ఆదౌ నాట అంత్యే సురటి అన్న సంగీత సంప్రదాయం తెలుగునాట ఉన్నది.
కచేరీ తొలి గీతం నాట, హంసధ్వని లేదా సౌరాష్ట్ర రాగాలలో ఉన్న గణపతి ప్రార్థనా గీతాలతో ప్రారంభించి సురటి, మధ్యమావతి లేదా శ్రీ రాగాలలోని మంగళ హారతి గీతములతో ముగించడం జరుగుతుంది.
తప్పనిసరి కాదు కానీ ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగింపు కనిపిస్తుంది.
సురటి రాగం అనగానే తెలుగువారికి సుపరిచితమైన శ్రీ లలితా శివజ్యోతి సర్వ కామదా అన్న గీతం (రహస్యం - పి.లీల - ఘంటసాల) ప్రముఖంగా వినిపిస్తుంది.
తెలుగు మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు చేసి, నోములు నోచుకుని, పేరంటాలు జరిపి హారతి పాటలు పాడుకోవడం సంప్రదాయం.
సురటి రాగం లో కీ. శే. శ్రీరంగం గోపాలరత్నం గారు
ఇద్దరి తమకము ఇటువలెనే అనే అన్నమయ్య కీర్తన స్వరపరచి పాడారు.
అలాగే శ్రీ బాలకృష్ణ ప్రసాద్ గారు అంగనలీరే ఆరతులు అన్న చక్కని అన్నమయ్య కీర్తన స్వరపరచి గానం చేశారు.
(బాలకృష్ణ ప్రసాద్)
------
స్వామికి
సారమైన దివ్యాన్నము షడ్రసయుత భక్షణములు నివేదన చేసి
జాజికాయ, జాపత్రి, యాలకులు, వక్కలాకులతో కూడిన విడెము సమర్పించి
సురటిలో నీరాజనం ఇచ్చిన
త్యాగరాజ స్వామి ఉత్సవ సాంప్రదాయ కీర్తన
🙏
No comments:
Post a Comment