Friday, December 30, 2022

నారాయణ తీర్థులు - శ్రీ కృష్ణ లీలా తరంగిణి


నారాయణ తీర్థుల వారి కృష్ణ లీలా తరంగిణి పుస్తకము (వావిళ్ళ వారి ప్రచురణ) పుస్తక ప్రదర్శన ఉత్సవంలో లభించినది.  ఆంధ్ర తాత్పర్య సహితము. 

త్యాగరాజు - అన్నమయ్య - రామదాసు - నారాయణ తీర్థులు - సదా శివ బ్రహ్మేంద్ర స్వామి - క్షేత్రయ్య ....

ఎంతటి మహనీయులు వారు ? ఎటువంటి గొప్ప అనుభూతి తో, భక్తితో సంగీత సాహిత్య సృష్టి చేశారు. 

వారు మనకు అందించిన అమూల్య సంపదను భక్తితో కాపాడుతూ, కొనసాగిస్తూ వస్తున్న వారి శిష్య ప్రశిష్యులు, రస హృదయులు, మహారాజ పోషకులు - ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.🙏🙏🙏

ఈ పుస్తకము నుంచి కొన్ని విశేషములు.

కృష్ణ భక్తాగ్రేసరులలో నారాయణ తీర్థుల వారిది ఉన్నత స్థానము . మాధవానలుడను వైష్ణవుడు వెనుకటికి బిల్హణుడు గా, లీలా శుకుడు గా, జయదేవుడు గా నవతరించి చివరికి నారాయణ తీర్థులుగ నుదయించి ముక్తి చెందిరి. వీరు కాశీ క్షేత్రము లో గంగా తీరమున బహు కాలము నివసించి బ్రహ్మ విద్యా ప్రచారము గావించిరి. తదుపరి దక్షిణ దేశమును చేరి 1745 వ సంవత్సరములో కావేరీ తీరమునందు ఒక గ్రామమున సిద్ధిపొందిరి. వారు డెబ్బది సంవత్సరములు జీవించిరి అని యూహ చేయబడుచున్నది. 

శ్రీ కృష్ణ లీలా తరంగిణి సంస్కృత భాష లో వ్రాయబడిన సంగీత రూప కావ్యము. భాగవతమున ద్వాదశ స్కంధములు యున్నట్లే ఈ కావ్యమున పన్నెండు తరంగములు కలవు. కృష్ణుని లీలలు తరంగముల వలె సుందర లలిత మృదు మధుర పదముల తో వర్ణింప బడుటచే శ్రీ కృష్ణ లీలా తరంగిణి యను కావ్య నామము ఎంతైన సార్థకము యగుచున్నది.

జయదేవుని గీత గోవిందము శృంగార రస ప్రధానము కాగా కృష్ణ లీలా తరంగిణి కావ్యము భక్తి రస ప్రధానముగా నిర్మించబడినది.

నారాయణ తీర్థులు ఆంధ్రులు. తల్లావజ్ఝల వంశము. వీరి పూర్వాశ్రమ నామము గోవింద శాస్త్రి. గుంటూరు సీమ లోని కాజ గ్రామ వాసులు అని యూహించిరి.

వీరి కృతులలో నారాయణ తీర్థ ముద్రను చూపినారు.

గీత గోవిందము, శ్రీ కృష్ణ కర్ణామృతము, శ్రీ కృష్ణ లీలా తరంగిణి -- ఈ మూడు కావ్యములు కృష్ణ భక్తి సాహిత్యము లో అత్యుత్తమ రచనలు గా ప్రసిద్ధి పొందినవి.

ఈ కావ్యము యొక్క  ప్రథమ తరంగము కృష్ణుని జనన వృత్తాంతము తో ప్రారంభించి కృష్ణుని బాల్యము, లీలలు, గోవర్ధనోద్ధారము, రాస క్రీడ, అక్రూర వృత్తాంతము, కంస వధము, ద్వాదశ తరంగమున రుక్మిణీ కల్యాణముతో పూర్ణమవుతున్నది. కావ్యము అంతయు రమణీయ వర్ణనలతో, అత్యంత మనోహరముగా నిర్మింప బడినది.

ఈ కావ్యము లోని శబ్ద సౌందర్యము , భావ వైచిత్రి, పరమాత్మ తత్త్వ నిరూపణము, భక్తి పారమ్యము లను వర్ణించుట కంటే అనుభూతి చెందుట ఆనంద దాయకముగా తోచును. 

---------

ఒక ప్రసిద్ధ తరంగము. రాగము. ముఖారి. ఆది తాళము.

పల్లవి. 

కృష్ణం కలయ సఖి సుందరం బాల కృష్ణం కలయ సఖి సుందరం

అనుపల్లవి.

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా

బాలకృష్ణం కలయ సఖి సుందరం

చరణములు.

1. నృత్యంతమిహ ముహురత్యంత మపరిమిత భృత్యానుకూలం  అఖిలసత్యం సదా బాల
కృష్ణం కలయ సఖి సుందరం

2. ధీరం భవజలధిపారం సకలవేదసారం సమస్తయోగితారం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

3. శృంగార రసభర సంగీత సాహిత్య గంగాలహరీ ఖేల సంగం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

4.రామేణ జగదభి రామేణ బలభద్రరామేణ సహావాప్త కామేన సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

5. రాధారుణాధర సుధాపం సచ్చిదానందరూపం జగత్త్రయ భూపం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

6.దామోదరమఖిల కామాకరం         ఘన శ్యామాకృతిమసుర భీమం సదా బాలకృష్ణం కలయ సఖి సుందరం

7.అర్థం శిధిలీకృతానర్థం శ్రీ నారాయణ తీర్థ పరమపురుషార్థం సదా 

బాలకృష్ణం కలయ సఖి సుందరం

-----------

తాత్పర్యము ఇచ్చిన తీరు :

ఓ చెలీ సుందరాకారుడగు నా బాలకృష్ణుని జూడుము.

సకల లోకములకు గారణ భూతుడైనను, రాక్షసులకు శత్రువగు శ్రీమన్నారాయణుడయ్యును, విషయము లందు ఇచ్ఛ లేని వాడయ్యును, బాలుని వలె నటించు చున్నాడు.

----------

షష్ఠ, సప్తమ, అష్టమ తరంగములలో గోపికలు, కృష్ణుడు, రాధా దేవి  జరిపిన సంభాషణలు, రాసక్రీడ అత్యంత రమణీయంగా కృతుల రూపంలో కూర్చబడినవి. గోపికా బృందమునకు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమును గురించి సగుణ బ్రహ్మ రూపముగా కృష్ణుడు చేసిన యుపదేశములు, యథార్థమును గ్రహించి వారు చేసిన స్తుతులు,   ఈ తరంగములకు ఆంధ్రము నందు ఇచ్చిన తాత్పర్యము, వ్యాఖ్య  ద్వైత అద్వైతముల సమన్వయము, వివిధములుగా కనిపించే ఒకే పరమ సత్యమును అద్భుతంగా  ఆవిష్కరించినది. 

ఆద్యంతమూ శ్రీకృష్ణుడు పరబ్రహ్మ స్వరూపుడే యను నుత్తమాశయము పోషింపబడినది. 

-------

కృష్ణం కలయ సఖి సుందరం, 

నీల మేఘ శరీర, 

ఆలోకయే శ్రీ  బాలకృష్ణం, 

గోవర్ధన గిరిధర గోవింద,

బాల గోపాల కృష్ణ పాహి,

ఏహి ముదం కృష్ణ దేహి,

జయ జయ దుర్గే జితవైరి వర్గే 

---------

ఇత్యాది తరంగములు బహుళ ప్రచారము పొందినవి.

ఈ తరంగములు పాడుకొనుటకే గాక నృత్య రూపకములకు కూడా అనువుగా ఉన్నవి. ఈ గ్రంథమును పరిశీలనాత్మక దృష్టితో చదివి అందలి సారమును గ్రహించవలసి ఉన్నది.

కృష్ణం కలయ సఖి సుందరం - తరంగం

నీల మేఘ శరీర - కూచిపూడి నృత్యం

శ్రీ వేంకటేశ్వర భక్తి ప్రసార వాహిని వారు ప్రతి వారం ఒక కృష్ణ లీలా తరంగమును శిక్షణా పూర్వకమైన కార్యక్రమం ద్వారా ప్రసారం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం.

కృష్ణం వందే జగద్గురుమ్.

వందే పరమానంద మాధవం.

🙏🙏🙏









Sunday, December 18, 2022

నేపథ్య గాయకుడు పి. జయచంద్రన్ - భావగాయకన్

మళయాళ చిత్ర సంగీత జగత్తులో జేసుదాసు తరువాత అంత పేరున్న గాయకుడు పి. జయచంద్రన్. 

గంభీరమైన గాత్రం, స్పష్ట మైన ఉచ్చారణ, భావ యుక్తమైన గానం కలిగిన ఆయనను భావగాయకన్ అని వారు గౌరవిస్తారు. 

80 -90 లలో ఆయన తమిళ, తెలుగు, కన్నడ పాటలు కూడా పాడారు.

ఒకవైపు ఎవరెస్ట్ శిఖరం లాగా జేసుదాసు గారు ఉంటే, జయ చంద్రన్ గారు కూడా  బలమైన గాత్రంతో  ప్రత్యేక స్థానాన్ని అశేష అభిమానులను సంపాదించుకున్నారు. 

జయచంద్రన్ గారికి పి. సుశీల గారు అంటే అమిత అభిమానం, ఆరాధనా భావం. ఆయన  ఇంటర్వ్యులలో సుశీల గారి గురించి గొప్పగా చెప్పారు. వారు ఇరువురు కలిసి అనేక మధుర యుగళ గీతాలు పాడారు.

పూ తెన్డ్రల్ కాట్రే వా  - (1982 manjal Nila ) when we listen to some songs we cannot but look in awe at the genius of the composer (Ilayaraja). Add mesmerizing voice of P susheela Amma and P Jayachandran. A beautiful song with avant-garde touch results.

తమిళం లో మాంజోలై కిళిదానో ( kizhakku pogum rail  1978 - Ilayaraja) పాటతో ఆయన గాత్రం అందరికీ చేరువయ్యింది. The semi classical song in suddha dhanyasi ragam  was a huge hit.

కొడియిలే మల్లియపూ - this was a fine duet in the voice of P jayachandran - s Janaki. (1986 - కడలోర కవిదైగళ్ - ఇళయరాజా). A brilliant composition.

జయచంద్రన్ గారి పాటలలో నేను అమితంగా ఇష్టపడే పాట తాలాట్టుదే వానం - (kadal meengal -1981 - ఇళయరాజా - ఎస్. జానకి, జయచంద్రన్)

An all time classic with great music and interludes.

A magical song which can transport the listener to a different world. కాసేపు మనసు గాలిపటంలా ఎక్కడికో ఎగిరిపోతుంది

Iconic song రాసాత్తి ఉన్నే కాణాద నెంజే (1984 వైదేహి కాత్తిరుందాళ్).    This was a blockbuster hit song. ఈ పాట తెలుగులో జాబిల్లి కోసం ఆకాశమల్లే కూడా పెద్ద హిట్. 

తమిళంలో జయచంద్రన్ సుశీల గారు విడివిడిగా పాడారు. అలాగే తెలుగులో బాలు జానకి గారు పాడారు.

గొప్ప సంగీతం ఎందుకు వింటాము అన్న ప్రశ్న వేసుకుంటే

Great music can lead us to inner silence. Absolute stillness deep in the recesses of heart - It is our real nature. Our real identity.🏔️🌌🌧️⛅










Sunday, December 4, 2022

హంసానంది రాగం - కొన్ని సంగీత ముచ్చట్లు.

హంసానంది రాగం గురించి అనుకుంటే వెంటనే సాగర సంగమం చిత్రం లోని  వేదం అణువణువున నాదం పాట తలపుకు వస్తుంది. సంగీత పరంగా సాహిత్య పరంగా కొంచెం bumpy ride లాగా అనిపించినా బాగుంటుంది. పాట సాహిత్యం, సంగీతం, గానం, చిత్రీకరణ, అభినయం అన్నీ అద్భుతంగా కుదిరాయి.

నాలో రేగే నెన్నో హంసానందీ రాగాలై అని  రాగం పేరు జొప్పించడం ఎందుకు ? అనిపిస్తుంది. ఉద్విగ్నత తో పాడుతున్న వారు నేను హంసానంది రాగం లో పాడుతున్నాను అంటూ పాడతారా?

అయితే సినిమాలో పాట చిత్రీకరణలో భావోద్వేగాలు పండాయి.

ఈ రాగానికి హంసానంది అన్న పేరు ఎలా వచ్చింది తెలియదు. బహుశ:  హంస అంటే పరమాత్మ యొక్క ఆనందస్వరూపము  అయి ఉండవచ్చు.

ఈ రాగం గమనాశ్రమ అన్న మేళకర్త రాగం జన్యము. రాగం లో పంచమం వినియోగం లేదు.  ఈ రాగం హిందూస్తానీ సంగీతంలో సోహిని అన్న పేరు కలిగి ఉంది.

ఈ రాగం లో కర్ణాటక సంగీత trinity కృతులు లేవు. 

కొన్ని మంచి సినీ గీతాలు ఉన్నాయి.

1) Iconic song హాయి హాయిగా ఆమని సాగే - ( ఆదినారాయణ రావు - సువర్ణ సుందరి 1957 - ఘంటసాల - జిక్కి - సముద్రాల సీనియర్) Great composition in raga maalika. Majestic voice of Ghantasala. ఈ పాట హిందూస్తానీ రాగాల ఆధారంగా స్వరపరచబడినది.

పల్లవి - అనుపల్లవి - హంసా నంది / సోహిని 

చరణం -1 - బహార్ రాగం - ఏమో తటిల్లతిక మే మెరుపు

చరణం -2 -  జౌన్ పురి రాగం - చూడుమా చందమామ

చరణం 3 - యమన్ - కనుగవా తనియగా

మల్లాది రామకృష్ణశాస్త్రి, సముద్రాల, దేవులపల్లి కృష్ణశాస్త్రి గార్లు ఉభయ భాషా ప్రవీణులు. అయితే అచ్చ తెనుగు పదాలతో పాటలు అల్లడం వారికి ఇష్టం. 

Probably one of the all time great songs in Telugu. ఈ పాట హిందీలో రఫీ - లతా పాడారు. అయితే ఘంటసాల mesmerizing  గాత్రం లో ఉన్న majesty, magic తెలుగు వెర్షన్ లో స్పష్టం గా తెలుస్తుంది.

2) తంగమగన్ (1983) అన్న చిత్రం లో

రాతిరియిల్ పూత్తిరుక్కుం అనే పాట  (ఇళయరాజా - బాలు - జానకి) అద్భుతం. హంసానంది రాగం ఈ పాటలో చక్కగా ఆవిష్కృతమైంది. A beautiful song in the golden voice of SPB - S Janaki garu.

3) సోహిని రాగం యొక్క వివరణ ఈ

 lec-dem వీడియోలో వినవచ్చు.

4) బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన అన్నమయ్య కీర్తన - ఉన్నతోన్నతుడు ఉడయవరు - ఉడయవర్లు అంటే రామానుజాచార్యుల వారు. అన్నమయ్య వైష్ణవమత ప్రధాన ఆచార్యుల మీద వ్రాసిన కీర్తన.

ఈ రాగం అంటే దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి ఇష్టం అని ఎక్కడో చదివాను. అన్నమయ్య చిత్రం లో 

తెలుగు పదానికి జన్మదినం పాట లో హంసానంది  వినిపిస్తుంది.

A good lec dem on hamsa nandi ragam by Smt. Radha Bhaskar .

హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి।
తన్నో హంసః ప్రచోదయాత్॥ 🙏