వాటిలో కుంతల వరాళి తిల్లానా మరింత ప్రియమైనది. The genius of balamurali Garu is displayed in this beautiful composition.
బాలమురళి గారి మద్రాసు సంగీత ప్రస్థానం లో ఒక unsavoury incident ఉంది.
వారు గణపతి, మహతి, లవంగి ... ఇత్యాది కొత్త రాగాలను కనుగొన్నారు. అవి కర్ణాటక సంగీత విద్వాంసుల చేత ఆమోదించ బడ్డాయి.
అయితే ఎస్. బాలచందర్ అనే ఒక వైణికుడు కొత్త రాగాల సృష్టి సమ్మతం కాదు అంటూ బాలమురళి తో వివాదానికి దిగాడు.
బాలమురళి కొంత సంప్రదాయ పరిధి దాటి చేసిన ప్రయోగాలు కూడా పరమ సాంప్రదాయ వాదులైన సెమ్మంగూడి శ్రీనివాస అయ్యర్ వంటి వారికి నచ్చలేదు. ఈ నవ రాగ సృజన వివాదం పెద్దదై కోర్టు దాకా వెళ్లిందని అందులో బాలమురళి గారికి అనుకూలంగా నిర్ణయం వచ్చిందని బాలమురళి గారి శిష్యులైన శ్రీ బాలకృష్ణ శాస్త్రి గారు చెప్పారు.
బాల చందర్ అసూయ తో బాలమురళి గారిపై అనవసర వివాదం కల్పించాడు అని వారు చెప్పారు. ఈ బాల చందర్ సెమ్మంగుడి గారి తో కూడా స్వాతి తిరుణాల్ మహారాజు కృతుల విషయం లో విభేదించాడు.
అయితే బాలమురళి గారికి కర్ణాటక సంగీతములో మేరు నగ సమానులైన సెమ్మంగూడి గారంటే అపార గౌరవం భక్తి భావం కూడా ఉన్నాయి. ఈ వివాదం విషయం లో వారు నొచ్చుకో కూడదని బాలమురళి గారు సెమ్మంగూడి గారి ఇంటికి వెళ్లి వారికి కొత్త బట్టలు పెట్టి పాదాభివందనం చేశారు సెమ్మంగూడి గారి ఇంటిలో భోజన ఆతిథ్యం స్వీకరించారు. ఆ సందర్భంలో సెమ్మంగూడి గారి కుటుంబ సభ్యులు బాలమురళి గారిచే కుంతల వరాళి తిల్లానా పాడించుకొని ఆనందించారు అని శాస్త్రి గారు చెప్పారు.
కొన్ని కచేరీలలో సెమ్మంగూడి గారికి బాలమురళి గారు వయొలిన్ పక్క వాద్యం కూడా వాయించారు.
Puritans like Semmangudi, Madurai Mani Iyer, Ariyakudi, KV Narayana Swamy etc. don't like to swerve from the traditional classical carnatic music format. Balamurali garu was more prone to experimentation. He was open to all forms of music including semi classical, light music, film music etc. The ego clash between conservatives and liberals is inevitable. At the same time everyone used to respect the others. All are giants in their own right.
ఈ కుంతల వరాళి రాగం హరికాంభోజి జన్యము.
స్వాతి తిరునాళ్ కృత ' భోగీంద్ర శాయినం ' ఎమ్మెస్ అమ్మ గారి గాత్రం లో. సంస్కృత కీర్తనల ఉచ్చారణలో ఎమ్మెస్ అమ్మ గారు అందరికీ ఆదర్శం.
ఈ రాగం లో ' ఆది దైవమా జోహారు ' అనే పాట భక్తి రంజని లో వినిపించేది.
ఒక తమిళ సినీ గీతం ఈ రాగం లో MSV సంగీతం లో ఉన్నది . మంచి పాట. (జయచంద్రన్ - ఎస్ జానకి అమ్మ )
సంగీత కబుర్లు స్వస్తి. 🐇🐘🐘
No comments:
Post a Comment