Saturday, December 16, 2023

బలగం చిత్రం - a well made movie

Slice of Life  సినిమా అంటే - 

నిజ జీవితంలో ఒక ప్రదేశంలో స్వల్ప వ్యవధి లో జరిగిన సంఘటనలను సహజంగా తెరకెక్కించడం.

'The slice-of-life movies are essentially a depiction of the mundane. They will typically focus on character and relationships over things like genre elements, special effects, or the overall aesthetic. In short, they can be thought of as substance over style.'


వేణు సహాయ పాత్రలు, హాస్య పాత్రలలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. పెద్దగా ప్రభావం చూపినట్లు అనిపించలేదు. అతను బలగం అనే సహజమయిన, అర్థవంతమైన మంచి చిత్రం తో దర్శకుడు గా రచయిత గా మారాడు అంటే ఆశ్చర్యం కలిగింది. 


ఈ చిత్రం చూసిన తరువాత ఇతను ఎంత ప్రతిభావంతుడు అన్న విషయం తెలిసింది. Only a person with immense talent and passion can make such movie.


చిత్రంలో కథ, దర్శకత్వం, నటీ నటులు, లొకేషన్, సంగీతం, ఛాయాగ్రహణం , అన్నీ చక్కగా కుదిరాయి.


తెలంగాణా లోని ఒక గ్రామం లో ఉండి కళ్లముందు జరిగిన జీవితాన్ని చూస్తున్న భావన కలిగింది.


Customs and traditions may be region specific but human relations are universal.


వేణు కథను నడిపించిన విధానం బాగుంది. 


Though a serious subject, really liked his sense of humour throughout the movie. 


ఆగుతావా.. రెండు నిముషాలు అని ఒక నటుడు


అది పద్ధతేనాయే.. అని ఒకరు 


అంటుంటే మనకు పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడినట్టు అనిపిస్తుంది.


ఈ చిత్రంలో నటీ నటుల పేర్లు తెలియవు. అందరూ అత్యంత సహజంగా కనిపించారు. 


మద్యం, మాంసం అనేవి గ్రామీణ జీవితం ఆచార వ్యవహారాల్లో అతి సహజ అంతర్భాగం అన్న విషయం ఈ  చిత్రంలో కనిపిస్తుంది.


ఇంటి పెద్ద మరణం నుంచి పదకొండు రోజులలో కుటుంబ సభ్యుల మధ్య ఇగోలు,పంతాలు, మాట పట్టింపులు, నమ్మకాలు, స్వార్థం, వారిలో చివరికి కలిగిన పరివర్తన ..


director succeeds in making the viewers travel through the happenings. 


Even though the subject is not elaborate, the way director tells the story leaves an impact on viewers.


తెలంగాణా జానపద కళారూపాలు ఒగ్గు కథ ను ఉపయోగించిన తీరు బాగుంది. ముఖ్యంగా గా క్లైమాక్స్ లో కళాకారులు గీతం ద్వారా కుటుంబ సభ్యులను పేరు పేరునా వెళ్లిపోయిన పెద్దాయనకు ఉన్న వెలితిని తీర్చేలా పాడడం మనసును కదిలిస్తుంది.


తిథి అన్న కన్నడ చిత్రం ఇదే తరహా సబ్జెక్టు మీద తీశారు అని తెలుస్తుంది.

ఛాయా గ్రహణం బాగుంది. ముఖ్యంగా సంగీతం, పాటలు, సాహిత్యం బాగా కుదిరాయి. 


In my opinion this movie deserves awards in best movie, best direction, music and lyrics categories at National level.


Balagam is one of the rare meaningful movies in Telugu.


Producer Dil Raju deserves appreciation for backing the director and his vision.


వేణు భవిష్యత్తులో మంచి చిత్రాలు తీయగలడు అనిపిస్తుంది.





Friday, December 8, 2023

దక్షిణామూర్తి స్తోత్రం లోని తొలి రెండు శ్లోకాలు - గురూపదేశం

శ్రీ యల్లం రాజు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు అద్వైత సిద్ధాంతం ప్రతిపాదనలు , ఆదిశంకరుల వారి భాష్యం ఆకళింపు చేసుకుంటే ' శాస్త్రజ్ఞులు నిశ్చేష్టులవుతారు, scientists will be baffled'  అని. 

దక్షిణా మూర్తి స్తోత్రం యొక్క అంతరార్థం గురువు గారు విడమరచి చెబుతుంటే ఆ మాట అక్షరాలా నిజం అనిపిస్తుంది.


మొదటి రెండు శ్లోకాలు సంపూర్ణంగా అవగతం చేసుకుంటే జీవ, జగత్, ఈశ్వరుల విషయం లో కలిగే అనేక సందేహాలకు సమాధానం దొరుకుతుంది. 


సృష్టి రహస్యాన్ని రెండు శ్లోకాలలో నిక్షిప్తం చేసిన జగద్గురువు శ్రీ శంకరాచార్య భగవత్పాదులయితే, ఆ శ్లోకాల అంతర్భావాన్ని అతి స్పష్టంగా వివరించి చెప్పిన సద్గురువు శ్రీ యల్లం రాజు శ్రీనివాసరావు గారు. 

-----------

విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని 

మాయయా బహిరివోద్భూతం 

యథా నిద్రయా ।

యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం

తస్మై శ్రీగురుమూర్తయే 

నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।।


బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాఙ్నర్వికల్పం పునః

మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం ।

మాయావీవ విజృంభయత్యపి మాయాయోగీవ యః స్వేచ్ఛయా

తస్మై శ్రీగురుమూర్తయే 

నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే ।।


--------------

It is bewildering to learn about the fundamental concepts of  Space, Time and Matter in the shloka. 


గురువు గారి వివరణ లో


దేశం - Space  - సత్త్వ గుణాన్ని


కాలం - Time - రజో గుణాన్ని


కలన - Matter - తమో గుణాన్ని 


సూచిస్తున్నాయి.


మాయాకల్పిత వైచిత్ర్యచిత్రీకృతం -


అమ్మవారు మాయచే వివిధ ఆకృతులలో, రీతులలో రచించిన త్రిగుణాత్మకమైన జగత్తు. శక్తి తత్త్వం.


అయితే ఈ సృష్టికి మూలం, ఆధారభూతం - అలాగే లయం చేసుకునేది త్రిగుణాతీతం అయిన నిర్వికల్ప స్థితి లోని అయ్యవారు. శివతత్త్వం.


బీజంలో అంకురం అంతర్గతంగా దాగి ఉన్నట్లు జగత్తు ఆత్మ చైతన్యం లో దాగి ఉండి బహిర్గతం అయినట్లు అనిపించి తిరిగి లీనమైపోతుంది.


అద్భుతం . ఒక్క శ్లోకం లో సృష్టి, స్థితి, లయ క్రమాన్ని అద్భుతంగా పొందుపరచడం జరిగింది .


మొదటి శ్లోకం లో దర్పణం, స్వప్నం అనే రెండు దృష్టాంతాల తో జగత్తు స్వరూపాన్ని వివరించడం జరిగింది. 


దర్పణం , దృశ్యం, ద్రష్ట, దృష్టి నాలుగు ఒకటే - అవి  ఆత్మ స్వరూపం కంటే భిన్నంగా లేవు అని గురువు గారు వివరించిన తీరు అద్భుతం.


స్వప్నం దర్శిస్తున్న సమయం లో అది కేవలం స్వప్నం మాత్రమే అన్న విషయం ఎరుక ఉండదు. మెలకువ కలిగిన తరువాత మాత్రమే తాను చూసినది స్వప్నం అంతేకానీ నిజం కాదు అన్న స్ఫురణ కలుగుతుంది.


అదే విధంగా జాగ్రత్ అవస్థలో చూస్తున్న జగత్తు, కలిగే అనుభూతులు ఆభాస మాత్రమే అన్న సత్యం ఆత్మ స్వరూప జ్ఞానోదయం కలిగిన తరువాత మాత్రమే అనుభవానికి వస్తుంది. 


జాగ్రదవస్థ, స్వప్న సమయాల్లో నేను నాది అన్న తలంపు ఉంటుంది. సుషుప్తి లో నేను నాది - ఈ రెండిటి ఎరుక ఉండదు. అవస్థ త్రయానికి అతీతమైన సమాధి లేక తురీయావస్థ లో కేవలం నేను అన్న అద్వైత స్థితి ఉంటుంది అని వివరించారు.


ఇంతకీ జగత్తు ఉందా లేదా ?

అద్వైతం చెప్పే మాట -  ఉంది , లేదు. ఆభాసగా ఉంది. వాస్తవంగా లేదు.


కనిపించే జగత్తును మాయగా అవ్యక్తమైన ఆత్మ చైతన్యాన్ని వాస్తవంగా నిరూపించడానికి ఇంత శాస్త్రం, చర్చ, బోధ అవసరమా, ఆ ఎరుక లేకపోయినా జీవన యానం సాగుతూనే ఉంటుంది కదా అన్న ప్రశ్న వస్తుంది.


అయితే సత్య వస్తువు స్వరూపం కోసం చేసే అన్వేషణ లో - to travel from lower truth to higher truth, to establish finality, Advaita is the chosen path of Acharyas and Upanishadic Rishis.


ద్వైతం ప్రతిపాదించే ప్రారంభ వాదాన్ని, విశిష్టాద్వైతం పరిణామ వాదాన్ని దాటిపోయి అంతిమ పరిష్కారం చూపుతుంది అద్వైతం. 


గురోస్తు మౌనం వ్యాఖ్యానం 

శిష్యాస్తు ఛిన్న సంశయాః 


శిష్యుల సందేహాలు పటాపంచలు అయ్యాయి. 


దక్షిణామూర్తి మౌనం లోని అంతరార్థం అవగతమవుతుంది.🙏










Monday, December 4, 2023

కే సీ ఆర్ పది సంవత్సరాల పాలన - కొన్ని ఆలోచనలు.

భారాస ఓటమి తెలంగాణా రాష్ట్రంలో పెను మార్పు.  ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.

తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనితీరు గత పది సంవత్సరాల కాలం లో ఎలా ఉండింది ?


నా అభిప్రాయం - overall గా పాలన బాగా సాగింది. అభివృద్ధి బాగా జరిగింది.


నచ్చిన అంశాలు -


యాదాద్రి

సుస్థిర ప్రభుత్వం

శాంతి భద్రతలు

24 గంటలు విద్యుత్ సరఫరా

తాగు సాగు నీటి పథకాలు

Huge increase in cultivation and rice production.

సంక్షేమ పథకాలు

హైదరాబాద్ లో infra

New districts and collecorates

New medical colleges.

హరిత హారము, urban parks

New secretariat building


నచ్చని విషయాలు


MIM తో చెట్ట పట్టాల్

Lack of development in public transport especially in Hyderabad.

కేంద్రం / ప్రధాని తో సుహృద్భావం లేకపోవడం

కొన్ని సార్లు ఒంటెత్తు పోకడలు

ప్రజలకు సన్నిహితంగా లేకపోవడం.


We will definitely miss the astute leadership of KCR and KTR.


ముఖ్యంగా కేటీఆర్ మంత్రి గా లేని లోటు క్రమేణా కనిపిస్తుంది. I believe that KTR is one of the best young leaders in India. 


కేసీఆర్ కేంద్రం తో స్నేహపూర్వకంగా ఉండి ఉంటే తెలంగాణాకు ఎంతో లాభం జరిగేది. ముఖ్యమంత్రి ప్రధాని మధ్య అంతగా మైత్రి లేకపోవడం చేత తెలంగాణా కు నష్టం కలిగింది.


Telangana was sidelined in allotment of Funds or projects. E.g. Hyderabad metro expansion was not approved whereas centre allotted huge funds to Bangalore and Chennai.


The renaming of TRS as BRS was a himalayan blunder. Party lost its identity. 


It is very difficult to please people over a period of time. 


ఏమైనా ఈ పదేళ్లలో ఎన్నో రంగాలలో కేసీఆర్ గారి హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది అన్నది నిస్సందేహం.

అయితే కొన్ని పొరపాట్లు కూడా జరిగి ఉండవచ్చు. He may not be perfect. Every individual has his own strengths and shortcomings. 


రాష్ట్ర విభజన కు  వ్యతిరేకి అయినప్పటికీ, కేసీఆర్ పాలన పట్ల ఒక పౌరుడిగా సంతృప్తి ఉంది.


I believe that KCR garu is a dharmic person when compared with Pseudo Hindutva and pseudo secular leaders. 


స్వతంత్ర భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా యాదాద్రి అద్భుత ఆలయం నిర్మించారు. అలాగే చండీ యాగం , రాజశ్యామల యాగం .. అనేక ధార్మిక క్రతువులు నిర్వహించారు. I don't think any other political leader can do such dharmic programmes.


Let us hope that congress provides good governance. If BJP comes back in 2024, which is likely, Telangana may be at disadvantage again unless the new CM gets rapport with centre.


Anyway BRS didn't lose badly. కేటీఆర్ హుందాగా ఓటమిని అంగీకరించారు. I wish that KTR comes back to power as CM in 2028.





Friday, November 17, 2023

బహుదారి రాగం కృతులు - కొన్ని సంగీత విశేషాలు.

కొన్ని రాగాలకు ఒక్క కృతి ద్వారా ప్రాచుర్యం వస్తుంది. ఆయా రాగాల ప్రస్తావన వచ్చినప్పుడు ప్రసిద్ధమైన కీర్తనలు ప్రథమంగా తలపుకు వస్తాయి.

Eg. బ్రోవ భారమా - బహుదారి రాగం.

రఘువంశ సుధాంబుధి - కదన కుతూహల రాగం

వందనము రఘు నందన - శహన రాగం

బంటు రీతి కొలువు - హంస నాద రాగం

బహుదారి రాగంలో బ్రోవ భారమా అన్న త్యాగరాజ స్వామి కృతి బహుళ ప్రాచుర్యం పొందినది.

బహుదారి రాగం హరికాంభోజి రాగ జన్యము. షాడవ- ఔడవ రాగము. అనగా ఆరోహణలో ఆరు స్వరములు, అవరోహణలో ఐదు స్వరములు కలిగి ఉండును. రిషభము ఉండదు. 


పోలికలు ఉంటూనే విలక్షణమైన రూపం, స్వభావం కలిగి ఉండే ఏకోదరుల లాగా బహుదారి, నాగస్వరాళి, గంభీర నాట, తిలాంగ్ రాగాలకు కొంత సామ్యం ఉంటుంది. అయితే దేనికదే తమదైన ముద్ర, నడక, సొగసు కలిగి ఉంటాయి.


ఎన్. రమణి గారి వేణుగానం లో బ్రోవ భారమా కృతి. మధురంగా, రాగం ఆస్వాదించే విధంగా ఉంది.

----------

బ్రోవ భారమా రఘురామ !


భువనమెల్ల నీవై యుండ నన్నొకని 

బ్రోవ భారమా


శ్రీవాసుదేవ! అండకోట్లు 

కుక్షిని యుంచుకొనలేదా 


కలశాంబుధిలో దయతో నమరులకు 

గోపికలకై కొండలెత్తలేదా కరుణాసాగర 


త్యాగరాజుని బ్రోవ భారమా రఘురామ

-----------

భువనమెల్ల తానై యుండి,

చతుర్దశ భువనాలను కుక్షిలో నిలుపుకున్న, క్షీర సాగర మథనంలో దేవతల కోసం కూర్మ రూపం దాల్చి మందర పర్వతాన్ని మోసిన, గోపికలను, గోపకులాన్ని, గోవులను కుంభ వృష్టి నుంచి రక్షించుటకై గోవర్ధన గిరిని అలవోకగా చిటికెన వ్రేలుపై నిలిపిన స్వామికి నన్నొకని బ్రోవ భారమా అని ఈ కృతిలో త్యాగరాజ స్వామి భావన కనిపిస్తుంది.

----------

బహుదారి రాగం లో ఉన్న ఒక మంచి గీతం తారస పడినది.


శ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ గారు శ్రీ ఆది శంకరాచార్యుల వారిపై రచించి, స్వరపరచి గానం చేసిన సంస్కృత గీతం. 


జయ జయ శంకర హర భయమీశ్వర అన్న ఈ కృతి చాలా బాగా వచ్చింది. పాట సాహిత్యం అద్భుతం. 


న కర్మణా న ప్రజయా ధనేన

త్యాగేనైకే అమృతత్వమానశు:


అన్న కైవల్యోపనిషత్తు లోని సన్యాస సూక్తం లోని భావాన్ని ఈ కృతిలో అందంగా పొందుపరచారు.


శ్రీనివాస శర్మ గారు కర్ణాటక సంగీతంలో నిష్ణాతులు,వేద పండితులు ,సంస్కృత సాహితీ వేత్త , వాగ్గేయకారులు, సనాతన ధర్మ ప్రవచన కర్త,  బహుముఖ ప్రజ్ఞాశాలి అని వారి యూట్యూబ్ చానెల్ లో ఉన్న అనేక వీడియోల ద్వారా అవగతం అవుతుంది. 

--------

ఇరబేకు హరిదాసర సంగ - పురందర దాసు కీర్తన - బహుదారి రాగం - గానం రంజని గాయత్రి sisters . Pleasant rendition.

-----------

పక్క వాయిద్యాలు తగినంత మేరకు వినిపించినప్పుడు శ్రోతలకు మరింత ఆనందం కలుగుతుంది. ప్రధాన సంగీత కారుని పక్కవాయిద్యం అనుగమించాలి కానీ అధిగమించ కూడదు. ఇది ప్రధాన మైన అంశం.


Setting the audio volume for the main artist and supporting instrumentalists plays a very important role in the concert. Sometimes we see the main artist voice getting drowned in the din of the accompanying instruments. This mars the experience of listeners. Auditorium with good acoustic quality, sound system, and experienced artistes with perfect understanding will enhance the experience of listeners.







 


 





Sunday, November 5, 2023

మహావాక్య విచారణ - శ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు గారి ప్రవచనం. - కొన్ని ఆలోచనలు

అద్వైతం అంటే super science. అది science లకే science అని శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు తరచుగా చెబుతారు. 

అద్వైత తత్వ సిద్ధాంతంలో నాలుగు  మహావాక్యాలు ఆ వాక్యాలపై విచారణ ప్రధానమైన అంశంగా చెప్పారు.


నాలుగు వేదాల అంతర్గతం గా ఉన్న ఉపనిషత్తుల నుండి ఒక్కొక్క గొప్ప వాక్యం స్వీకరించి మహావాక్యాలుగా అద్వైత ఆచార్యులు నిర్ణయించారు. అవి


1) ప్రజ్ఞానం బ్రహ్మ - ఐతరేయ ఉపనిషత్తు - ఋగ్వేదం


2) అయం ఆత్మా బ్రహ్మ - మాండూక్యోపనిషత్తు - అధర్వణ వేదం.


3) తత్ త్వం అసి - ఛాందోగ్య ఉపనిషత్ - సామవేదం


4) అహం బ్రహ్మాస్మి - బృహదారణ్యకోపనిషత్తు - యజుర్వేదం  


మహావాక్య విచారణ అనే అంశం పై శ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారి ప్రవచనాలు అందుబాటు లో ఉన్నాయి. ఈ ప్రవచనం శ్రవణం చేస్తే ఆది శంకరాచార్యులు  శ్రీ యల్లంరాజు గారి ద్వారా స్వయంగా బోధ చేస్తున్నారు అన్న అనుభూతి కలుగుతుంది.


పై నాలుగు వాక్యాలను మహావాక్యాలు అని ఎందుకు అంటారు అన్న విషయం వివరణ మొదలుకొని మహావాక్య విచారణ ఎందుకు చేయాలి, విచారణ విధానం, మహావాక్యాలు జీవుడికి ఉన్న సమస్యను ఎలా పరిష్కరిస్తాయి అనే విషయాలను ఆమూలాగ్రం విశదీకరించి వివరించే విలువైన ప్రవచనాలు. 


ఈ ప్రవచనాలు వినగలగడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.


ముఖ్యంగా ' తత్ త్వం అసి ' కంటే  ఛాందోగ్య ఉపనిషత్ లోని 'సర్వం ఖలు ఇదం బ్రహ్మ ' అన్న వాక్యాన్ని మహావాక్యం గా పరిగణించడం మరింత సముచితంగా ఉంటుంది అని ఆయన వివరించిన తీరు ఆయన లోతైన పరిశీలన, మూల పరిశోధన కు ప్రబల నిదర్శనంగా నిలుస్తుంది.


ఇందులో మొదటి వాక్యం బ్రహ్మ స్వరూపమునకు, చివరి వాక్యం ఆత్మ స్వరూప సిద్ధికి  మధ్యలో ఉన్న రెండు వాక్యాలు సాధన పరంగా చెప్పబడ్డాయి.


ప్రజ్ఞానం బ్రహ్మ అన్న వాక్యం బ్రహ్మ స్వరూపాన్ని నిర్వచిస్తే, అహం బ్రహ్మాస్మి అన్న వాక్యం సిద్ధిని సూచిస్తుంది. 


అయం ఆత్మా బ్రహ్మ, సర్వం ఖలు ఇదం బ్రహ్మ అన్న వాక్యాలు వరుసగా జీవ జగత్తులను పరిష్కరించే సాధనను చూపుతున్నాయి.


స్వరూపం - సాధన - సిద్ధి 


ఈ విధంగా నాలుగు మహావాక్యాలు సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం, ఆ స్వరూపాన్ని అందుకోవడానికి చేయవలసిన సాధన, సాధన ద్వారా అంతిమంగా పొందవలసిన సిద్ధిని సమగ్రంగా ఆవిష్కరిస్తున్నాయి.


యల్లంరాజు గారు క్లిష్టమైన విషయాలను వివరించడానికి స్వీకరించే ఉదాహరణలు, ప్రతీకలు దైనందిన జీవితం లో అందరికి అనుభవం లో ఉండే అతి సాధారణ విషయాలే. ఆయన ప్రసంగం తో పాటు ప్రయాణించ గలిగితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఒక థ్రిల్ వంటి అనుభూతి కలుగుతుంది. బోధించే విషయం పైన సమగ్రమైన, లోతైన అవగాహన, పరిజ్ఞానం ఉండటం ఒకటయితే, ఆ విషయాన్ని సుబోధకంగా, మనోరంజకంగా, హృదయంలో  నాటుకునేటట్టు వివరించడం మరొక ప్రజ్ఞ. ప్రవచనంలో ఉద్దేశ్యించిన అంశం యొక్క ప్రాధాన్యం ఎక్కడా సడలకుండా, ఉపాఖ్యానాలు అవసరమైనంత మేరకే చెబుతూ సాగే యల్లంరాజు గారి ప్రవచన శైలి అనితరసాధ్యం. ఆయన ఒక ప్రణాళిక తో ప్రవచనం నిర్మించే తీరు అద్వితీయం. అద్వైత సిద్ధాంతం బోధనతో ఆగిపోక సాధన యొక్క ప్రాముఖ్యం వివరిస్తూ సాగుతుంది. ఆయన వాక్కులో ఉండే ధాటి, శక్తి చూస్తే అమ్మవారు స్వయంగా ఆయన నోటి ద్వారా పలికించారు అనిపిస్తుంది.


ఆయన  దృష్టి ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, అనేక శాస్త్ర గ్రంథాల వాచ్యార్థం కన్న లక్ష్యార్థం పైన. భాగవతం, రామాయణం, భారతం, ఉపనిషత్తులు .. ఇలా ఏ గ్రంథమైనా ఆ ఋషులకు, మహా కవులకు ఉన్న అద్వైత దృష్టి, వారు ఏ  లక్ష్యంతో ఆయా గ్రంథాలను నిర్మించారో అన్న విషయం యల్లంరాజు గారి వివరణలో మనకు తేటతెల్లం అవుతుంది.


ఈ ప్రవచనాలను రికార్డు చేసి అందరికి అందుబాటులో ఉంచిన శ్రీ యల్లం రాజు గారి  ప్రత్యక్ష శిష్యులకు కృతజ్ఞతలు.


అనేక జన్మల పరంపర లో పోగుపడిన వాసనలను, కరడు కట్టిన సంస్కారాలను వదిలించుకోవడానికి సామాన్యులకు కర్మ, జ్ఞానం అనే రెండు సాధనాల అవసరం ఉంటుంది అని చెబుతారు. మానవుని లక్ష్యమైన మోక్ష సాధన కోసం జీవితాంతం నిత్య, నైమిత్తిక కర్మలు ఆచరించడం, జప తప, స్వాధ్యాయ ధ్యానాదులచే చిత్త శుద్ధి సాధించడం, శ్రవణ మనన నిదిధ్యాసనల ద్వారా సత్ స్వరూప జ్ఞానం పొందటం కోసం ఆజన్మాంతం ప్రయత్నం  కొనసాగవలసి ఉంటుంది అని చెప్పారు.🙏









Wednesday, October 25, 2023

శ్రీ జస్విందర్ ధని- కృష్ణ భక్తి గీతాలు


భక్తి గీతాలు మధురంగా, నెమ్మదిగా సాగుతూ శ్రోతలకు ప్రశాంతతను,  ఆనందాన్ని కలిగించేలా ...


పాటలో సాహిత్యం లలితమైన, అర్థవంతమైన పదములతో...


సంగీతం గానం మనసుకు హాయి గొలిపే విధంగా... 


ఉంటే బాగుంటుంది.


ఇటువంటి భక్తి గీతాల ఆల్బమ్ శ్రీ జస్విందర్ ధని గారు (10-11 సంవత్సరాల క్రితం) స్వరపరచి పాడారు. కృష్ణా శ్రీ కృష్ణా అనే పేరుతో ఉన్న ఆల్బమ్ లో మంచి భక్తి గీతాలు ఉన్నాయి.


గణేశ్ నవరాత్రులలో, శివరాత్రి, దసరా, ఉగాది .. పండుగల సందర్భంగా కొందరు ఔత్సాహికులు కొత్త గీతాలు స్వరపరచి పాడుతున్నారు. వారి ప్రయత్నం మంచిదే.  అయితే అధిక భాగం ఆ గీతాల్లో భక్తి భావం, ప్రశాంతత అంతగా అనిపించదు. వేగంగా పరుగులు తీసినట్లు పాడితే అది హృదయాన్ని చేరదు.


అలాగే శృతి విషయం లో మన వైపు గాయకులు హిందూస్థానీ గాయకుల లాగా కృషి చేయడం బాగుంటుంది.


జస్విందర్ గారి గాత్రం మధురం. తెలుగు మాతృ భాష కానందువల్ల పదముల ఉచ్చారణ లో కొంత వ్యత్యాసం ఉంది. అయినా ఈ పాటల మాధుర్యం, భక్తి భావం వలన ఆ విషయం అంతగా తెలియలేదు.


ఈ పాటల సాహిత్యం వెంపటి రాయంచ అనే రచయిత వ్రాసినట్లు తెలుస్తుంది. సాధారణ పదాలతో మంచి భావం అందించారు.


ఈ పాటలు భక్తి ఛానెల్స్ లో అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి.


ఓ చక్రధారి ఓ వనమాలి 


ఆడి పాడే చూడు భలే మాయల వాడు


ఈ పాటలు వింటూ ఉంటే బృందావనంలో రాధా కృష్ణుల సన్నిధి లో ఉన్నట్లు ఆ సన్నివేశం ఎదురుగా జరిగినట్లు భావన కలుగుతుంది. ఈ పాటలు విన్న ప్రతిసారీ సాహిత్యం లో భక్తి భావం, శరణాగతి, ప్రేమ అనుభూతి కలిగిస్తాయి.

--------

ఆడి పాడే చూడు భలే మాయలవాడు

కృష్ణ గోవిందుడు రాధ తోడ ఆడే చూడు


మోవిని ముద్దుల దరహాసం వాడు

పింఛము తలపై తగిలించిన వాడు

భాగ్యశాలిగా ఆ వెదురు

స్వామి పెదవులపై పిల్లనగ్రోవై


చంద్రుని తేజం రాధారాణి

దీపపు కళిక ఆ మహరాణి

కంఠంలో ధరించే ఆ కృష్ణ హారము

నింగి చుక్కలైన బలాదూరెగా.


పావనమైనది రాధా ప్రేమ

జీవన వేణువు తానే కాదా

ప్రేమంటే అర్థం రాధే మరి

ఆ గోవిందుని చేరే మరి


ఆడి పాడే చూడు భలే మాయలవాడు

కృష్ణ గోవిందుడు రాధతోడ ఆడే చూడు


-------



Sunday, October 8, 2023

మధుర గాయని బి.రమణ గారు

గణేశ్ నవరాత్రుల ప్రసారం లో వినాయకా నీ మూర్తికే  మా మొదటి ప్రణామం అనే ఒక పాట వినిపించింది. ఆ వాయిస్ లో  ఉన్న మాధుర్యం, స్పష్టత, శృతి చూసి ఎవరు ఇంత బాగా పాడారు అని వెతికితే.

గాయని బి రమణ గారు అని తెలిసింది. ఆమె ఎవరో కాదు. 70 80 లలో వచ్చిన సినిమాలలో అనేక సినీ గీతాలు పాడిన సీనియర్ నేపథ్య గాయని బి.రమణ గారు అని తెలిసింది.


నాకు సుశీల గారి గాత్రం అంటే ప్రత్యేకమైన అభిమానం. 


అదే తీరుగా ఉన్న రమణ గారి గొంతులో మాధుర్యం, స్పష్టత, శృతి విని ఆశ్చర్య పడ్డాను. అలాంటి గోల్డెన్ వాయిస్ దేవుడిచ్చిన వరం. అతి కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది.


main stream గాయని గా అవకాశాలు వచ్చి ఉంటే రమణ గారికి ఎంతో పేరు వచ్చి ఉండేది. అయితే అదే సమయంలో మేరు సమానులైన  సుశీల గారు జానకి గారు పీక్స్ లో ఉన్నారు.  బహుశ : అంచేత రమణ గారికి చిన్న చిత్రాలలో, కాంబినేషన్ గీతాలు, డబ్బింగ్ సినిమా గీతాలు ఎక్కువగా లభించాయి. ఆమె లైమ్ లైట్ లోకి రాలేకపోయారు అనిపిస్తుంది.


అయితే ఆమె భక్తి గీతాలు విరివిగా పాడినట్లు తెలుస్తుంది. అందులో కొన్ని గీతాలు యూ ట్యూబ్ లో ఉన్నాయి.


మహిషాసుర మర్దిని స్తోత్రం - ఈ భక్తి గీతం ఎన్నోసార్లు విని సుశీల గారు పాడారు అనుకున్నాను ఇన్నాళ్లు. అయితే రమణ గారు పాడారు అని తెలిసి ఆశ్చర్యం కలిగింది. అంత బాగా పాడారు.


అన్నమయ్య కీర్తనలు. - చాలా చక్కగా పాడారు రమణ గారు. సాహిత్యం స్పష్టంగా అర్థమయ్యేలా ఉచ్చారణ, మధురమైన గాత్రం, మంచి శృతి. ఈ మూడు లక్షణాలు ఉన్న గాత్రం అరుదుగా ఉంటుంది.

ఇలాంటి గాత్రం ఉన్న గాయని ఇతర భాషలలో ఉంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చి ఉండేవి.


ముఖ్యంగా పై స్థాయి లో High pitch కూడా స్పష్టత లోపం లేకుండా పాడటం సామాన్యమైన విషయం కాదు. గురుతెరిగిన దొంగ గూ గూ గూ అనే అన్నమయ్య గీతం రమణ గారు పాడిన తీరు లో ఈ విషయం గమనించ వచ్చు


బి. రమణ గారి తో యజ్ఞ మూర్తి గారు చేసిన ఈ యూ ట్యూబ్ ఇంటర్వ్యూ లో అనేక విశేషాలు రమణ గారు పంచుకున్నారు.


బి. రమణ గారిని సముచిత రీతిలో ప్రభుత్వం వారు, సినీ పరిశ్రమ గుర్తించి సన్మానిస్తే బాగుంటుంది.








Monday, September 25, 2023

బేబీ , మాష్టారు చిత్రాలలో - రెండు ప్రేమ గీతాలు

ఇటీవల వచ్చిన చిత్రాల్లో రెండు పాటలు బాగా ఆకట్టుకున్నాయి. మెలోడీ ఉన్న పాటలు ఎక్కడినుంచో పలకరిస్తూనే ఉంటాయి. 


బేబీ అనే సినిమా ఈ మధ్య పెద్ద హిట్ అయ్యింది. అందులో ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాట బాగుంది. ( శ్రీరామ చంద్ర గానం - విజయ్ బుల్గానిన్ సంగీతం - అనంత్ శ్రీరామ్ సాహిత్యం)


A pleasant soothing melody. Really appreciate the singer Srirama Chandra and composer vijai. Flawless signing with crystal clear voice and pronunciation. I really liked his singing in the higher octave.


Kids chorus adds pleasantness to the song in another version.


This song may be a defining moment for his singing career.


Vaathi అనే తమిళ్ సినిమా తెలుగులో మాష్టారు అన్న పేరు తో వచ్చింది.


ధనుష్ , సంయుక్త మీనన్ నటీ నటులు.


ఇందులో ఒక పాట చాలా బాగా వచ్చింది. The song was presented in the pre release function beautifully in the own voice of actor Dhanush and singer Shweta Mohan. Music by GV Prakash Kumar. 


Shweta Mohan is a good singer and sang so well. Dhanush also sang really well.


This song sounded better in the live performance as it was rendered in a slower pace.


మంచి పాటలు అప్పుడప్పుడు ఇలా పలకరించి పోవడం బాగుంటుంది.


Quality of orchestra, mixing and recording is very good in both the songs. For such melody songs voice has to be enhanced.  Percussion and music should be minimum,supportive and non invasive. The music directors got it right for both the songs.


దర్శకుడికి మంచి అభిరుచి ఉంటే సినిమాలో కనీసం ఒక చక్కని పాట ఉండే అవకాశం ఉంటుంది.


Lyrics work like mere fillers in such melody songs. The power of the tune and music take centre stage and the words seem to flow automatically. Sailing with the music, we don't really try to understand the lyrics.


Lovers want to travel together for rest of their lives. And beautiful duets strike a chord with lovers and music lovers.





Wednesday, September 20, 2023

యమునా కళ్యాణిలో - హంసవాహనముపై



తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పుడు నేపథ్యంలో మధురమైన భక్తి గీతాలు ఆయా వాహన సేవలకు అనుగుణంగా  వినిపిస్తాయి.

అందులో హంస వాహన సేవపై వచ్చిన ఈ గీతం బాగుంది.


చక్కటి సాహిత్యం సంగీతం. గాయని సంగీత పరంగా చక్కగా పాడింది. Talented singer. Still there is a tinge of harshness in the voice. అలాగే సాహిత్యం ఉచ్చారణ లో మరింత స్పష్టత ఉండాలి అనిపించింది. నాలుగైదు సార్లు శ్రద్ధగా  విన్న తరువాత పాట లిరిక్స్ వ్రాయ గలిగాను.


ఈ బ్రహ్మోత్సవ వాహన సేవ గీతాల album ఎవరు చేశారో తెలియదు కానీ మంచి సాహిత్యం, సంగీతం కుదిరాయి.


-----------

హంస వాహనముపై హరి మీరు చూడరో 

వీణాపాణియై వేయి రాగాలతో


అందరి గుండెలోన అమృతము కురియగా

అతివ సింగారములు అలవోకగ  నొలికించుచు 


భవ్య వేదధామ భవభంజన రామ

గగన మేఘశ్యామ జగన్మోహన సోమ

రవి సోముల జడదాల్చి

రసగానము ఎద దాల్చి


అతివ సింగారములు అలవోకగ  నొలికించుచు - హంస వాహనము పై..


నిగమాగమ సీమ సుగుణ సార్వభౌమ

హంసయాన కామ అసురాధిప భీమ

పాలు నీరు వేర్పరుచు పావన యోగీంద్రుడు

సారపు విజ్ఞానమిడే శారదమూర్తియై


హంస వాహనముపై...


-------------


పాట యమన్ కళ్యాణ్ రాగం ఆధారం గా స్వరపరిచారు. Half the job is done once Kalyani or Yaman Kalyan ragam is chosen to compose a song.


అలవోకగ నొలికించుచు అన్న పదం దగ్గర stamp of యమునా కళ్యాణిని గుర్తించ వచ్చు.


కళ్యాణి రాగానికి ఉన్న శక్తి అది. సరైన రీతిలో సాహిత్యం, సంగీతం, గానం కుదిరితే కళ్యాణి రాగ దేవత ఎదురుగా వచ్చిన భావన కలుగుతుంది.


యమన్ కళ్యాణి రాగంలో ఉన్న అమృత తుల్య గీతాలు కృష్ణా నీ బేగనే బారో, భావయామి గోపాల బాలం, నగవులు నిజమని, హరిదాసులు వెడలే ... గీతాలు. కళ్యాణి రాగం తరగని బంగారు గని వంటిది. అక్షయపాత్ర వంటిది. ఎంత తీసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది.


తంబురా perfect గా శృతి చేసి మీటితే సప్త స్వరాలు పలుకుతాయి వినిపిస్తాయి అని చెబుతారు. ఆ తంబుర నాదంలోనుంచి వ్యక్తమైన సప్త స్వరాలు రాగాలుగా, గీతాలుగా, వివిధ గాత్రముల, వాయిద్యాల రూపంలో విస్తరిస్తాయి. పరబ్రహ్మ నుంచి చరాచర సృష్టి వ్యక్తమైన తీరుగా.


నాదం శివస్వరూపం, సంగీతం శక్తి స్వరూపం.


వందే పార్వతీ పరమేశ్వరౌ 🙏🙏