Wednesday, November 23, 2022

గాడ్ ఫాదర్ తెలుగు చిత్రం

ఈ సినిమా మాతృక లూసిఫర్ మలయాళం లో ఎందుకు హిట్ అయ్యిందో అది మళ్లీ తెలుగు లో తీయాలి అని ఎందుకు అనుకున్నారో..

స్వామి శరణం. 

కథ,  కథనం సహజం గా అనిపించ లేదు.  చిరంజీవి కొన్ని సీన్లలో బాగా నటించాడు.  అయితే మరికొన్ని సీన్లలో నటన స్తబ్దుగా డల్ గా అనిపించింది. సంభాషణలు పలకడంలో ఎనర్జీ, ఫ్లో తగ్గినట్లు అనిపిస్తుంది. 

విలన్ గ్యాంగ్ సభ్యులు ఒక్కరొక్కరు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి హీరో కొట్టిన ఒక్క పిడిగుద్దుతో అమాంతం గాల్లోకి లేచిపోయి దభీమని భూమిపై పడిపోవడం లాంటి ఎలివేషన్ సీన్లు హిలేరియస్ గా అనిపిస్తాయి. Such scenes wont come to an end anytime soon in Telugu movies.

Unpopular opinion:

చిరంజీవి గారు ఇక మీద lead roles కంటే impactful cameo roles, lighter vein roles వేస్తే బాగుంటుంది. The stage has come where he should enjoy the role. 

సల్మాన్ ఖాన్ పాత్ర,  చిరంజీవి - సల్మాన్ పాట ఏమాత్రం ఆకట్టుకోదు. Music, lyrics and choreography for this song is very poor. 

Without a proper role, Salman Khan is totally wasted in the movie.

సినిమా లో సత్యదేవ్  అందరికంటే బాగా చేశాడు అనిపించింది. He seems to be a good actor with good screen presence.

అసలు సిఎం అల్లుడు గా ఉన్న సత్యదేవ్ సి ఎం అవడం కోసం చేసే ప్రయత్నాలు, ప్లాన్లు హాస్యాస్పదం గా ఉన్నాయి. చక్కని రాజ మార్గముండగా..  విలన్ లేకపోతే బాగుండదని బలవంతం గా విలన్ పాత్రను దర్శకుడు సృష్టించినట్లు అనిపించింది.

బ్రహ్మం పాత్ర జైలుకు అంత తొందరగా ఎలా వెళ్లిందో, మళ్లీ అంతే వేగంగా బయటికి ఎలా వచ్చిందో అర్థం కాదు. దర్శకుడు జైలు లో కొన్ని సీన్లు తీయాలి కాబట్టి అందరూ కో ఆపరేట్ చేసి ఉంటారు.

ఎమ్మెల్యే లతో నడిపించే సీన్లు కూడా ఏమీ ఆకట్టుకోవు. 

పూరి జగన్ లాప్ టాప్ లో vlogger గా బాగున్నాడు. అయితే జైలోకి వచ్చి బ్రహ్మం ను కలిసే సీన్లో అతని నటన, body language తేలిపోయింది.

బ్రహ్మం చెల్లెలిని ముఖ్యమంత్రిగా ప్రపోజ్ చేస్తూ ఇచ్చిన ముగింపు బాగుంది.

మిగిలిన నటులలో సునీల్ భార్యగా వేసిన అమ్మాయి , అనసూయ వీళ్లిద్దరూ సహజంగా నటించారు. In their limited screen time both leave their mark.

Thaman music is a big let down. Songs and score not good. So called item song is so bad.

అయితే సినిమా బోర్ కొట్టదు. కాలక్షేపం కోసం చూడవచ్చు.

చిరంజీవి సినిమా చూసి ఎన్నో ఏళ్ళు అయ్యింది అన్న ఉద్దేశ్యం తో చూశాను. Without any expectations చూస్తే OK movie.



No comments:

Post a Comment