే వందనమొనరించుచున్నారా
చనువున నామ కీర్తన సేయుచున్నారా
మనసున తలచి మై మరచియున్నారా
నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీరిరు (పక్కల)
----------------------------------------------------------

20 వ శతాబ్దపు ప్రథమార్ధం - అరియకుడి, సెమ్మంగుడి, GNB , చెంబై  - ద్వితీయార్థం ఎమ్మెస్, బాలమురళి, kvn, నేదునూరి.. సుసంపన్నం చేశారు.

 ఖరహరప్రియ రాగంలో 
ఒకపరి కొకపరి వయ్యారమై  (అన్నమయ్య - ఉన్ని కృష్ణన్)
సంగీత సాహిత్య సమలంకృతే (స్వాతికిరణం-SPB -సినారె-kvm) - అత్యుత్తమమైన సాహిత్యం, సంగీతం, బాలు అద్భుత గానం. 
బాలనురా మదనా (మిస్సమ్మ, సుశీల, SRR , పింగళి). 
ఇళయరాజా సంగీతం లో  'ఆనందం పొంగిడ'  (KJY - సునంద ) అనే అద్భుతమైన పాట ఉంది. ముఖ్యంగా ఈ పాటలో interludes చాలా బాగుంటాయి. 


Sunday, February 7, 2016

పడమటి సముద్రానికి అవతల సంగిత పెన్నిధులున్నాయి.

పాశ్చాత్య సంప్రదాయ  సంగీతం  పసిఫిక్ సముద్రంలాగా విస్తృతమైనది లోతైనది కూడా.  It is amazing how so many musicians read and play music with so much discipline all in perfect harmony. బృంద  వాయిద్య సంగీతాన్ని వారు అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళారు. 

ప్రధానంగా మూడు శకాలలో పాశ్చాత్య  సంగీత సంప్రదాయాలు నెలకొల్ప బడ్డాయి. 
1) baroque era - 1600-1750

2) classical era - 1750 - 1820

3) romantic era - 1820 - 1910 

పదుల సంఖ్యలో గొప్ప పాశ్చాత్య  సంగీతకారులు ఉన్నప్పటికీ, as per connoisseurs, the  top three slots go to :


1) J.S. Bach  - Germany 
2) L v Beethoven - Germany 
3) WA Mozart. - Austria 

"A symphony is a large, multi-movement work for orchestra. It calls for instruments from all four sections (winds, strings, percussion, and brass) and explores a complete range of melody, harmony, rhythm, dynamics, and timbre."

సంగీత విమర్శకులు ఏకగ్రీవంగా J.S. Bach ను పాశ్చాత్య సంగీతపు అత్యుత్తమ composer గా చెబుతారు.  bach సమయానికి concerto లు ఉండేవి. (which is the precursor to symphony in which an archestra plays around a chief  instrumentalist like pianist or a violinist or a flautist) . symphony originated and evolved in the classical era. Joseph Haydn is considered to be the father of symphony music who wrote more than 100 symphonies. Mozart and Beethoven wrote many symphonies which form part of the treasurehouse of  western classical music. 

మూడు examples 
1) Symphony NO. 40 of Mozart  - ఇది భారతీయులకు చిర పరిచితమే. ఈ symphony లోని  తొలి వరుసలను  ఛాయ' అనే హింది చిత్రంలో 'ఇతన న ముఝె' పాటలోఅందంగా ఉపయోగించాడు సలీల్ చౌదరి. రెహమాన్  జై హో పాటకు కూడా  ఈ symphony యే ప్రేరణ అని చెప్పవచ్చు. 
2) titan watches ad లో ఉపయోగించిన Symphony NO. 25 of Mozart ( 1.38 దగ్గర నుంచి).  
ఇళయరాజా మీద పై ముగ్గురి ప్రభావం ఎంతో ఉంది. ముఖ్యంగా గీతాంజలి చిత్రంలోని  ఈ bgm ఎంత అద్భుతంగా ఉందో మనకు తెలుసు. (2. 11 నుంచి). మన సినిమాలలోని నేపథ్య సంగీతం లో 70 % మూలాలు పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో.  symphony సంగీతం లోని complexity చూస్తే అసలు మానవమాత్రులకు ఇది సాధ్యమా అనిపిస్తుంది. great masters  స్వరపరచిన compositions ను యథా తథంగా ప్రపంచంలోని గొప్ప గొప్ప philharmonic archestra వారు perform చేయగా వినటం  ఒక గొప్ప out of this world అనుభూతిని ఇస్తుంది.  










Friday, January 15, 2016

కమల్ హాసన్ majestic ad ఇంకా కల్యాణి మాలిక్ good music-కొన్ని కబుర్లు

కమల్ హాసన్.  pothy's ad.- wow. ఒక మహా నటుడు మొదటిసారి ad చేస్తే ఆ effect really awesome. his tremendous screen presence and majestic voice lift the ad to a different level. this ad is in telugu as well and equally good. kamal dubs his own voice.
 yes. he reminds me of svr and shivaji. in total control of the scene.

there is no one like you kamal sir. i like kamalji's interviews. his subtle sense of humour, humanism,zest for cinema and society is immensely likeable.

ఈ ఇంకో ad కూడా బాగుంది. నాకు నచ్చింది. the superstar is ageing gracefully. we like to see him in such roles now.

కళ్యాణి మాలిక్. he is a talanted composer. Younger Brother of the great composer Keeravani garu. అతను సంగీతం కూర్చిన  కొత్త సినిమా 'కళ్యాణ వైభోగమే' పాటలు విన్నాను. ఒక పాట (చిరునవ్వులే) really stands out- for its music, singing, lyrics. హరి చరణ్ ఉచ్చారణ బాగుంది.