Sunday, May 15, 2011

వేసవికాలపు వెన్నెల కాదు కదా-- తిలాంగ్ రాగం.

తిలాంగ్ రాగం. రెండు నిషాదాలతో గమ్మత్తుగా ఉంటుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది.

మూడు మంచి పాటలను ఒకసారి replay చేసుకుంటాను.

1) నాకు అమితంగా నచ్చిన ఈ పాట సింగార వేలన్ చిత్రంలోనిది. ఇంత మంచి పాటలను సృష్టించిన ఇళయరాజా కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము అనిపిస్తుంది. గానం బాలు , జానకి గారు. అద్భుతంగా పాడారు.

2) సుశీలమ్మగారు పాడిన ’మనసా కవ్వించకే’నన్నిలా పాట చాలా ఇష్టం నాకు. పండంటి కాపురం చిత్రంలోనిది. soliloquy ని పాటగా మలచిన తీరు బాగుంది. తిలాంగ్ లో ఇంకా బాగా కుదిరింది. కష్టమైన పాట అనిపిస్తుంది. పాటల పోటీలలో పాల్గొనే వారు ఈ పాట పాడాలంటే ముచ్చెమటలు పోయటం ఖాయం.

3) ఏమొకో చిగురుటధరమున -mlv గొంతులో ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అన్నమయ్య పదం -- ముఖ్యంగా శోభారాజు ఇంకా బాలు గారు ఇద్దరు కూడా ఈ పాటకు ప్రాణం పోస్తారు.

నిలువుమా నిలువుమా నీలవేణి పాట కూడా చాలా మధురమైన యుగళగీతం.

Saturday, April 16, 2011

వేణువై తాను భువనానికి వచ్చి గాలిలా గగనంలో కలిసిపోయిన చిన్నారి.



చిత్రగారు. మధుర గాయని. స్వచ్చమైన నవ్వుతో చూడగానే పవిత్రభావం కలిగే ముఖం ఆమెది. ఆమె తెలుగు ఉచ్చారణ ఎంత బాగా ఉంటుంది! పెను విషాదం. వివాహమైన పదిహేనేళ్ళకు పుట్టిన అమ్మాయి తొమ్మిదేళ్ళ చిన్నారి మరణం ఆమె అభిమానుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.

చిన్నారి నందన. అందరికీ అమృతం పంచిన మీ అమ్మ ను ఎలా ఓదార్చ గలమమ్మా?

చిత్రగారు ఎన్నో వందల పాటలు పాడారు. ఆమె కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నవారు. అందుకే ఆమె గొంతులో శ్రుతి, శ్రావ్యత ఉత్తమ స్థాయిలో ఉంటాయి.

రెండు మంచి పాటలు గుర్తు చేసుకుంటాను.

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో-- ఈ పాటకు తప్పకుండా జాతీయ బహుమతి ఇవ్వవలసిన పాట. చిత్రగారు తప్ప ఇంకెవ్వరూ ఈ పాట పాడలేరు.

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. శుభపంతువరాళి లోని విషాదం చిత్రగారిని కమ్ముకుంది. ఆమె దు:ఖం ఎవరూ తీర్చలేనిది.

Thursday, April 7, 2011

సుజాత-కమల హాసన్-ఇళయరాజా-ఒక పడవ పాట

సుజాత. వెళ్ళిపోయింది. సముద్రం లోకి సూరీడు అస్తమించినంత సహజంగా. మనకున్న dignified నటులలో ఆమె ఒకరు.

ఒక మంచిపాట ద్వారా ఒకసారి స్మరించుకుంటాను.

పడవపాటలు చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఆ నెమ్మదితనం, మద్యలో నావికుడో, సరంగో చేసే ex tempore ఆలాపనలు. ఇలాంటిపాటలు సంగీతదర్శకులు పాడితే మరీ బాగుంటాయి.

ఈ పాట ఇళయరాజా స్వరపరచిన ఒక classic. గానం జయచంద్రన్, జానకి గారు. interludes ఎంతో మాధుర్యంతో,ఒకేసారి simple గానూ, intricate గానూ అనిపిస్తాయి. చాలా చక్కగా చిత్రీకరించారు కూడాను.

కమల హాసన్ కంటె పెద్దదానిలాగా సుజాత అనిపిస్తుంది.

ఈ పాట నాకు ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్ళయినా retro effect ఏమీ పడలేదు. చాలా హాయిగా సాగుతుంది.

Wednesday, March 30, 2011

బిలహరీ అని పిలువకుంటే బాగుండదు.

స్వధర్మే నిధనం శ్రేయ: అనుపల్లవిలో కొన్ని సంగీతకబుర్లు చెప్పుకుంటేనే బ్లాగుంటుంది అనిపించింది.

బిలహరి. పెద్దగా నన్ను ఆకట్టుకోదు ఈ రాగం. వినగా వినగా.. sort of grows on ears.

ఆరోహణలో మోహనం +అవరోహణ శంకరాభరణం= బిలహరి.

ఈ రాగంలో ఓ రెండు పాటలను పొగిడి ఒక పాటను తిడితే ఒక టపాయిపోతుంది.

ఒకమంచిపాట-- ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకూ.-దేవులపల్లి వారి రచన. పాట ఎత్తుగడ ఎంతో బాగుంది. ఎంతో హాయిగా సుశీలమ్మ గారు పాడారు.

ఇళయరాజా బిలహరిలో ఇచ్చిన రెండుపాటలు ఇలా ఉన్నాయి

1) రుద్రవీణలో ’నీతోనే ఆగేనా సంగీతం’- నాకు నచ్చని పాటలలో ఇది ఒకటి. తన తండ్రి పరిస్థితిని పాట రూపంలో కచ్చేరీలో పాడటం చాలా కృతకంగా అనిపిస్తుంది. అలాగే పాట బాణీ కూడా కృత్రిమంగా ఉంది. ఈ చిత్రంలోనే ’లలిత ప్రియ కమలం విరిసినది’ అనే పాట కూడా నాకు నచ్చదు. (మరీ రివర్సు లో సమీక్షిస్తున్నానేమో తెలియదు)

2) బాలనాగమ్మ అనే తమిళ చిత్రంలోని ’కూందళిలే మేగం’ అనే పాట బానే ఉంటుంది బిలహరిలో.

సంగీత సామ్రాట్ ( anr, జయప్రద, రమేశ్ నాయుడు, సుశీలగారు.)చిత్రంలోని ఎంతసొగసు గాడే పాట బాగుంది.

బాగా ప్రసిద్ధమైన సంప్రదాయ గీతం ’రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల’

Thursday, March 10, 2011

మౌనమే వేదమనిపించే పాట-thanks vidya

విద్యాసాగర్ కు నేను పూర్తి స్థాయిలో అభిమాని అవటానికి ఈ పాట కారణం. it is sheer magic.

తన career లోనే అత్యుత్తమమైన పాట. ఈ పాట తరువాతే తను తమిళంలో, మళయాళంలో ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. ’మలరే మౌనమా’ ముందు, తరువాత అన్నంతగా అతని జీవితం మారిపోయింది.

ఒక interview లో తనే చెప్పాడు. ’బాలుగారు సాధారణంగా తొమ్మిదింటి తరువాత పాడరు”. విద్యా ’ఈ పాట జానకిగారు track పాడారు. just వినండి’ అని అన్నారట. బాలుగారు was bowled over. రాత్రి పన్నెండింటి దాకా improvise చేసి పాడి ధ్వనిముద్రణ అయ్యాకే వెళ్ళారట.

బాలు, జానకి గారు పాటకు జీవం పోశారు అనటం stating the obvious అవుతుంది.

కర్ణ సినిమా (1995)లోని ’మలరే మౌనమా’పాట. రాగం దర్బారి కానడా.

అర్జున్, రంజిత. yeah. she was famous for all the wrong reasons recently. nevertheless, both looked very gorgeous in this song.

thanks విద్యా.

Tuesday, February 22, 2011

మలేషియా వాసుదేవన్ - కొన్ని మట్టి వాసనల గురుతులు.

మహా గాయకుడు కాదు. కానీ మంచి పాటగాడు. open voice తో,బలమైన గొంతుతో పాడేవాడు. ముఖ్యంగా మలేశియా + ఇళయరాజా + భారతి రాజా+ వైరముత్తు.. వీరి కలయికలో పల్లెటూరి పాట అంటే అది మట్టివాసన లాగా చుట్టుకుంటుంది. సహజంగా pretence లేకుండా పాడుతాడు.

వెళ్ళిపోయాడు. అయితేనేమి. పదుల సంఖ్యలో మంచిపాటలు పాడి వెళ్ళాడు.

నాకు అమితంగా నచ్చిన రెండు పాటలు గుర్తుచేసుకుంటాను.

తూరల్ నిన్ను పోచ్చి సినిమాలోని ’తంగ చంగిలి’ పాట ఒక గొప్ప యుగళగీతం.

out of this world orchestrization.

ఇళయరాజాకు కీరవాణి రాగం అంటే మహా ప్రీతి. మలేశియా, జానకి గారు పాటకు జీవం పోశారు.

కోళి కూవుదు చిత్రంలోని ’పూవే ఇళయపూవే’.  ఎంత గొప్ప పాట. ilayaraja  created such a masterpiece. మలేశియా చాలా చక్కగా పాడాడు.

ముదల్ మరియాదై చిత్రంలో పాటలు అజరామరాలు.

పత్రికలలో మలేశియా మరణవార్త చూశాక ఒక్కసారి ఆ ’పాత’ మధురాలు గుర్తుకొచ్చాయి.

thanks malaysia vasudevan గారు .

Friday, February 11, 2011

మల్లెతీగ ఒక్కనాటికీ వాడిపోదు మాండు రాగంలో

రాజన్-నాగేంద్ర-ఈ సంగీత దర్శక ద్వయం ఎన్నో జనరంజకమైన గీతాలు స్వరపరిచారు.

ఒకే చిత్రంలో దాదాపు అన్ని పాటలు hit songs' చేయటం వీరి ప్రత్యేకత.

పూజ cinema లో అన్నీ మంచి పాటలే ఉన్నాయి. అందులో
మాండు రాగం లో ఉన్న ’మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ ఒక చక్కటి పాట.

రహమాన్ అప్పుడప్పుడూ మాండ్ రాగం లోకి relapse అవుతుంటాడు. ఇరువర్ సినిమాలోని శశివదనే పాటలో interludes లోను చరణంలోనూ చాలా అందంగా మాండురాగచ్చాయలు అగపడతాయి. duet cinema లోని ’అంజలీ అంజలీ’ పాట లోని చరణాలు మరొక ఉదాహరణ.

చక్రవర్తి గొప్పగా సంగీతం ఇచ్చింది 70 లలోనే . అందులోని ఒక ఆణిముత్యం ’కుశలమా నీకు కుశలమేనా’-బలిపీఠం లోనిది.

ఎంత గొప్ప యుగళగీతమో మాటల్లో చెప్పలేను. ఆత్మ సౌందర్యం ఉన్న పాటలు అవి.

మాండు రాగ చాయలలో ఉన్నట్టు నాకు అనిపించింది.

శ్రీ మధ్వాచార్య అనే కన్నడ సినిమా తెలుగు అనువాదంలో బాలమురళి పాడిన ’నాదు హృదయ వీణ మీటి’ అనే గీతం link నాకు దొరకలేదు.