జ్ఞానపీఠ గ్రహీత మహా కవి డా. సి. నారాయణ రెడ్డి గారు రచించిన అభినందన మందారమాల పాట ఒక మధుర గీతం. ఈ పాట పల్లవిలో ఉపయోగించిన సంస్కృత పదాలు చరణాలలో వినిపించే అచ్చ తెనుఁగు పదాలు వినసొంపుగా ఉన్నాయి .రాజేశ్వరరావు గారు చక్కని బాణీ, సుశీలమ్మ, జేసుదాసు గారి గానం, మంచి చిత్రీకరణ కలిసిన గీతం ఇది.
చిత్రం : తాండ్రపాపారాయుడు
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : కె.జె.జేసుదాస్, పి.సుశీల
పల్లవి :అభినందన మందారమాల... (3)
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల
స్త్రీ జాతికీ ఏనాటికీ స్మరణీయ మహనీయ వీరాగ్రణికి
అభినందన మందారమాల...
అధినాయక స్వాగతవేళ...
అభినందన మందారమాల
చరణం : 1
వేయి వేణువులు నిన్నే పిలువగ
నీ పిలుపు నావైపు పయనించెనా॥
వెన్నెల కన్నెలు నిన్నే చూడగా (2)
నీ చూపు నా రూపు వరియించెనా
నా గుండెపై నీవుండగా...
దివి తానే భువిపైన దిగివచ్చెనా
అభినందన మందారమాల...
అలివేణీ స్వాగతవేళ...
అభినందన మందారమాల
సౌందర్యమూ సౌశీల్యమూ నిలువెల్ల
నెలకొన్న కలభాషిణికి
అభినందన మందారమాల
చరణం : 2
వెండి కొండపై వెలసిన దేవర
నెలవంక మెరిసింది నీ కరుణలో॥
సగము మేనిలో ఒదిగిన దేవత (2)
నునుసిగ్గు తొణికింది నీ తనువులో
ప్రియ భావమే లయరూపమై
అలలెక్కి ఆడింది అణువణువులో
అభినందన మందారమాల
ఉభయాత్మల సంగమ వేళ
అభినందన మందారమాల
సందర్భానికి సన్నివేశానికి తగిన సాహిత్యం తో సినారె అద్భుత గీతం అందించారు.
సినారె వ్రాసిన మరొక అద్భుత సాహిత్యం.
అమ్మను మించి దైవమున్నదా
ఆత్మను మించి అద్దమున్నదా
జగమే పలికే శాశ్వత సత్యమిది
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటే
అవతార పురుషుడైనా
ఓ అమ్మకు కొడుకే.
సినారె అద్భుత సాహిత్యం కలిగిన ఎన్నో సినీ గీతాలు ఉన్నాయి. ఆయన తొలి గీతం నన్ను దోచుకుందువటే , పగలే వెన్నెల, నిన్న లేని అందమేదో, ప్రణయ రాగ వాహిని, చిత్రం భళారే విచిత్రం, ఎంత మధురం ఈ క్షణం, ఎదురుగా నీవుంటే, వటపత్ర శాయికి, సంగీత సాహిత్య సమలంకృతే, చరణ కింకిణులు, ఏమో ఏమో ఇది, వస్తాడు నా రాజు ఈ రోజు, నేడే ఈ నాడే మురిపించె నన్ను, వ్రేపల్లె వేచేను, నీ పేరు తలచినా చాలు ...కొన్ని వందల గీతాలు.. అన్ని కూడా ఆణిముత్యాలు.
మనకు ఎందరో గొప్ప సినీ గీత రచయితలు ఉన్నారు. ఎన్నో మంచి గీతాలు రచించారు. అయితే సినారె గారు నా అభిమాన రచయిత అని చెబుతాను. ఆయన సినీ గీతాలు ఒక అపురూప సంపద. ఎన్నటికీ నిలిచి ఉంటాయి.
No comments:
Post a Comment