మనిషి ఏ వృత్తిలో ఉన్నా ధార్మిక ప్రవృత్తి ఉంటే ఆ జీవితం ధన్యత పొందుతుంది. విశ్వనాథ్ గారు అందుకు ఒక ప్రబల ఉదాహరణ.
విశ్వనాథ్ గారి చిత్రాల గొప్పదనం గురించి అనేకమంది అనేక సార్లు చెప్పుకుంటూ ఆనంద పడుతుంటారు. మన మనసులపై అంత బలమైన ముద్ర వేశాయి అవి.
ఆయన చిత్రాల లోని అనేక సన్నివేశాలు, పాత్రలు మన కళ్లముందు సజీవంగా కదలాడుతాయి.
ఆయన తీసిన ప్రతి చిత్రం లోనూ మనం ఆనందపడే సంగీతం , సాహిత్యం, కథ, నటన, తెలుగుదనం, విలువలు, బలమైన సన్నివేశాలు - తప్పనిసరిగా భాగంగా ఉంటాయి.
విశ్వనాథ్ గారి చిత్రాలలో ప్రథమ ద్వితీయ స్థానాలలో శంకరాభరణం, సాగర సంగమం ఉంటాయి అని చెప్పవచ్చు.
శంకరాభరణం చిత్రంలో నిజానికి సోమయాజులు, మంజు భార్గవి గారికి జాతీయ అవార్డు ఇవ్వాలి. అలాగే స్వర్ణ కమలం ఉత్తమ చిత్రం, దర్శకుడికి కూడా ఇవ్వాలి. అయితే అప్పట్లో వామపక్షవాద బికారి చిత్రాలు తీసే వారికే ఎక్కువగా అవార్డులు వచ్చేవి.అలాంటి వాళ్ళు అవార్డు కమిటీ లలో ఉండేవారు.
శంకరాభరణం లో అల్లు రామలింగయ్య గారి పాత్ర ఎంత బాగా వచ్చింది. మంచి నటులకు సరైన గౌరవప్రదమైన పాత్రలు సృష్టించి ఇవ్వడం దర్శకుడి అభిరుచికి సహృదయతకు నిదర్శనం.
కథానాయకుల పాత్రలకే కాక సహాయ నటులకు, హాస్య నటులు, అతి చిన్న పాత్ర పోషించే వారికి కూడా ఒక గౌరవం, సముచిత స్థానం ఇవ్వడం విశ్వనాథ్ గారి చిత్రాలలో గమనించ వచ్చు.
హీరో పాత్రలను మాత్రమే గొప్ప చేసి హాస్య పాత్ర ధారుల చెంప పగలగొట్టే, అవమానించే సన్నివేశాలు, అసభ్య, అశ్లీల సన్నివేశాలు ఆయన చిత్రాలలో ఉండవు. ఎందుకంటే ఆయన సహజ ప్రవృత్తి ధార్మిక స్వభావం. ఎదుటి మనిషిని గౌరవించే తత్త్వం.
సాగర సంగమం చిత్రం లో కమల్ హాసన్, జయప్రద ల మధ్య ప్రేమ చిగురించే సన్నివేశాలు వారు ఇంట్లో ఫోటో తీసుకునే సన్నివేశం, నాట్య ప్రదర్శన లో కమల్ పేరు చూసుకున్నప్పడు వచ్చే సన్నివేశం - immortal scenes.
అనంతపురం లో రఘువీరా థియేటర్ లో సాగర సంగమం చిత్రం విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆట చూసిన విషయం గుర్తు ఉంది. ఒక స్నేహితుడు లైను లో దూరి టిక్కెట్టు సంపాదించాడు. కమల హాసన్ నట జీవితం లోనే అత్యుత్తమ చిత్రం సాగర సంగమం.
స్వర్ణ కమలం చిత్రం లో ఒక ఘనాపాటి పండితుని ఒక పై అధికారి అవమానించే సన్నివేశం మరచిపోలేము. ఒక గొప్ప వేద పండితుని పట్ల అధికారి అనుచిత ప్రవర్తనను చూపే సన్నివేశం.
ఆయన చివరగా తీసిన కొన్ని చిత్రాలు అంతగా ఆదరణ పొందలేదు. అయితే వాటిలో కూడా కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి.
In my view Vishwanath garu was a master story teller. Screenplay is his strength.
ఆయన తీసిన అద్భుత చిత్రాలకు - ఏడిద నాగేశ్వరరావు వంటి అభిరుచి ఉన్న నిర్మాతలు, అద్భుత మయిన నటులు, వేటూరి, జంధ్యాల, సీతారామ శాస్త్రి, సినారె, ఆత్రేయ, కేవి మహదేవన్, రాజేశ్వరరావు గారు, ఇళయరాజా , గొప్ప ఛాయాగ్రాహకులు, గాయకులు - ఈ గొప్ప బృందం సహకారం ఎంతో ఉంది.
ముఖ్యంగా వేటూరి గారు సిరిసిరి మువ్వ, శంకరాభరణం చిత్రాలలో విశ్వ రూపం చూపారు.
సప్తపది, శంకరాభరణం చిత్రాలలో జంధ్యాల గారి సంభాషణలు చాలా గొప్పగా ఉంటాయి.
సంగీత సాహిత్య సమలంకృతే, దొరకునా ఇటువంటి సేవ, విరించినై విరచించితిని, ఆడవే మయూరీ, రావమ్మా మహాలక్ష్మీ, మావిచిగురు తినగానే, శివపూజకు చిగురించిన, ... Immortal claasics.
విశ్వనాథ్ గారి పట్ల చలన చిత్ర పరిశ్రమ లో ఉన్న అందరికీ అపారమైన గౌరవం ఉంది. అది అభినందించదగ్గ విషయం. కళా తపస్వి అన్న పేరు విశ్వనాథ్ గారికి ఎంతైనా సార్థకం.
విశ్వనాథ్ గారి గొప్ప చిత్రాలను కొత్త తరానికి, రాబోయే తరాలకు కూడా అందించే ప్రయత్నం జరగాలి.
Fortunate to have been born in the same era of the legend K Vishwanath garu.🙏