కన్నడ చిత్రం కాంతార ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఈ చిత్రం ద్వారా రచయిత దర్శకుడు నటుడు అయిన రిషభ్ శెట్టి భారత దేశంలో Native cultures, pagan traditions ఎదుర్కొంటున్న సమస్యలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాడు.
It is good movie. Honest, raw, rustic, unapologetic in its premise and presentation.
Shetty has done a good job in weaving a commercial story that shows respect to native tradition, with forest deities at its core.
అన్యమత వలస పాలనలో దాడికి గురి అయిన హైందవ భారతీయ సంస్కృతి ,మన పండుగలు, మన ఆలయాలు, గ్రామీణ, వనవాసులు , గ్రామీణ ఉత్సవ సంప్రదాయాలు, కట్టు బాట్లు, సంప్రదాయ కళలు, సాహిత్యం ...
స్వాతంత్య్రం అనంతరం సమున్నతి, అభ్యదయం పొందలేక secularism పంజరం లో బందీగా మిగిలాయి.
In general, మన మీడియా, సినిమా, పాఠ్య పుస్తకాలు మహోన్నతమైన మన సనాతన ధర్మం పట్ల నకారత్మక, తిరస్కార ధోరణి తో వ్యవహరిస్తున్నాయి అన్నది కఠోర వాస్తవం.
ముఖ్యంగా ప్రకృతి శక్తులు, గ్రామ దేవతలు, వనదేవతలు, వారితో అవినాభావ సంబంధం, అనుబంధం, భక్తి కలిగి ఉన్న ప్రజలు...
పై విషయాలపై అవగాహనాలేమి, తిరస్కార భావంతో అహంకార పూరితంగా వ్యవహరించే, అధికార వ్యవస్థలలోని కొందరు వ్యక్తులు.
దేవతల, ప్రకృతి శక్తుల అనుగ్రహం ఆగ్రహం అర్థం చేసుకోలేని అహంకార పూరిత, స్వార్థ పరులకు ఈ చిత్రం ఒక సమాధానం చెబుతుంది.
Government institutions, certain faiths and officials often function with holier than thou attitude . They think that it is their right to reform native people whereas many a time it is such instituitions, officials and faiths which need reform.
వందల ఏళ్లుగా ఎవరికీ ఏ సమస్యా లేకుండా టపాకాయలు పేల్చి చిన్నా పెద్దా ఆనందంగా హిందువులు జరుపుకునే పండుగలపై ఆంక్షలు పెట్టడం.- The movie subtly raises such issues.
There is an important lesson in the movie.
The way the adament forest official eventually understands the significance of native traditions and respects them shows the writer- director's vision.
దేవతల ఆగ్రహం, అనుగ్రహం ఆ దేవతలతో, ప్రకృతి శక్తులతో మమేకమైన ప్రజలకు తెలుస్తుంది. మట్టితో, అడవితో, జంతువులతో స్థానికులకు ఉన్న మమకారం, అనుబంధం, so called refined, educated , intellectuals, officials, అర్థం చేసుకోవాలి అన్న సందేశం ఉంది.
విశ్వాసం, భక్తి ఉన్నవారికి దేవతల, ప్రకృతి శక్తుల, వన దేవతల రక్షణ, అనుగ్రహం తప్పక ఉంటుంది.
అలాగే స్వార్థ పూరిత వ్యక్తులు, land lords, అమాయకులకు అన్యాయం చేస్తే దేవతల ఆగ్రహం ఎలా ఉంటుందో .. చిత్రం లోని చివరి 20 నిముషాలు చూస్తే తెలుస్తుంది.
Great performance by Rishabh Shetty in the climactic moments. Audience will feel the presence of the Deity in the Bhuta kola.
The music, photography and acting of lead actors is natural and in keeping with the tenor of the movie.
వరాహరూపం పాట సంగీతం, చిత్రీకరణ విస్మయం కలిగిస్తుంది. అయితే taikkudam bridge అనే musical band వారి నవరసం అనే పాటను పోలిఉంది అని తెలిసింది. Yes. Varaharoopam is inspired from the navarasam song. They should have given credit to taikkudam bridge.
భూత కోల, పోతురాజులు, గణాచారులు, రంగం, అమ్మోరు, ఆవహించడం ..ఈ సంప్రదాయాలు మన దేశ ప్రజల విభిన్న సంస్కృతిలో అంతర్భాగం. ఈ సంప్రదాయం తరతరాలుగా ఆచరించే కుటుంబాలు, వారిని విశ్వసించే, గౌరవించే ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఒక మంచి చిత్రాన్ని అందించిన రిషభ్ శెట్టి అభినందనీయుడు. క్షేత్రం, మూల దేవత, క్షేత్ర పాలక దేవతల ప్రాధాన్యం గురించి చెప్పడం బాగుంది.
Within the commercial format, the movie showcased the native tradition with honesty.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మరిన్ని చిత్రాలు ఇదే ఒరవడి లో వస్తే బాగుంటుంది.
దేవీ మాహాత్మ్యం పురాణం ఆధారంగా ఒక అద్భుత చిత్రం నిర్మాణం జరిగితే బాగుంటుంది అని నా ప్రగాఢ ఆకాంక్ష.🙏
No comments:
Post a Comment