Tuesday, August 2, 2022

కవిత్వం made easy - పఠనం made difficult

ఇటీవలి నెలలలో  3-4 లఘు రచనలు వ్రాశాను. ( కొన్ని పంక్తుల సముదాయం అనవచ్చు). 

అవి సాక్షి దినపత్రిక ఆదివారం పుస్తకం లో వచ్చాయి. 

వచన కవితలు అనబడే రచనలు ఈ రోజులలో ఎంతమంది చదువుతారో తెలియదు.

అప్పుడప్పుడు మంచి రచనలు ఆలోచింపజేసే పంక్తులు కనిపిస్తాయి.

సాహిత్యానికి కవిత్వానికి ఒక పుట సాక్షి పత్రికలో కేటాయించారు.

ఎందుకో గానీ ఈనాడు పత్రిక లో సాహిత్యానికి కవిత్వానికి పేజీ లేదు. పుస్తక పరిచయం మాత్రమే ఉంటుంది. 

దాదాపు నలభై ఏళ్ల క్రితం  రెండు మూడు మినీ కవితలు, కొన్ని కార్టూన్లు ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో వచ్చాయి. ఆ సమయం లో భలే థ్రిల్ గా అనిపించింది.  ఇప్పుడు ఆ రచనలు తలుచుకుంటే హాస్యాస్పదం గా అనిపిస్తుంది.

గొప్ప రచనలు కొన్ని చదివాక నేను ఎందుకు వ్రాయకూడదో అర్థమైంది.

ఆ తరువాత ఇక ప్రయత్నించలేదు. అయితే some habits die hard and surface later.  

ఒకటి రెండు ఈ మాట కు పంపాను. అవి ఏమాత్రం బాగాలేవు అని నాకే అనిపించింది. వారు పాపం ఎంతో మృదువుగా అదేమాట చెప్పారు.

ఆ తరువాత కొంచెం సాధన చేసి కొంత ఆద్వైతం, ఆధ్యాత్మికత కలిపి కొన్ని పంక్తులు వ్రాసి సాక్షికి పంపాను. వారు ఎందుకో మరి ప్రచురించారు.

నాకు ఆనందం కంటే ఆశ్చర్యం కలిగింది.

క్రింది రచన సంగీతం, నాదం ఆధారంగా వ్రాశాను. గంభీరంగా ఉండాలి అని కొన్ని సంస్కృత సమాసాలు ఉపయోగించాను. అవి

అసందర్భంగా లేవు అని అనుకుంటున్నాను.

నా రచనల సంగతి అలా ఉంచితే, అప్పుడప్పుడు కొన్ని అద్భుతమైన వాక్యాలు చదవగలిగాను.

కొందరు రచయితల భావుకత, వారి భావ వ్యక్తీకరణ, వారి రచనలలో వస్తు వైవిధ్యం, పద చిత్రాలు  బాగుంటాయి.

తనకు కలిగిన భావనకు అక్షర రూపం ఇవ్వాలి అన్న బలమైన కోరిక రచనకు పురికొల్పుతుంది అనుకుంటాను.

ఏమైనా సంప్రదాయ సాహిత్యం, గొప్ప రచయితల రచనలు కొంత మేరకైనా చదివి అర్థం చేసుకోకుండా రచనలు చేయడం అవివేకమైన పని అని నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను. Creative art may work as a type of catharsis for artists. Sometimes audience may also feel the same.

















Tuesday, May 31, 2022

కాలం కదలికల సాక్షిగా - three magic songs

గత ఇరవై ఏళ్లలో వచ్చిన సినిమా పాటల్లో నాకు బాగా నచ్చిన పాటలు which really impressed me are very few. Maybe less than ten.


Only a few songs seem to achieve that magic mix of good music, lyrics, singing, recording, acting and picturization.


I am not against new age songs per se. Still I feel the present day songs lack the soul and melody of 70s and early 80s.


Cine music trends keep changing. Only a few songs live forever.


నాకు నచ్చిన ఈ పాటలు of not so distant past.


1) నువ్వేలే నువ్వేలే - దేవుడు చేసిన మనుషులు - శ్రేయా ఘోషల్ - రఘు కుంచే 

భాస్కర భట్ల - పూరీ జగన్.Really appreciate the efforts of all who collaborated for this beautiful song.


ప్రతి సంగీత దర్శకుడికి career best songs కొన్ని ఉంటాయి. I don't know if Raghu Kunche will have an occasion to compose such a song again.  Shreya Goshal is a gifted singer who did full justice to this song. Puri Jagan, the actors, songwriter.. everything seems to fall into place. 


2) ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే - నిన్ను కోరి - గోపి సుందర్ - రామ జోగయ్య శాస్త్రి - కార్తీక్ - చిన్మయి.

Gem of a song. Superb music, lyrics, acting, picturization.  The lead actors Nani and nivetha Thomas are likeable. No wonder this song struck a chord with young and not so young alike.

-----------

ఆనందం సగం...ఆశ్చర్యం సగం.. ఏమైనా నిజం... బాగుంది నిజం..

కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం

-------------

3) ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు - రాజు భాయ్ - యువన్ శంకర్ రాజా - రామ జోగయ్య శాస్త్రి - హరీష్ రాఘవేంద్ర

such a lovely song. Beautiful lyrics, vocals, music, choreography, acting. A forever song for Manoj.

 ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను.  

రామ జోగయ్య శాస్త్రి, చంద్ర బోస్ - carry on the legacy of legends వేటూరి , సీతారామ శాస్త్రి.


ఇటీవల చదివిన ఒక కవితలోని  పంక్తి.

పరుగు తీయడం అలవాటై నడక మరచిపోయాము. 

Watch and listen to these songs on  a pleasant night  and end up gazing into the starry sky.  

















Tuesday, March 22, 2022

తత్త్వవిదానంద సరస్వతి స్వామి స్ఫూర్తి- ఒక లఘు కవిత

 





    ప్రస్తుత కాలంలో శంకర అద్వైత సిద్ధాంత  ప్రవచన కర్తలలో శ్రీ తత్త్వవిదానంద సరస్వతి స్వామి గారు అగ్రగణ్యులు. వారి ప్రసంగాలు, రచనలు మిక్కిలిగా అందుబాటులో ఉన్నాయి.


స్వామి సంప్రదాయ కుటుంబం లో జన్మించారు. బాల్యంలో వేద విద్యను సంస్కృత భాషను అభ్యసించి తదుపరి ఆధునిక విద్య నేర్చుకున్నారు. రసాయన శాస్త్రం లో Ph. D పొంది ప్రభుత్వ ఉద్యోగం చేశారు. వేదవిద్య ఆధారంగా సంస్కృతంలో మరల Ph. D అందుకున్నారు. 


అయితే ఆత్మ ప్రబోధానుసారం ఆర్ష విద్యా సంస్థ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి స్వామి పట్ల ఆకర్షితులై వారి శిష్యులు గా మారి సన్యాసం స్వీకరించారు. 


దాదాపు 30 ఏళ్లుగా శంకర అద్వైత బోధలు తమ ప్రసంగాలు, రచనల రూపం లో నిరంతరంగా కొనసాగిస్తున్నారు. తెలుగు ఆంగ్ల భాషలలో ప్రసంగిస్తారు.  వారి బోధనలు సూటిగా సరళంగా , సహేతుకంగా, శాస్త్రీయ దృక్పథం తో సాగుతాయి. మూఢ మిథ్యా చారాలు, ఆడంబరం, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. ప్రచారానికి దూరంగా ఉంటారు.      ప్రతి సంవత్సరం కొన్ని నెలల పాటు  అమెరికాలో ఉండి ఉపదేశం ఇస్తారు.

వారి బోధనలు, రచనల ప్రధాన ఉద్దేశ్యం అద్వైత  వేదాంత దర్శనం. అయితే వ్యావహారిక జీవితానికి అద్వైత మార్గానికి వారు చక్కని సమన్వయం చూపుతారు. వారి ప్రవచనం విన్నవారిపై తప్పక ప్రభావం చూపుతాయి అనడం లో సందేహం లేదు. Swamiji is a perfect blend of sanatana Dharma and modern thought process. 


స్వామి గారి ప్రవచనాలు రచనలు ప్రస్థాన త్రయం, శంకర భాష్యం, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు. .. సరళమైన శైలిలో ఉపదేశిస్తాయి. 


పంచీకరణం ప్రకరణ గ్రంథం పై స్వామి ఆంగ్లం లో ఇచ్చిన ప్రవచనాలు ఇక్కడ ఉన్నాయి. ఎంతో విలువైన ఉపదేశాలు.

స్వామి ప్రవచనాల స్ఫూర్తి తో ఒక లఘు రచన వ్రాశాను. అది సాక్షి పత్రిక ఆదివారం అనుబంధంలో 21-3-2022 తేదీ వచ్చింది.



భక్తి , జ్ఞానం రెండు కూడా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి ముఖ్య సాధనాలు అని ఆచార్యులు చూపిన మార్గం శిరోధార్యం.స్వామి బోధనలు సనాతనం, సనూతనం.

Wednesday, February 16, 2022

డిస్కో కింగ్ బప్పి లహరి - మేరే ఏ గీత్ యాద్ రఖనా

 


80 లలో బప్పి లహరి సంగీతం యువతకు బాగా నచ్చేది. తెలుగులో కూడా సింహాసనం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్... సినిమాలలో పాటలు బాగా వినిపించేవి. 


హిందీ సినిమాలలో డిస్కో డాన్సర్ సినిమా పాటలు  ఒక ఊపు ఊపాయి. అలాగే శరాబీ చిత్రం లో పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.


హిప్పీ జుట్టు, జిగేల్ మనే కోటు, పెద్ద చలువ కళ్ళజోడు, ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి విలక్షణంగా కనిపించేవాడు.


He brought in Western beats, sounding  and techno music into our film music.


అతని మాస్ బీట్ ఉన్న డిస్కో పాటలు బాగా హిట్ అవ్వడంతో అదే ముద్ర పడిపోయింది.


నిజానికి there is more to bappi than mass beat disco songs. He was capable of composing soulful melodies. Having been strait-jacketed in disco and fast paced songs, he couldn't compose many melodies.


అతను 24 ఏళ్ల వయసు లోనే తన మొదటి సినిమా లోని కిషోర్ పాడిన ' చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖనా ' పాట  ఇచ్చాడు.


బప్పి సంగీతం సమకూర్చిన చిత్రాలలో ऐतबार చిత్రం లోని పాటల్లో తన అంతరాత్మ కనిపిస్తుంది.


సినారె ఒక పాటలో ' మేనితోనే ఆగుతాయి ముద్దులు, గుండె దాకా సాగుతాయి ముద్రలు  ' అని వ్రాసినట్లు కొన్ని పాటలు శరీరానికి, ఇంకొన్ని మనసు దాకా పడతాయి. కొన్ని మాత్రమే హృదయానికి చేరువౌతాయి.


ऐतबार చిత్రం లోని రెండు పాటలు.

1) किसी नज़र को तेरा इंतज़ार आज भी है

2) आवाज दी है आशिक़ नज़र में ।

Both are lovely compositions. Sung by Bhupinder and Asha Bhosle. 


భూపెందర్ గజల్ గాయకుడు. కొన్ని పాటలే పాడినా ఆణిముత్యాల వంటి పాటలు పాడాడు. అతను r d బర్మన్ పాటలలో గిటార్ వాయించేవాడు.'  చురాలియా హై తుమ్ నే జో దిల్ కో  ,' పాటలో అద్భుతంగా గిటార్ వాయించాడు. తరువాత గాయకుడి గా ఎదిగి బర్మన్ సంగీతం లో అద్భుతమైన పాటలు పాడాడు. 

Bappi Da has many fans including AR Rahman.

A unique composer with zest for life. His persona and music instantly brings smile and energy. 

RIP🙏.



Sunday, February 6, 2022

శబ్దం - నాదం - లయం - శుద్ధ సారంగ రాగం - కొన్ని Musical Musings

అన్ని రాగాలకు  సప్త స్వరాలు building blocks గా ఉన్నాయి. 

The seven basic notes with a few variants of ri, ga, ma, da, ni give rise to 12 or 16 working swarams.

అయితే ఈ 7/12/16 స్వరాల వివిధ కలయికలో వివిధ రాగాలు పుట్టుకొచ్చాయి. రాగం అంటే కేవలం కొన్ని స్వరాల అమరిక కాదు. ప్రతి రాగానికి ప్రాణ స్వరాలు, పడికట్టు సంగతులు, గమకాలు,  ఆలాపన సంప్రదాయాలు కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగి , స్థిరపడి ఉన్నాయి.

సింధు భైరవి, తోడి రాగాలకు స్వరాలు ఒకటే అయినా రాగ స్వరూపంలో ఎంతో భేదం ఉన్నది.

రసాయన శాస్త్రం లో మూలకాల లాగా రాగాలకు ఒక నిర్దుష్ట స్వరూపం ఉన్నది. Each ragam has a distinct identity.

ఇటీవల svbc లో ఒక సంగీత కార్యక్రమం లో శుద్ధ సారంగ రాగం ఆధారిత గీతాల గురించి శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర గారు ప్రస్తావించారు.  

శుద్ధ సారంగ రాగం హిందుస్తానీ సంగీత సంప్రదాయం కు చెందినది. కర్ణాటక సంగీతం లో హంసనాదం రాగానికి దగ్గరగా ఉన్నట్టు తెలుస్తుంది. 

ఈ రాగం ఆధారం గా స్వరపరచ బడిన కొన్ని మధుర గీతాలు ఉన్నాయి. 

1) కర్ణ చిత్రం లోని ' నీవు నేను వలచితిమి '  చాలా ప్రసిద్ధమైన పాట ( విశ్వనాథన్ - రామ మూర్తి, -సినారె -బాలమురళి - పి సుశీల గార్లు ) . తమిళంలో TM సుందర రాజన్ - P సుశీల గారు పాడారు. 

ఈ పాటలో బిస్మిల్లా ఖాన్ గారు  షెహనాయి వాయించినట్లుగా తెలుస్తున్నది. 

2) శ్రీ వేంకటేశ్వర మాహాత్మ్యం   చిత్రం లోని ' ఎవరో అతడెవరో ఆ నవమోహనుఁడెవరో ' పాట (పెండ్యాల - ఆత్రేయ- ఘంటసాల- సుశీల గార్లు)  

3) మహాకవి కాళిదాసు చిత్రం లో  'జయ జయ జయ శారదా నవ కళా విశారదా ' గీతం ( పెండ్యాల - పింగళి- సుశీల గార్లు) 

హిందుస్థానీ శైలిలో విదుషి శ్రీమతి కౌశికి చక్రబర్తి పాడిన శుద్ధ సారంగ రాగంలోని ఒక ఖయాల్ 

కౌశికీ చక్రబర్తి ప్రముఖ హిందుస్థానీ గాయని గా రాణిస్తున్నారు. ఆమె ప్రఖ్యాత గాయకులు పద్మ భూషణ్ పండిట్ అజయ్ చక్రబర్తి గారి కుమార్తె. తండ్రికి తగ్గ తనయ.

There is a meditative quality about Hindustani music. వారికి శ్రుతి చాలా ప్రధానం. ఖయాల్ ఆలాపనలో సాహిత్యం తక్కువగా వుండి రాగం విస్తరణకు ఎక్కువగా ప్రాముఖ్యం ఉంటుంది. రెండు భాగాలు గా ఉండి ముందు విలంబితం (నెమ్మది) గా సాగి తదుపరి ద్రుత ( వేగం) గా ముగుస్తుంది. ఖయాల్ బాగా ప్రాచుర్యం పొందినది. ధ్రుపద్ సంగీతం మరింత విస్తారంగా నాలుగు భాగాలు గా సాగుతుంది. ప్రస్తుతం ధ్రుపద్ కంటే ఖయాల్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు.


గొప్ప సంగీత కారులు సృష్టించే నాదం లో లీనమైనప్పుడు మనస్సులో ఆలోచనలు పూర్తిగా శమించి ఆత్మ లో లయమౌతుంది. అది ఒక చక్కని ధ్యానం అవుతుంది.

The ultimate effect of any art form may be the dissolution of mind in the inner consciousness. 

అయితే ఈ మనసు లయం కావడం ఎప్పుడో కానీ జరగదు. It depends on both the performer and the listener. Many times the desultory  mind swims in shallow waters.  The experience stops at the level of superficial pleasure. Sometimes it goes deeper.

On rare occasions a flash of real bliss happens. శాస్త్రీయ సంగీతం అర్థం చేసుకోవడం, తరచుగా వినడం వలన ఉద్వేగం తగ్గి మనసు సాంత్వన పడుతుంది. The mind delves deeper. The lyrics, the singer, the ambience, the listener everything disappear in the ocean of nadam.



 





Saturday, January 15, 2022

ఆధ్యాత్మిక అద్వైత మ్యూజింగ్స్

జలం వినా అలకు విడిగా అస్తిత్వం ఉందా? 

మట్టి లేకుండా కుండ ఉండగలదా?

బంగారం లేని కంటె ఎక్కడ ఉంది ?

ఆత్మ లేని దేహం ఉన్నట్టా లేనట్టా ?

ఆత్మ జ్యోతి వెలుగు లేనప్పుడు అసలు జగం ఉందా? 

పై ఉదాహరణలు కేవలం ప్రతీకాత్మకంగా చెప్పబడుతున్నాయి. అంతేకాని చైతన్య బ్రహ్మము వివరించ బడేది కాదు అని చెప్పారు.

ఏ వెలుగు లేకపోతే  జగం మాయమై పోతుందో,  ఏ ఇతర వస్తువులకు అస్తిత్వం లేకుండా పోతుందో ఆ వెలుగు లేక చైతన్యం మాత్రమే సత్యం అవుతుంది. 

తక్కిన నామ రూపాత్మక జగత్తు నామరూపాలు లేకుండా పోతుంది.  ఆ విధంగా స్వయం ప్రతిపత్తి లేని పాంచ భౌతిక మైన జగత్తు మిథ్య గా చెప్పబడుతున్నది. ఉండీ లేనిదే అవుతున్నది. భౌతికంగా కనిపించదని కాదు. చైతన్య శక్తి లేకుండా జగత్తుకు స్వయంగా ఉనికి లేదు అని అద్వైత ఆచార్యులు చెబుతున్నారు.

-------------------------

Interviewer: “Do you think that consciousness can be explained in terms of matter and its laws?”

Max Planck: “No. I regard consciousness as fundamental. I regard matter as derivative from consciousness. We cannot get behind consciousness."

The Observer, 25 January 1931

--------------------------

భౌతిక శాస్త్రజ్ఞులు పాంచ భౌతిక  పదార్థాల స్వరూపం పైన తీవ్రంగా పరిశోధనలు చేసి పరమాణువు లోపలి రహస్యాలని తెలుసుకుంటున్నారు. 

చరాచర జగత్తు లోని ప్రతి పదార్థం పరమాణు స్థాయి లో చైతన్య శక్తి గా ఉన్నది అని వారి పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

Quantum physics describes the subatomic world as one that cannot be depicted in diagrams -- particles are not dots in space, but are more like "dancing points of energy."

అందువల్ల ప్రతి పదార్థం లోని నిజ స్వరూపం చైతన్య శక్తి మాత్రమే అవుతున్నది. ఆ చైతన్య శక్తి చరాచర జగత్తులో నామ రూపాత్మకం గా భాసిస్తున్నది. ఉన్నది ఒకటే సత్య వస్తువు. అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మము లేక చైతన్య శక్తి మాత్రమే అని చెప్పబడుతుంది.

భౌతిక శాస్త్రవేత్తలు బాహ్య జగత్తును శోధించి కనుగొన్న విషయం ఋషులు అంతర్ముఖ పరిశోధన చేసి ఉపనిషత్తుల రూపం లో అందించారు అని గురువులు చెబుతున్నారు.

బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్న వాక్యం సామాన్యమైనది కాదు. Advaita is the science behind sciences. 

అద్వైతం జగత్తును నిరాకరించదు. జీవుడు, జగత్తు, దేవుడు, బంధము, మోక్షము ఈ ఐదింటికి సహేతుకమైన, ఆచరణాత్మక మైన సమాధానం చెబుతుంది.🙏












Tuesday, December 21, 2021

మరుమల్లెల చిరునవ్వుల సిరివెన్నెల



సీతారామ శాస్త్రి గారు తాను వెళ్లిపోయిన తరువాత తెలుగు ప్రజలు తనపై  కురిపించిన అభిమానం గౌరవం చూసి ఆనందంగా సాగిపోయి ఉంటాడు అని అనిపిస్తుంది.

సినిమా పాటలకు  పరిమితులు ఉన్నా  ఆయన  మంచి పాటలు వ్రాశాడు.  అశ్లీల అసభ్య గీతాలు దాదాపుగా వ్రాయలేదు. పదుల సంఖ్యలో ఆలోచింపచేసే పాటలు, మరికొన్ని రసానందం కలిగించే పాటలు వ్రాశాడు అని చాలామంది అభిప్రాయం. 

శ్రీ శ్రీ పాటల లోని శబ్ద సౌందర్యం, సినారె పాటలోని ప్రశ్న సమాధానం పద్ధతి, వేటూరి పాటల్లోని అర్థ వైచిత్రి సిరివెన్నెల పాటలలో కనిపిస్తాయి అని నా అభిప్రాయం. 

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి భావ సౌందర్యం, సౌకుమార్యం  ఎప్పుడైనా కనిపిస్తుంది.

సిరివెన్నెల తరువాత ఎవరు? 

రామ జోగయ్య శాస్త్రి, చంద్రబోస్ వీరిద్దరూ మంచి పాటలు వ్రాస్తున్నారు. మన తెలుగు సినిమా పాట కు మరి కొన్నేళ్లు తిరుగు లేదు.

చంద్ర బోస్ రంగ స్థలం, పుష్ప సినిమాలలో వ్రాసిన పాటల్లో కొత్త భావాలు, పద చిత్రాలు ఉన్నాయి. 

'తెల్లారింది లెగండో ' పాట లో కవితాత్మకత

పాములాటి రాతిరి పడగ దించి పోయింది

ఎక్కిరించు రేయిని చూసి  ఎర్రబడ్డ ఆకాశం

ఎక్కుపెట్టి యిసిరిందా సూరీడి చూపులబాణం

కాలం గట్టిన గంతలు తీసి కాంతుల వెల్లువ గంతులు వేసి


శాస్త్రి గారు wrote many such memorable lines.

ఆయన వ్రాసిన పాటల్లో నాకు అమితంగా నచ్చిన పాట ఇది.

--------------------------------

నా చెలియ పాదాలు హంసలకు పాఠాలు

తాను పలికితె చాలు తేనె జలపాతాలు


ఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుంది

ముత్యాల జల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది


ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది

చెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది


పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా

తన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా


గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెల

కొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలో


గుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులా

మబ్బుల్లో వెండి మెరుపులా ఆమెకెన్ని హొయలో


అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం


గాలుల్లో ఆమె పరిమళం ఊపిరిలో నిండి ప్రతి క్షణం

ఎటు ఉన్నా నన్ను వదలదే ఎలా తప్పుకోను


గుర్తొస్తే ఆమె పరిచయం కవ్వించే పడుచు పసిదనం

రెప్పల్లో కైపు కలవరం ఎలా దాచుకోను


కలో కాదో నాకే నిజం తేలక

ఎలా చెప్పడం తాను నాకెవ్వరో

అదిరి పడకయ్యా ఇది ఆమె మాయ

ఇది కవిత కాదబ్బా మన్మధుడి దెబ్బ

------------------------------

ముఖ్యంగా ఈ పాదం మరీ బాగుంది.

అలా నడిచి వస్తూంటే పూవుల వనం

శిలైపోని మనిషుంటే మనిషే అనం 


గో రే గో గో రే అన్న పాట లో హీరోయిన్ మానసిక స్థితి ని పట్టిచ్చేలా ఉంటూనే, పదాలతో magic చేశాడు సిరివెన్నెల.

-------------------------------

తెగ ఉరుముతు కలకాలం

తెరమరుగున తన భారం

మోసుకుంటూ తిరగదు మేఘం

నీలా దాచుకొదుగా అనురాగం 

వెంటపడుతుంటే వెర్రి కోపం

నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం

మండిపడుతుందే హృదయం

మరిచే మంత్రమైనా చెప్పవే సమయం 

నీతో నీకే నిత్యం యుద్దం

ఎందుకు చెప్పవె సత్యభామ

ఏం సాధిస్తుందే నీ పంతం

ఒప్పుకుంటే తప్పులేదే ఉన్న ప్రేమ

-----------------------------

సిరివెన్నెల విశ్వనాథ్ గారి సినిమాలకు అందించిన సాహిత్యం అత్యుత్తమం. అజరామరం. ఆయనకు కనీసం ఐదు జాతీయ అవార్డు లు ఇవ్వాలి. అయితే పద్మశ్రీ అవార్డును ఇచ్చారు.  సంతోషమే.

శ్యాం సింగ రాయ్  చిత్రం లో చివరి పాటలో

నెలరాజు కి ఇల రాణికి  అన్న మాటలు - genius

Maybe he is the last literary legend of Telugu cinema. Thank you సిరివెన్నెల సీతారామశాస్త్రి Sir. 🙏🙏🙏