Monday, February 17, 2020

కడలంటె నదికేల కోపం- నీ కోసమే జీవించు 'నది'

సినీ కవులు రాసే ప్రేమ- విరహ గీతాలు భలే ఉంటాయి.

అవి వింటే ప్రియుడు ప్రేయసి కంటే తనపై ఉన్న ప్రేమను ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు అనిపిస్తుంది.

ఆ గీతం ఆమె వినడమో చదవడమో జరిగితే మరుక్షణం అతని దరి చేరి ఒడిలో కరగిపోవాలని ఆమెకు అనిపిస్తుంది.

Yes, it strikes a chord in the deepest recesses of listeners' hearts too.

ఈ magic కొన్ని పాటలలో ఉంటుంది.

ఈ విరహ భావాలను తెలపడానికి,
to think aloud lovers' feelings,
భాగేశ్రీ రాగం బాగా నప్పుతుంది.

ఒక అందమైన పాట. One of my all-time favourites.

కడలోడు నదిక్కెన్న కోబమ్. ( SPB - Shankar- Ganesh 1981)-

బాలు గారు ఎంత హాయిగా పాడారు.

Balu sir weaves magic with his Mesmerising rendition.

Great composition by Shankar- Ganesh.

భాగేశ్రీ హిందూస్తానీ రాగం. ఎన్నో మంచి హిందీ సినీ గీతాలు ఇందులో ఉన్నాయి.

ఒక మంచి పాట

జీవన్ సే భరీ తేరీ ఆంఖే (సఫర్ 1970- కిశోర్ కుమార్- కళ్యాణ్ జీ ఆనంద్ జీ).
It is an all time classic with great lyrics and music. కిశోర్ కుమార్ జీవం పోసిన పాట.


The song forever -విరహ గీతాలకు పెన్నిక్క నీ  కోసమే నే జీవించునది
( మాయా బజార్). పాట రెండో చరణం రాగాంతర సంచారం చేసి అందంగా మళ్లీ భాగేశ్రీ లోకి ఒదిగి పోతుంది.

"విరహము కూడా సుఖమే కాదా నిరతము చింతన మధురము కాదా. "

Well the above two lines sums  up the essence of the raga beautifully.
















Sunday, February 9, 2020

'వలజి' గిబిగి లో ఆనాటి కలలు దాగే




కాలంతో కలిసి చేసే ప్రయాణం గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడికి వెళుతున్నా మో తెలియకుండా, అసలు మనం ప్రయాణం చేస్తున్న విషయమే ఎరుకలేకుండా సాగిపోతూ ఉంటుంది.

నక్షత్ర తతులు తలపై విస్తరించడం తెలుస్తూ ఉంటుంది.

 శరీరం లో ఒక్కో భాగం పనితీరు మందగించి ఒక్కో రకం మాత్ర మన అమ్ముల పొదిలో చేరడం జరుగుతుంది.

చిన్నవాళ్ళు చేసే తప్పులు, వాళ్ళ ఆవేశాలు గమనించి కోపం బదులు అర్థం చేసుకుని
సర్దుకుపోతూ సలహాలిస్తూ గడిపేయడం అలవాటవుతుంది.

చిన్న చిన్న విషయాలు అమితానందం ఇవ్వడం , ఒకప్పుడు విని అంతగా పట్టించుకోని పాటల్లో కొత్త అందాలు కనిపిస్తాయి.

అలాంటి నిరుడు కురిసిన పూల జల్లు   లోని ఒక మరు మల్లె-

నారాణి కనులలోనే - ఆనాటి కలలు దాగే.

( ఘంటసాల + ఎస్. రాజేశ్వర రావు+ శ్రీ శ్రీ - చిలక గోరింక)


ఈ పాట ఒక మేలి ముత్యం. వలజి రాగంలో ఎంతో అందంగా స్వరపరిచారు.

ఎస్వీ రంగారావు గారు అంజలీ దేవి గార్ల మీద. ఎంతో ఉదాత్తంగా ఈ యుగళ గీతం చిత్రీకరించారు.

ఈ రోజులలో ఇలాంటి పాట ఊహించగలమా.

రంగారావు గారు వీణ వాయిస్తూ , అంజలీ దేవి గారు చూపిన హావ భావాలు వారెంతటి మహా నటులో చెబుతాయి.

పాటలో వీణా నాదం ఆద్యంతం వీనులవిందు గా వినిపిస్తుంది. వీణ పాటలు తెలుగు వారి సంపద.

"వసంతగాలికి వలపులు రేగగా"

కదిలే కాలం కాసేపు ఆగిపోతే బాగుంటుంది అనిపిస్తుంది.



Friday, August 17, 2018

పాట పరిమళం పంచే మౌనం సమ్మతమే


మౌనం సమ్మతమే. మౌనం మాట్లాడితే ఎలాఉంటుందో తెలిపే ఒక పాట. 
'కళ్యాణ తేన్ నిలా'. a beautiful duet shot in a classy way on two accomplished actors mammootty and amala.

what a  melodious composition by ilayaraja.

(జేసుదాసు-చిత్ర-మౌనం సమ్మదం -1989). పాట బాణీ (దర్బారి కానడా)-చిత్రీకరణ -గానం-మమ్ముకా అమల- ఒక all time classic గా నిలిపాయి ఈ పాటను. 

కొత్తగా పెళ్ళైన జంట లిపిలేని మనసు భాషను కళ్ళతో మాట్లాడుకుంటారు.

రాజా పాట అంటే interludes తో సహా ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

this song is a lesson how a melodious duet should be composed. 

పాట నెమ్మదిగా సంగీతాన్ని సాహిత్యాన్ని ఆస్వాదించేలా ఉంది.

పాట అంటే మాటల సునామీ కాదు. 
పాట అంటే వాయిద్యాల విరగమోత కాదు.
పాట అంటే గావుకేకలు వెర్రి గంతులు కాదు.

this song deserves to be in raja top 20 songs. 

ఆనాటి మంచి గంధం చెక్క ఈనాటికీ సువాసన పంచుతోంది. 


Wednesday, February 21, 2018

సరిహద్దు లేదు. -- పాటకు , పక్షికి, నదికి , గాలి తెమ్మెరకు


అన్ను మల్లిక్ -  mostly composes crude loud and commercial music.
కానీ తన జీవితంలో గర్వంగా చెప్పుకోదగ్గ సంగీతం 'Refugee'  (2000) అనే హిందీ చిత్రానికి సమకూర్చాడు.
అర్ధవంతమైన సాహిత్యం (జావేద్ అక్తర్), అద్భుత గానం (అల్కా యాజ్నిక్, సోను నిగమ్, ఉదిత్ నారాయణ్), చక్కని చిత్రీకరణ, lilting tunes కలిసి ఈ చిత్రంలోని పాటలు రూపుదిద్దుకున్నాయి.   album లోని అన్ని పాటలు అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి. 
The sincere effort of Anu malik is evident in all the songs.  Kudos to director JP Datta for envisaging such milieu and  believing in Anu Malik. Anu deservingly won the National Award for music for 2000. 
The awards committee too deserves appreciation for recognizing a worthy effort without prejudice.

1)  మేరే హమ్ సఫర్  పాట -  (అల్కా యాజ్నిక్, సోను నిగమ్) - యమన్  కళ్యాణ్ రాగంలో Such a melodious song beautifully sung.  ఇంకో మెచ్చుకోదగ్గ విషయం debutants కరీనా కపూర్ , అభిషేక్ look so good and natural. 
2) ఐసా లగ్తా హై  -  (అల్కా యాజ్నిక్, సోను నిగమ్) another beautiful duet with soothing instruments. and interludes.

3) పంఛి నదియా పవన్ -    (అల్కా యాజ్నిక్, సోను నిగమ్) పక్షులకు, నదులకు, గాలి తెమ్మెరలకు సరిహద్దులు లేవు. మనుషులు కంచెలు కట్టుకొని ఏం పొందారు. Great meaningful lyrics. Javed Akhtar won the National Award for this song. 

Anu Malik composed good music for an earlier J P Datta film ' BORDER' too. JP Datta brought out the best out of him.He made a few border-army films.  

4) రాత్ కీ హతేలి పర్  - (ఉదిత్ నారాయణ్) . The percussion sounds so ethnic and he chorus used is so good in this song.  

5) తాల్ పే జబ్ ఏ జింద్ గానీ  -  (అల్కా యాజ్నిక్, సోను నిగమ్) . Lovely song indeed. 

We like trans border love films.  In reality we get Trans border Terror only. 

నిజానికి మనిషి ఎప్పుడూ కాందిశీకుడే. 
  

Friday, June 23, 2017

చక్రవాకం-Two estranged friends-కొన్ని సంగీత కబుర్లు



చక్రవాకం- అహిర్ భైరవ్ రాగం.  an apt ragam to express pangs of separation.

This is a real gem. చక్రవాకం- అహిర్ భైరవ్ రాగం. - 'ఏనాడు విడిపోని బంధం ఇది'. పాట rhythm, lyric, music - above all the impeccable rendition of Balu. It is one of the finest pieces from the oeuvre of vamshi-raja combo.

ఈ రాగంలో చప్పున స్ఫురించే  కృతి పిబరే రామరసం (చక్రవాకం- అహిర్ భైరవి) - బాలమురళి weaves magic

సదాశివబ్రహ్మేంద్ర స్వామి కృతులు - పిబరే రామరసం - మానస సంచర రే - గాయతి  వనమాలి - సర్వం బ్రహ్మ మయం - ఖేలతి మమ హృదయే .. They are immortal songs composed by him in Sanskrit. Beautiful lyrics. ఈ కృతులలోని శబ్ద సౌందర్యం ఇట్టే ఆకట్టుకుంటుంది  

శాస్త్రీయ సంగీతాన్ని స్పృశించే  పాటలను తన  చిత్రాలలో పొందుపరిచే అభిరుచి ఉన్న దర్శకుడు  సంజయ్  లీలా భన్సాలీ. 
అల్బేలా సజన్ యో రే ( हम दिल दे चुके सनम) ఇస్మాయిల్ దర్బార్-సుల్తాన్ ఖాన్-శంకర్ మహదేవన్-కవితా కృష్ణమూర్తి).

మహా విద్వాంసుడైన అన్నగారు ఉంటే తమ్ముడు అగస్త్య భ్రాతగా మిగిలిపోతాడు. రాజా తమ్ముడు గంగై అమరన్ కూడా ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడే. a beautiful song composed by him
పూవో పొన్నో ( K J Yesu Das - S Janaki) in chakravakam.

In the recent times, an unsavoury incident took place where ilayaraja sent a legal notice to balu garu .

Legal notice to a friend who travelled with you for more than four decades. Ilayaraja's music and SPB's singing are inseparable. While raja created everlasting music, Balu and Janaki garu brought those tunes to life.  

 అన్నమయ్య, త్యాగయ్య, పోతన్న ... మరెందరో... Copyrighting works. No it is not an Indian concept. 

Like all other fans, I fervently hope to see Raja and Balu perform together again. If friends can't forgive each other who else will?







Wednesday, February 15, 2017

స్వరమండల్ - సంతూర్ - హిందుస్తానీ సంగీత వాద్య విశేషాలు.

స్వరమండల్ నుంచి వచ్చే సంగీతం వింటే..

ఒక పువ్వు విచ్చుకున్నట్టు, నెమలి పురి విప్పుకున్నట్టు, మబ్బు చాటు నిండు చందమామ మోము చూపినట్టు, horizon మీదుగా సూర్యోదయం చూసినట్టు, చెట్టు కొమ్మల్లోనుంచి పక్షులు ఒక్కసారిగా ఎగిరి పోయినట్టు, చంటిపాప ఉన్నట్టుండి  నవ్వినట్టు, జలపాతపు ధారలు జలజలా రాలినట్టు అనిపిస్తుంది.

హిందుస్తానీ సంగీతంలో ఒక అపురూపమైన వాయిద్యం ఇది.  

It is primarily a accompanying instrument of a vocalist usually played by him/her self. It does the work of a tanpura and more. Swarmandal is more like an icing on the cake. It complements the singer and embellishes the concert.

ఒక మధురమైన clipping ఇక్కడ  . మరొకటి 
తంబూర శృతి నిలపటానికి తోడ్పడితే, స్వరమండల్ వివిధరాగాలలో స్వరపరచుకునే అవకాశం ఉండటంతో  ఒక సహగాయక పాత్ర పోషిస్తుంది.

సంతూర్ కూడా ఎంతో శ్రావ్యమైన వాయిద్యపరికరం. Santoor has wider scope and range and is an independent solo instrument.

సంతూర్ వాయిద్యపు ధ్వని వింటే నెమ్మదిగా నునుపైన గులకరాళ్లపై  పారే సెలయేటి స్వచ్ఛమైననీటి పోలిక గాఢంగా తోస్తుంది.  కళ్ళు మూసుకుని వింటే మంచుకొండల్లో విహరించినట్టు, మబ్బుల్లో తేలిపోయినట్టు అనిపిస్తుంది. పండిట్ శివకుమార్ శర్మ - This name is synonymous with Santoor. 

సిరిమల్లె నీవె పాట ప్రారంభంలో స్వరమండల్ -  సంతూర్ ను చక్కగా ఉపయోగించారు. శివ్ -హరి ద్వయం , ఇతర హిందీ సంగీత దర్శకులు సంతూర్ ను  సినిమా పాటలలో తరచుగా ఉపయోగించారు. తెలుగులో కొంతవరకు రమేష్ నాయుడు పాటల్లో సంతూర్ వినిపించేది. 

ఇళయరాజా 'నాదం నీ దీవెనే' పాటలో సంతూర్ మధురంగా వినిపిస్తుంది.

ఒక మంచి instrumental పాటతో ముగిస్తాను.



Friday, January 6, 2017

'సంగీత కళానిధి' - అవసరాల కన్యాకుమారి గారు - కొన్ని సంగీత కబుర్లు.

బాలమురళి గారి నిష్క్రమణతో ఏర్పడిన శూన్యత నుంచి కొంత ఉపశమనం కలిగింది. కన్యాకుమారి గారికి సంగీత కళానిధి పురస్కార ప్రదానంతో.

వారి ధన్యజీవిత విశేషాలు కొన్ని (from newspaper /internet articles/interviews)

తెలుగునాట పుట్టి శాస్త్రీయ సంగీతానికి fountainhead వంటి మద్రాసు నగరానికి తరలి వెళ్ళిపోయిన సంగీత కాందిశీకులలో వారు ఒకరు. నాలుగు దశాబ్దాలుగా మద్రాసు నగరంలో స్థిరపడి కర్ణాటక సంగీతానికి జీవితం అంకితం చేసిన విదుషీమణి.

She rose from the ranks. From being a faithful and steadfast accompanist to the legendary MLV to a soloist to innovator par excellence to a revered and beloved mentor, guru .. The journey has been one of fulfillment and accomplishment.

"She has many successful creative innovations to her credit. "Vadya Lahari" her brain child is a new combo of the violin, veena and Nadaswaram. "Tristhayi sangamam" Confluence of 3 violins playing in different octaves portraying a special dimension. "Carnatic Music Ensembles" of 25, 50, 75 and 100 violins as well as 100 instrument ensemble commemorating the millennium A music piece "100 ragamalika swarams" which exposes her dexterity in bringing out the raga swaroopam in just one avarthana each. 29 hours non stop marathon performance.". 

బాలమురళి గారిని కర్ణాటక సంగీతపు 'స్వయంభువు" గా ఆమె వర్ణించారు. స్వత: ఆమె స్వయంసిద్ధ. 

29/12/2016 నాటి మార్గళి ఉత్సవ కచేరి ఇక్కడ వినవచ్చు. Outstanding concert. త్రిస్థాయిల్లో వాయులీన త్రయం perform చేయడం చూడవచ్చు. 

She is right up there in the league of violin maestros , viz. Lalgudi, TN Krishnan, MSG, LS.. వయోలిన్  లో వాగ్గేయకారుడి గాత్రం వినిపించాలి. సాహిత్య భావం పలకాలి. ఇది ఆమె బాణీ. She has evolved a style which is marked by brevity and minimalism.  She has mastered this technique so well that only the best melodic structures are presented to the audience. She has tutored many successful students, which is her greatest contribution to carnatic music. 

నాకెంతో ఇష్టమైన కళ్యాణ వసంత రాగం లో ' నాదలోలుడై' కీర్తన.  Another shining star joins the galaxy of sangita kalanidhi recipients. Immensely happy about it.