ప్రతిమధ్యమ మేళకర్త రాగాలలో ఒక ప్రముఖమైన రాగం సింహేంద్ర మధ్యమం. లేదా సింహేంద్ర మధ్యం.
శుద్ధ మధ్యమం కలిగి ఉన్న కీరవాణి రాగానికి దగ్గరగా ఉంటుంది.
ఒక పోలిక.
ప్రకృతి లో ఇప్పటి దాకా 118 మూలకాలు గుర్తించబడ్డాయి. ప్రతి మూలకానికి స్వాభావిక, ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అయితే అన్ని మూలకాలు అతి సూక్ష్మ స్థాయి లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అనే పరమాణువులు కలిగి ఉంటాయి అని చదువుకున్నాము.
అలాగే కర్ణాటక సంగీతం లో 72 మేళకర్త రాగాలు ఉండగా అన్నింటికీ సప్త స్వరాలు లేక వాటి variants తో కలిసి 12 లేదా 16 స్వరాలు building blocks గా ఉన్నాయి.
ప్రతి రాగమూ విశిష్ట లక్షణాలు, ప్రత్యేక అస్తిత్వం కలిగి ఉన్నది.
That was a wild comparison to visualise how different arrangement of the same building blocks results in formation of distinct entities.
శాస్త్రీయ రాగాలకు సినిమా పాటలు bench mark కాదు కానీ తేలికగా గుర్తించడానికి అనువుగా ఉంటాయి.
సింహేంద్ర మధ్యమం రాగం లో ఇళయరాజా కొన్ని మంచి పాటలు బాణీ కట్టాడు.
(1) The iconic song ఆనందరాగం అమిత ప్రాచుర్యం పొందింది.
( పన్నీర్ పుష్పంగళ్ 1981 - ఉమా రమణన్). Breathtaking music which runs like a wild stream.
(2) రాజ్ కోటి - బావ బావమరిది చిత్రం లో బాణీ కట్టిన పాట ఉత్తరాన నీలి మబ్బుల లేఖలో కీరవాణి రాగం తో పాటు --సింహేంద్ర మధ్యమం రాగాన్ని స్పృశిస్తూ సాగుతుంది. A beautiful song. పాట పల్లవి బాగుంది. అయితే చరణాలు typical veturi పద్ధతిలో ఉన్నాయి. వేటూరికి పాలు, వెన్న, జున్ను, మీగడ ఈ పదార్థాలు అంటే మక్కువ. అందుకే ఆయన పాటల్లో వాటి ప్రయోగం ఎక్కువ.
ఈ పాట బాణీ చాలా హాయిగా మధురంగా ఉంది. పాట వింటున్నప్పుడు అందులో ఏ పదాలు వస్తున్నాయో అసలు చూపు సారించలేము. మంచి బాణీ గల పాట లోని సాహిత్యం విడిగా చదువు కోవాలి. Words get drowned in melody of the tune.
అన్ని కళల పరమార్థమొక్కటే. అందరినీ రంజింపజేయుటే అని వేటూరి ఒక పాటలో వ్రాశాడు.
(3) గోపుర వాసలిలే అనే చిత్రం లోని ఈ పాట కూడా బాగుంటుంది. (ఇళయరాజా - ఎస్. జానకి)
సంప్రదాయ సంగీతం లో త్యాగరాజ స్వామి కృతి నీదు చరణములే గతి యని నెర నమ్మిన వాడను
( బాలమురళి మృదు గాత్రంలో 1958)
తమిళ సంగీత దర్శకులు అసకృత్తుగా ఈ రాగంలో పాటలు స్వరపరిచారు. అయితే తెలుగు స్వరకర్తలు అరుదుగా ఉపయోగించారు అనిపిస్తుంది.
సంప్రదాయ రాగాలను అనువుగా ఉపయోగించి పాటలు స్వరపరిచే అలవాటు క్రమేపీ తగ్గిపోతున్నది. మేని తోనే ఆగిపోయే పాట మనసు చేరుకోలేదు. మనసును దాటి ఆత్మను అందుకునే నాదం శాస్త్రీయ సంగీతం లోనే సాధ్యం.
No comments:
Post a Comment