కొంతమంది ఆధ్యాత్మిక గురువులకు
కోపం -తమ మార్గం వీడి వెళ్లిన వారిని చూచి.
ఉక్రోషం -తమను పట్టించు కోవడం లేదని
చులకన - శక్త్యానుసారం, స్వీయ అభిరుచి ప్రకారం తమ తమ పంథాల్లో సాగే వారిని చూచి.
అహంకారం -తమదే నిజమైన మార్గం అన్న భావన వల్ల
నిస్సహాయత -తాము సామాన్య జనాలను మార్చలేక పోతున్నందుకు.
జాలి -అయ్యో ఇలా ఉన్నారేమిటి వీళ్లంతా అనుకుంటూ.
నిజానికి లోకం ఎప్పుడూ తన ధోరణి లో తాను నడుస్తుంది. ప్రకృతి తనదైన పద్ధతిలో సృష్టిని నడిపిస్తుంది. ఆరాటం, ఉబలాటం, ఆవేశం, అసంతృప్తి పెంచుకుంటే నిరాశ నిస్పృహ తప్పదు.
గురువు మార్గం నచ్చి వారి వెంట నడిచే వారు ఉన్నారా ? మంచిదే. నచ్చకో, వీలుపడకో, శక్తి చాలకో, ఇంకొక మార్గం ఆకర్షించో తప్పుకున్నవారున్నారా ? అదీ మంచిదే. శాపనార్థాలు, తిరస్కార భావం, దూషణలు అవసరం లేదు.
సాధనా బలం తో ఒక స్థాయి చేరుకున్నారు. అది ఎవరికి అందాలో వారికి తప్పక అందుతుంది. ఆరాటం దేనికి ? ఎవరి మార్గం లో వారు సాధన చేసుకుంటూ సాగిపోవడం ఉత్తమం.
ఎన్నో జన్మలు కొనసాగే సాధన కొఱకు వేచి ఉండే ఓపిక సహనం లోకులకే కాదు గురువులకు కూడా ఉండాలి అనిపిస్తుంది.
లౌకిక జీవనం లో తలమునకలు అవుతూ కొంత ఉపశమనం కోసం లేదా ఇతర కారణాలతో గుళ్ళు గోపురాలు దర్శిస్తూ పూజలు పునస్కారాలు చేసుకునే వారు అనేకమంది ఉండగా ముముక్షువులు, సాధకులు కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఇది సహజమైన విషయం. ఈ విషయం లో గురువులకు స్పష్టత ఉంటే బాగుంటుంది.
Some gurus expect the austerity and serious approach of a mumukshu from normal householders. This will not succeed.
ఎన్నో జన్మల సాధన తరువాత గురుస్థానం చేరుకున్న వారు తొలి దశలలో ఉన్నవారిని నిందించడం తగదు. వారికి మార్గ దర్శనం చేయడం బాగుంటుంది.
కేజీ నుంచి పీజీ దాకా చదవడం కోసం సమయం పడుతుంది. అందరూ డాక్టరేటు చేయలేరు అన్నది నిండు నిజం.
కొన్ని కెరటాలు ఎక్కువగా ఎగసి పడుతున్నాయి. కొన్ని తీరం చేరకుండానే అగిపోతున్నాయి. పేచీ లేదు.
గసాభా - కసాగు లకు అంతరం ఉంటుంది.
ఉపదేశం మంచిదే. కానీ అధికారి భేదం గుర్తించి చేయడం మంచిది. బుద్ధిభేదం న జనయేత్ అన్న సూచన ఉంది.
ఆధ్యాత్మిక జ్ఞానం చేసే మేలు కంటే ఆధ్యాత్మిక అసహనం చేసే కీడు ఎక్కువ కాకూడదు. శృతి మించిన విమర్శ చేయడం సరికాదు.
ఇదివరకు తాను కూడా ఎన్నో తప్పులు చేశాను. ఎంతో ప్రయత్నం చేసిన తరువాతే గురుస్థానం లోకి వచ్చాను. ఇప్పటికీ కొన్ని సందర్భాలలో తడబడుతుంటాను అని నిజాయితీ గా చెప్పగలిగే గురువులు అరుదు.
అలాగే honest feedback స్వీకరించే లక్షణం స్వీయ లోపాలు అంగీకరించే గుణం ఎన్నడూ వదులుకోకూడదు. అంతరాత్మ ను మించిన అద్దం లేదు. అయితే దృష్టి సారించగలగాలి.
గురువులు ఒక్కోసారి కోపగించినా వారు వందనీయులే.
నిజానికి ఒక్కోసారి అనిపిస్తుంది. సామాన్యులతో పాటు గురువులలో కూడా మార్పు అవసరమే.
Random thoughts and general observations. Not intended to find fault with any one 🙏
ఇదేదో బ్లాగ్జ్యోతిష్ శ్రీ మాన్ ఆల్వేస్ ఏడుపానంద వారి గురించి అనిపిస్తోంది.
ReplyDeletecan you please tell us who is this
Deleteజనాలు ఇలానే ఉన్నారు , ఉంటారు కూడా . రకరకాలు , మంచి , దయ, స్వార్ధం , అసూయా , గర్వం, అహంకారం ఇవన్నీ కలగలిపి ఉన్నాయి ఈ సమాజం లో , అందులో నుండే మనం మంచి చెడు నేర్చుకుంటాం . అందరం అక్కడ వాళ్ళమే . పొద్దున్న లేచిన నుండి , జనాలని అలాగా జనం అని తిడుతూ , తూలనాడుతూ , అసహ్యించుకుంటూ , ఇవన్నీ కూడా మనకి మనం గురువు అని చెప్పుకుంటూ ... తన శిష్యులకి ఏ విధమైన రోల్ మోడల్ గా ఉంటున్నారో అర్ధం కావడం లేదు .
ReplyDeleteమన అభిప్రాయాలతో సొంత కుటుంబీకులే విభేదిస్తారు , బయట వాళ్ళు ఇంకా ఎక్కువ విభేదించి, తన దారి తను చూసుకుంటారు, వాళ్ళని కూడా వదలకుండా పిచోళ్లు అని ముద్రలు .
ఎదో అడగాలనో, చెప్పాలనో ఎవరైనా ఫోన్, మెయిల్ చేసారంటే , తరువాత అది ఒక పోస్ట్ , అందులో కొన్ని అక్షింతలు ఘాటుగా .
ఏంటో , రక రకాల గురువులు , కొత్త దేవుళ్ళు .
ఆ అసహనం భరించే సహనం నాకు లేక చదవడం మానేసాను.
ReplyDeleteae you guys talking about http://www.teluguyogi.net/2023/03/46.html ??
ReplyDeleteఈ టపా ఎఫెక్టు సదరు గురువు గారు జ్యోతిష్యానికి గుడ్బై చెప్పేసినట్టున్నారు.
ReplyDeleteఉన్నత స్థాయికి చేరుకున్న గురువులు, సాధకులు శ్రీ అప్పారావు గారి ఉపదేశం అనుభవాలు ఈ వీడియో లో ఉన్నాయి.
ReplyDeletehttps://youtu.be/dH9eGavHF0k
సామాన్యులు, సాధకులు , అలాగే కొంత మంది బాధ గురువులు కూడా తప్పక చూచి నేర్చుకోవలసిన విషయాలు గురువుగారు ఈ వీడియోలో చెప్పారు.🙏
Intaki evaru AA guruvu gaaru?
ReplyDelete