Wednesday, November 9, 2022

వెండికొండ పై విధుబింబం - ధర్మావతి

కర్ణాటక సంగీతం లోని రాగాలపై , మెలోడీ పాటలపై ఉన్న అభిమానం తో 2007 లో బ్లాగులలో ప్రవేశించినప్పటి నుంచి అడపా దడపా సంగీత రాగాలను ప్రస్తావిస్తూ కొన్ని పోస్టులు వ్రాస్తూ వచ్చాను. కర్ణాటక సంగీతం తో కొద్దిపాటి పరిచయం , శ్రవణ, సంచిత జ్ఞానమే తప్ప విశేష పరిజ్ఞానం ఏమీ లేదు. తేనెటీగ మకరందాన్ని పువ్వుల నుంచి సేకరించినట్లు public domain లోని వివిధ మూలాలనుంచి సమాచారం సేకరించి పోస్ట్ లు వ్రాయడం జరుగుతుంది. 

నాకు తెలిసి 2006-7 లలో వ్రాసే బ్లాగర్లు ఇప్పుడు అంతగా వ్రాయడం లేదు. Maybe they moved on to greener pastures. Or simply got bored. 

ఒక మంచి పాటను వెంటనే గుర్తించగలిగే దృష్టి కొంతవరకు ఉంది. 

ప్రతి భారతీయుడికి మాతృ భాషతో పాటు, సంస్కృత సాహిత్యం, శాస్త్రీయ సంగీతం, రామాయణ భాగవతాలు, ఉపనిషత్తులు, భగవద్గీత తో కొద్దిపాటి పరిచయమైనా ఉండాలి అనిపిస్తుంది.  To enrich our lives. 

పుష్కరకాలం క్రిందట ధర్మావతి రాగం లోని పాటలపై ఒక పోస్టు వ్రాశాను. 

మరొకసారి పుష్కర స్నానం చేస్తే పుణ్యం వస్తుంది.

మేళకర్త రాగాలు 72. అవి సంపూర్ణ రాగాలు. అందులో 36 రాగాలు  శుద్ధ మధ్యమం కలిగి ఉంటాయి. ( శంకరాభరణం, చారుకేశి, గౌరి మనోహరి, హరికాంభోజి, కీరవాణి ఇత్యాది రాగాలు)

36 ప్రతిమధ్యమం తో కూడినవి. ( కల్యాణి, చక్రవాకం, ధర్మావతి,వాచస్పతి, సింహేంద్ర మధ్యమం ఇత్యాది రాగాలు).

వెంకట మఖి అనే ఒక సంగీత శాస్త్రవేత్త, పండితుడు (1600-1650 కాలం) కర్ణాటక సంగీతం లోని రాగాలను శాస్త్రీయంగా విభజించి 72 మేళకర్త రాగాలను స్థిరపరచాడు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతున్నది. 

ఆ రాగాలకు సంఖ్యక్రమం కటపయాది పద్ధతిలో ఏర్పాటు చేశాడు. కటపయాది పద్ధతి గురించిన వివరణ ఈ వీడియోలో చక్కగా ఉన్నది.

జాజి, సంపెంగ, విరజాజి, పారిజాతం, గులాబి, చేమంతి.. వివిధ రకాల పూలు ప్రత్యేకమైన స్వాభావిక సుగంధం కలిగి ఉన్నట్లు, వివిధ రాగాలు వాటి. ప్రత్యేక స్వభావం, స్వరూపం, అస్తిత్వం కలిగి ఉన్నాయి. 

రాగాలు అన్నీ గొప్పవే. అయితే ఆ రాగాలు ఉపయోగించి మధుర గీతాలను సృజించిన వారు స్వరకర్తలు , వాగ్గేయకారులు. 

We are fortunate that we have huge body of outstanding and everlasting compositions created by vaggeyakaras.

Dharmavaati is the prati madhyama equivalent of Gouri Manohari ragam.

ధర్మావతి రాగం లో చక్కగా స్వరపరచిన మరి కొన్ని గీతాలు...

1) చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో 

ఈ గీతం శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేకంగా వ్రాసి స్వరపరచ బడిన గీతం అనుకుంటాను. ఈ పాట చాలా బాగుంది. పాడిన వారు టిప్పు ,హరిణి. రచయిత, సంగీత దర్శకుడు ఎవరో తెలియలేదు.  This is a beautiful composition with very good lyrics. 

చరణం లో సాహిత్యం ఎంతో బాగుంది.

------------

చింతామణి మించిన సౌదామిని కాంతుల వెలిగేటి దేవుడు వేదవేద్యుడు 

వదనము విధుబింబమై మధురోహల మూలమై మదిమదిలో కొలువుతీరి మన మొక్కులు తీర్చుచు

చంద్రప్రభ వాహనమున చక్కనయ్య కనరో ఉపేంద్రుడై ఊరేగే ప్రియమాధవుడిదిగో 

------------

2) కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ  వాన మబ్బు లాంటి వాటం నీదయా ( తారక రాముడు - 1997- కోటి - సీతారామ శాస్త్రి - బాలు - చిత్ర )

చక్కని పాట. పాట పల్లవి  ఆకట్టుకుంటుంది. కోటి సంగీతం చాలా బాగుంది. సౌందర్య, శ్రీకాంత్ జోడీ బాగుంది. 

ఈ రాగం లో నా all time favourite పాట

మన్మథ లీల చిత్రం లోని హలో మై డియర్ రాంగ్ నంబర్ - ( 1976 - బాలు, ఎల్ ఆర్ ఈశ్వరి, ఎం.ఎస్. విశ్వనాథన్, ఆత్రేయ).బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి గారు అద్భుతం గా పాడారు. Beautiful tune. 

అందెలరవమిది పదములదా (స్వర్ణ కమలం) ధర్మావతి రాగంలో ప్రాచుర్యం పొందిన పాట.

శ్రీ పూర్ణిమ కృష్ణ ఈమని - వేణుగానం - భజన సేయ రాదా ( మైసూరు వాసుదేవాచార్య కృతి ) . చెవులకి ఇంపుగా ఉంది.

ఆనంద భైరవి చిత్రం లో చైత్రము కుసుమాంజలి అనే అద్భుతమైన పాట ఉంది. ఈ పాటలో రమేశ్ నాయుడు గారు అమృత వర్షిణి, ధర్మావతి / రంజని రాగాలను చక్కగా ఉపయోగించాడు. వేటూరి సాహిత్యం, బాలు గానం అత్యుత్తమం గా ఉన్నాయి.

చైత్రము కుసుమాంజలి 

పంచమ స్వరమున ప్రౌఢ కోకిలలు

పలికే మరందాల అమృత వర్షిణీ.


వేసవిలో అగ్నిపత్రాలు రాసే

విరహిణి నిట్టూర్పులా కొంత సాగి

జలద నినాదాల పలుకు మృదంగాల

వార్షుక జలగంగలా తేలిఆడే 

నర్తనకీ, కీర్తనకీ, నాట్య కళాభారతికీ 

చైత్రము కుసుమాంజలి 


శయ్యలలో కొత్త వయ్యారమొలికే

శరదృతుకావేరి లా తీగ సాగి

హిమజల పాతాల, సుమశర బాణాల

మరునికి మర్యాదలే చేసి చేసి చలి ఋతువే, 

సరిగమలౌ నాద సుధా మధువనికీ

చైత్రము కుసుమాంజలి 

ఎంత గొప్ప సాహిత్యం. వేటూరి గారు🙏












6 comments:

  1. Sir! I enjoy reading your blog posts about songs and music. I am not getting time to add proper comments. I will definitely make time to comment. Please don’t stop writing thinking no one is reading.

    ReplyDelete
  2. For some reason, I couldn’t comment with my blogger Id . The above comment is from me -Lalitha (boldannikaburlu.blogspot.com)

    ReplyDelete
    Replies
    1. seems you are a teche. Enable thurd party cookkies, before comment

      Delete
    2. Thank you Lalitha garu. I am an avid reader of your blog.🙏

      Delete
  3. ఎంతో ప్రయత్నించాను రాగాలగురించి తెలుసుకుందామని. చేతకాలేదు. సంగీతం సొగసులు తెలుసుకోవటమే కాదు వాటి అర్ధ భావాలు తెలుసుకుంటున్న మీకు జోహార్లు.

    ReplyDelete