పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఎలా ఉంది ? Jury is still out.
తమిళ వార పత్రిక కల్కి 1941లో ప్రారంభం అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ పత్రిక సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ' కల్కి ' కృష్ణమూర్తి 1950-54 కాలం లో ' పొన్నియిన్ సెల్వన్ ' అనే ధారావాహిక వ్రాశాడు. అది బహుళ ప్రజాదరణను నోచుకుంది. 1955 సం. లో 2210 పేజీల బృహన్నవల ఐదు సంపుటాలుగా ప్రచురించ బడింది.
చోళ సామ్రాజ్యపు రాజుల జీవితం ఆధారంగా వ్రాయబడిన ఒక కాల్పనిక గాధ.
ఈ బృహత్కథ ను సినిమా గా తీయాలని ప్రఖ్యాత దర్శకుడు మణి రత్నం చాలా ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇన్నేళ్ల ప్రయత్నాలు ఫలించి ఇప్పటికి ఈ కథను చిత్ర రూపం లోకి తీసుకు వచ్చాడు. రెండు భాగాలుగా వచ్చిన బాహుబలి గొప్ప విజయం సాధించడం ఒక మార్గం చూపింది.
ఈ చిత్రం రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించాడు. మొదటి భాగం నిన్న విడుదల అయ్యింది.
సినీ దిగ్గజాలు పనిచేసిన Period movie అన్న కుతూహలం కొద్దీ PS-1 తెలుగు అనువాద చిత్రం చూశాను. కొన్ని అభిప్రాయాలు.
సినిమా చూసిన తరువాత కలిగిన అభిప్రాయం. బాగుంది. అయితే కొంత అస్పష్టత ఉంది. మూల కథ, పాత్రలు మనకు తెలియక పోవడం వల్ల కొంత గందరగోళానికి గురి అవుతాము.
వెంట వెంటనే వచ్చే పాత్రలు వారి backstories ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్పడం వారి బాధ, ఆకాంక్ష లను ప్రేక్షకుడు feel అయ్యేలా చేయగలగడం చాలా ముఖ్యం. అది కొంత miss అయ్యాడు మణి రత్నం అనిపించింది. అయితే ప్రముఖ నవల ఆధారం గా తీయడం వలన కథ విషయంలో deviate అయితే చాలా విమర్శ వస్తుంది. నవలలను సినిమాలు గా adapt చేయడం అంత తేలిక కాదు. Writer's vision and director's vision may not always match. This happened in case of the iconic movie Guide. It was a very well made movie. Still RK Narayan felt that the movie was a poor adaptation of his novel.
Mani wanted to be faithful to the novel.
కథలోని పాత్రల ఉద్వేగాలను ప్రేక్షకుడు అనుభవించే లాగా చేసే ఒడుపు, పాత్రలతో పాటు travel చేయించే నేర్పు రాజమౌళికి బాగా తెలుసు.
ఒక interview లో పొన్నియన్ సెల్వన్ ఒక వెబ్ సీరీస్ గా తీయాలని అనుకున్నట్లు కూడా చెప్పాడు రాజమౌళి. అయితే మణి రత్నం ముందుగా ప్రకటించాడు. రాజమౌళి was right. This elaborate and complex story is more suitable for web series. Still finding producer for a Magnum opus web series may not be easy.
సినిమా లో విక్రమ్, శరత్ కుమార్, ఐశ్వర్య రాయ్, రహమాన్ వంటి 50-65 ఏళ్ల నటులను యువకుల పాత్రలకు ఎంచుకోవడం అతకలేదు
The actors, though very competent, are too old to play those characters.
కొన్నేళ్ల క్రితం వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి కూడా ఒక మంచి చిత్రం. అయితే balakrishna was too old to play the character of a young warrior king in that movie.
కొన్నేళ్ల క్రితం విజయ్, మహేశ్ బాబు లతో ఈ చిత్రం తీయాలని మణి రత్నం అనుకున్నాడు అని తెలుస్తోంది.
కార్తీ, జయం రవి వారి పాత్రలకు బాగా సూటయ్యారు. Both did really well. Another notable performer is veteran actor Jayaram as Vaishnava Brahmin who played the part with authenticity. కార్తీ జయరామ్ మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.
విక్రమ్ అపరిచితుడు mode లో చెప్పే monologues , his screams to express anguish don't really strike a chord with viewers.
చిత్రం లో అక్కడక్కడ వచ్చే short conversations లో మణి రత్నం ముద్ర కనిపిస్తుంది.
చిత్రం చివర్లో వచ్చే ఓడ మీద యుద్ధం దృశ్యాలు అంత గొప్పగా లేవు. ప్రథమ భాగం ముగింపు రెండవ భాగం కోసం మరీ ఎదురు చూసేలా లేదు కానీ there is enough interest.
శివ కేశవులకు మధ్య భేదం లేదని జయరామ్ పరిచయ సన్నివేశం లోనే వచ్చే సీన్ బాగుంది. అలాగే జయరామ్ కు తనికెళ్ళ భరణి గాత్రం బాగుంది.
Surprise. సంభాషణలు డబ్బింగ్ వాసన అంతగా లేకుండా బాగున్నాయి. ( తనికెళ్ళ భరణి ). పాటల సాహిత్యం బాగా లేదు. అక్కడక్కడ ఇనుప గుగ్గిళ్ళ వంటి పదాలు ఉన్నాయి.
పాటల చిత్రీకరణ అంతగా ఆకట్టుకోదు. మహేశ్వర్ ఘాట్ కట్టడాల వద్ద లో కృష్ణుడు కంసుడు theme తో చిత్రీకరించిన పాటలో concept modern dance లాగా అనిపిస్తుంది.
సంగీతం. Overall an underwhelming score. నేపథ్య సంగీతం అక్కడక్కడ బాగుంది. కార్తీ మీద చిత్రీకరించిన రహమాన్ పాడిన ' పొన్ని నది పాట stands out for beat and music. Other songs are not so good. Music feels out of sync with the theme and period of the movie.
Photography - Good but not great.
Sets - Some good. Some look tacky.
చిత్రం చూడవచ్చు. PS-1 is a movie worth seeing on big theatre screen.
బాహుబలి తో పోలిక అవసరం లేదు. The scope and aim of both the movies are quite different.
అయితే రాజమౌళి ఈ చిత్రం తీసి ఉంటే ఎలా ఉండేది అని అనుకుంటే ? Yes. It is an interesting proposition.
రెవ్యూ బావుంది.
ReplyDeleteసినిమా చూడక్కర్లేదని అనిపించేటంత.
Thank you. Movie is worth seeing once.
Deleteరెవ్యూ బావుంది - OTTలో చూస్తే చాలు అనిపించేటంత?
DeleteThe post has been updated.
Deleteపొన్నియిన్ సెల్వన్ అనే కుర్రాడు తర్వాత కాలంలో రాజరాజ చోళుడు అయ్యాడు.రాజరాజ చోళుడు మన తెలుగు నాట అందరికీ తెలిసిన రాజరాజ నరేంద్రుడికి తల్లి వైపు తాత అవుతాడు.కానీ ఆ కధలోని సంఘటనలతో మన ప్రాంతపు చరిత్ర కూడా ముడిపడి ఉంది అని తెలియడం లేదు చాలామంది తెలుగువాళ్ళకి.తెలుగువాళ్ళకి నిజమైన చరిత్ర ఆంటే బోరు కాబట్టి ఇక్కడ హిట్ కాకపోవచ్చు.
ReplyDelete