Wednesday, April 12, 2023

సంగీత దర్శకుడు - గీత రచయిత - రవీంద్ర జైన్ - కొన్ని విశేషాలు


హిందీ /ఉర్దూ చిత్ర సంగీతం విస్తృతమైనది. ఎందరో దిగ్గజ సంగీత దర్శకులు, గాయకులు, గీత రచయితలు ఉన్నారు.

అయితే హిందీ చిత్రాలుగా అందరూ అనుకునేవి నిజానికి 90% ఉర్దూ సినిమాలుగా చెప్పాలి.

బాలీవుడ్ చిత్రాల మాటలు, పాటల లో భారతీయత, శుద్ధ హిందీ భాష తక్కువ. ఉర్దూ ప్రభావం అధికం. ఇది ఒక అజెండా లాగా సాగుతోంది. సంస్కృత పదాలతో కూడిన శుద్ధ హిందీ కేవలం కామెడీ పాటలలో వినిపిస్తుంది. బాధాకరమయిన విషయం. 

అటువంటి చోట చక్కని హిందీ సాహిత్యం, భారతీయత ఉట్టిపడే సంగీతం అందించిన ఒక అరుదైన ప్రతిభావంతుడు శ్రీ రవీంద్ర జైన్ (1944-2015)

జన్మతః అంధత్వం ఉన్నా అపారమైన ప్రతిభ కలవాడు. ఎన్నో హిందీ చిత్రాలకు నిజమైన భారతీయ సంగీతం సాహిత్యాన్ని అందించాడు.

ఒక్క చిత్ చోర్ సినిమా పాటలు చాలు. ఆయన రచయితగా సంగీత దర్శకుడిగా విశ్వరూపం చూపిన చిత్రం. 

చిత్ చోర్ (1976) చిత్రం లోని అన్ని పాటలు ఆణిముత్యాలు. జేసుదాసు కు జాతీయ స్థాయిలో గొప్ప పేరు తెచ్చిన పాటలు.

All time classics గా నిలిచాయి.

ఈ చిత్రం లోని రెండు అద్భుతమైన పాటలు.

జబ్ దీప్ జలే ఆనా

తూ జో మేరే సుర్ మే

హేమలత, జేసుదాసు గారు అద్భుతంగా పాడారు. 

అలాగే గీత్ గాతా చల్ చిత్రం లోని 

ఈ పాట. ఎంత హాయిగా ఉంటుంది 

పాటల సాహిత్యం సంగీతం చిత్రీకరణ లో సాత్వికత నిండి ఉంటుంది.

ఆయన పాటల సాహిత్యం లోని పరిమళానికి ఒక ఉదాహరణ.

चाँदी सा चमकता ये नदिया का पानी रे

पानी की हर इक बूंद देती ज़िन्दगानी

अम्बर से बरसे ज़मीन पे गीरे

नीर के बिना हो भैया काम ना चले

ओ भैया काम ना चले, ओ मेघा रे

जल जो न होता तो ये जग जाता जल, 

गीत गाता चल ओ साथी गुनगुनाता चल।

జలం లేని జగం జ్వలించి పోతుంది అన్న భావం जल అన్న పదంలో చెప్పిన తీరు అద్భుతం.

ఇది కపటం లేని మనసులో నుంచి సహజంగా వచ్చిన సాహిత్యం. 

ఎన్ని సార్లు విన్నా fresh గా అనిపిస్తుంది.

రామాయణ్, శ్రీ కృష్ణ వంటి అమిత ప్రాచుర్యం పొందిన దూరదర్శన్ ధారావాహికలకు చిరస్మరణీయమైన సంగీతం సమకూర్చారు.

రవీంద్ర జైన్ ఎన్టీఆర్ గారి బ్రహ్మర్షి విశ్వామిత్ర (1991) తెలుగు చిత్రానికి కూడా మంచి సంగీతం అందించారు.

NTR garu was a true artise at heart. పౌరాణిక చారిత్రక పాత్రలు పోషించాలి అన్న తపన ఆయన లో ఉండేది. ఆయన స్వంతంగా నిర్మించి / దర్శకత్వం వహించి / నటించి కొంతవరకు తృప్తి చెందారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీనాథ కవిసార్వభౌముడు, బ్రహ్మర్షి విశ్వామిత్ర, అక్బర్ సలీం అనార్కలి .. ఈ చిత్రాలు అప్పట్లో అంతగా ఆదరణ పొందలేదు. కానీ ఎన్టీఆర్ అభిరుచికి గుర్తుగా నిలిచిపోయాయి.

ఈ చిత్రం లోని ఒక మధుర గీతం.

పాట బాణీ, వాయిద్యాల కూర్పు, సాహిత్యం, పి సుశీల, జేసుదాసు గారి గానం అద్భుతంగా ఉన్నాయి. 

The timbre of Sitar bits played by top grade artists in Hindi cine music is amazing .

The recording quality of Bombay studios and the tonal quality of instruments like Sitar, flute, percussion and violins is evident in this song.

మరొక మధుర గీతం

అఖియోం కే ఝరోంకో సే 

మధురమైన పాటలను అందించిన రవీంద్ర జైన్ గారిది సినీ సంగీత ప్రపంచం లో ఒక విశిష్ట స్థానం. ఆయన గీతం, సంగీతం -

Melodious , Ethnic, Rooted, Unpretentious,lyrical, rhythmic, Respectful towards Nature and traditions.



4 comments:

  1. అద్భుతమైన పాటల గురించి రాశారివాళ! अँखियों के झरोखों से मैने देखा जो सांवरे - ఒక పక్క మాథ్స్ చేస్తూ ఇంకో పక్క మార్జిన్‌లో ఈ పాట రాసుకున్న రోజులు గుర్తుకొచ్చాయి. Thanks a lot for such a nice post!

    ReplyDelete
  2. తాన్ సేన్ సినిమాకి ఆయన చేసిన సంగీతం అద్భుతం.

    https://youtu.be/wEpWWp7tct4
    Your taste in music is commendable.Please continue writing blogs frequently.

    ReplyDelete
    Replies
    1. తాన్ సేన్ చిత్రం గురించి ఇదివరకు నాకు తెలియదు శశి గారు. మీరు పంపిన లింకులో పాట విన్నాను. A Magnum Opus song. Thankyou. Ravindra Jain ji is a gifted composer with firm grounding in classical music.

      Delete