Tuesday, March 28, 2023

పరుగు ఆపడం ఒక కళ (ల) - random thoughts

శోభన్ బాబు గారి మీద ' పరుగు ఆపడం ఒక కళ ' అనే మంచి శీర్షికతో ఒక పుస్తకం అప్పట్లో వచ్చింది. 

నిజమే. ఏదో ఒక దశలో ఇంక చాలు ఇక తప్పుకుంటాను అనుకోవడం మంచి నిర్ణయమే. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, నటన, క్రీడలు, ఇతర వృత్తులు, వ్యాపకాలలో తగిన సమయం లో చూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 

To firm up one's mind to call it a day is often not so easy for many.

Many a time  we deliberately fail to read the writing on the wall. People try to hang on well past their sell by date.

They will be either gradually ignored or gracefully shown the door or even  unceremoniously dumped.

ఈ పేచీలు లేకుండా చాలామంది ఉద్యోగులకు 60 - 65 ఏళ్లకు పదవీ విరమణ ఉంటుంది.

మరికొంతమందికి కంపెనీలు ' స్వచ్ఛంద ' పదవీ విరమణ లు ప్రకటిస్తాయి.

ఒకప్పుడు ఉద్యోగం వస్తే job for life అనుకునే వారు. ఇప్పుడు పరిస్థితులు వేరు. Voluntary retirements and layoffs seems to be the new normal.

ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినిమా హీరోలకు retire అవ్వడం tire అవ్వడం ఇష్టం ఉండదు. వారికి అభిమానులు, అనుచరులు అంతగా అలవాటు అయిపోయి ఉంటారు. Lime light, prominenence, power,  influence లేని జీవితాన్ని ఇష్టపడరు అనిపిస్తుంది. అందుకే ఏదో ఒక విధంగా కొనసాగాలని అనుకుంటారు. Some actors and politicians are quite successful in prolonging their careers.

కొందరు సినిమా హీరోలు తమ చరిస్మా బలం తో రాజకీయరంగం ప్రవేశం చేస్తారు. అయితే the two professions need different sets of skills. Politics need a different  methodology. 

సినీ పరిశ్రమలో రాజకీయం, అలాగే రాజకీయ రంగంలో నటన  కూడా ఉంటుంది.

విరమణ అనేది  హీరోలు, రాజకీయ నాయకులకే కాక గాయకులు, సంగీత దర్శకులు, రచయితలు, కవులు, ఇంకా అనేక ఇతర రంగాలకు సంబంధించిన విషయం.

మన భారతీయ జీవన విధానం లో ఒక వయస్సు వచ్చాక తమ సంతానానికి బాధ్యతలు అప్పజెప్పి వానప్రస్థం స్వీకరించమని చెప్పారు. 

సరైన సమయంలో మలితరానికి పెద్దరికం అప్పజెప్పి తప్పుకోక పోతే తదుపరి జీవితంలో కుదుపులు తప్పవు.

Especially in respect of performing arts, one should definitely make a smooth transition from being a performer to a mentor.

వృత్తి విద్యా నిపుణులు, వైద్యులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, పాత్రికేయులు.. తమకు ఆసక్తి, ఓపిక, శక్తి ఉన్నంత కాలం పని చేస్తుంటారు. 

ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నవారు తమ తరువాతి తరానికి తమ skillsets అందించే ప్రయత్నం, మార్గదర్శకులు గా వ్యవహరించడం బాగుంటుంది. 

Inertia of motion is as powerful as inertia of rest.


5 comments:

  1. You should add your personal Saga to add weightage to the theory :)

    ReplyDelete
    Replies
    1. Not much of a saga. But yes. Took 'voluntary' handshake and happy about it.

      Delete
  2. పరుగు ఆపడం నిజంగా ఒక కళే.
    1960 దశకంలో భారత టెస్ట్ క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ గా ఆడిన రమాకాంతో దేశాయి గారి ఉదంతం గుర్తొస్తుంటుంది. ఇంకా బాగా ఆడుతున్న రోజుల్లోనే ఆయన తను రిటైర్ అవుతున్నట్సు ప్రకటించారు.
    ఏం తొందరొచ్చింది అని రిపోర్టర్లు అడిగారు.
    అప్పుడే ఎందుకు అని అడిగే రోజుల్లోనే తప్పుకోవాలి గానీ ఇంకా ఎప్పుడు అని అడిగించుకునే వరకు ఆగకూడదు అని దేశాయి గారి సమాధానం.
    🙏

    ReplyDelete
  3. పైన Anonymous April 7, 2023 at 12:11 AM అని కనుపిస్తున్న కామెంట్ నేను వ్రాసినదే. సైన్-ఇన్ చెయ్యడం మరచిపోవడం వల్ల Anonymous గా వచ్చింది.

    ReplyDelete