Friday, November 25, 2011

ఇళయరాజాకు కీరవాణి అంటేనే ఎందుకో అంత ఇష్టం..కొన్ని సంగీత కబుర్లు.

శ్రీరామ రాజ్యం చిత్రంలోని ఈ పాట further proof of that.

పంచభూతాలు అచ్చ తెలుగులో నింగి,నేల,నీరు,నిప్పు, గాలి (ఈ ఒక్క పదం నకారంతో దొరికితే బాగుంటుంది). గాలి నింగి నీరు, నేల నిప్పు మీరు. పాట బాగుంది. ఎన్ని పాటలు కీరవాణిలో స్వరపరిచాడో ఇళయరాజా.

జగదానందకారక పాట చాలా బాగుంది.(శుద్ధ ధన్యాసి). పాట సాహిత్యం,బాణీ, సంగీతం, చిత్రీకరణ ఉత్కృష్టంగా ఉన్నాయి. బాలు చక్కగా పాడితే. శ్రేయ గోశాల్ క్రూనింది.

అలాగే వసంత రాగంలోని శ్రీరామ లేరా పాటను కూడా ఇద్దరూ (రాము, శ్రేయ) స్పష్టతలేకుండా గొణిగేశారు.

ఈ చిత్రంలో నాకు ముఖ్యంగా జొన్నవిత్తుల సాహిత్యం బాగా నచ్చింది. ఆత్రేయలా, సినారెలా వ్రాశాడు ఆయన. వేటూరిలా వింత పోకడలు పోకుండా, సిరివెన్నెలలా నారికేళపాకాలు కాకుండా బాగున్నాయి. (వేటూరి, సిరివెన్నెల కు నేను కూడా అభిమానినే కానీ.. వేటూరి చక్రవర్తి కలిపి వండి వార్చిన కుంభీపాకాలు చప్పున గుర్తుకు వస్తాయి.)


కానీ కీరవాణికి కీరవాణి అంటే పెద్దగా నచ్చదేమో. నే విన్నంతలో వెతికితే ఈ ఒక్క పాటే దొరికింది. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని.(అనుకోకుండా ఒక రోజు). పాట ఎత్తుగడ, సాహిత్యం బాగుంది (సిరివెన్నెల) స్మిత చక్కగా పాడింది. song would have been better if it were a tad slow paced.తన voice culture బాగుంటుంది. కానీ ఎందుకో తను సినిమాలలో పాడదు.

Wednesday, November 2, 2011

తెలుగు లో 10 అత్యుత్తమ సంగీతభరిత చిత్రాల జాబితా--నా దృష్టిలో

తెలుగు లో 10 అత్యుత్తమ సంగీతభరిత చిత్రాల జాబితా కూర్చాలి అనిపించింది. (పదే ఎందుకు అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు).
ఈ జాబితా తయారు చేయటంలో నేను పరిగణన లోకి తీసుకున్న అంశాలు 1) ఎక్కువ శాతం పాటలు మాధుర్యంతో నిండి ఉండాలి 2) సాహిత్యం అర్థవంతంగా కుదరాలి 3) గాయనీ గాయకుల అద్భుత గానం 4) ఎంతకాలం గడచినా ఇంకా వినాలి అనిపించాలి.

కొన్నేళ్ళ క్రితమైతే ఈ జాబితా వేరుగా ఉండేది. ఇప్పుడు బేరీజు వేయటం లో కొంత పరిపక్వత వచ్చిందని (really?) అనుకుంటున్నాను.

1) లవకుశ : ఘంటసాల సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అగ్ర తాంబూలం. ఎవ్వరూ ఎన్నటికీ అధిగమించలేని divine music. లీల,పి సుశీల, ఘంటసాల గార్ల సంగీత యాత్రకు పరమపదం గా చెప్పవచ్చు. ఈ సంగీతం న భూతో న భవిష్యతి

2) మల్లీశ్వరి : ఈ చిత్రంలోని పాటలు ఇప్పుడు కొద్దిగా jaded గా అనిపించవచ్చు. కానీ puritan ల దృష్టిలో ఇవి అజరామరమైన పాటలు. దేవులపల్లి, రాజేశ్వరరావు,ఘంటసాల, భానుమతి గారు. "ఊరు చేరాలి", మనసున మల్లెల మాలలూగెనే, ఆకాశవీధిలో.. పాటలు ఎన్నటికీ మరువలేము. దేవులపల్లి సంస్కృతంలో పండితులై ఉండి అచ్చతెనుగులో వ్రాయటం గొప్పవిషయం.

3) మాయాబజార్: అన్నిపాటలు ఆణి ముత్యాలే. రాజేశ్వరరావు, ఘంటసాల స్వరరచన. నాకు ప్రత్యేకించి ’చూపులు కలసిన శుభవేళ’ పాట చాలా ఇష్టం. అలాగే లాహిరిలాహిరి, వివాహ భోజనంబు అన్నీ super duper hits.

4) గుండమ్మకథ: చిత్రంలోని అన్ని పాటలు haunting మెలొడీలే. ఎప్పటికీ నిలిచిఉండే జనరంజకమైన బాణీలను కట్టడంలో ఘంటసాల గారికి అగ్రాసనం. my favourite : కనులు తెరచినా నీవాయె.

5)అక్బర్ సలీం అనార్కలి: ఈ చిత్రం ఒక గొప్ప musical అని నా అభిప్రాయం. సినారె సాహిత్యం, సుశీల, రఫి గానం, సి రామచన్ద్ర సంగీతం అన్నీ అద్భుతంగా కుదిరాయి. తానే మేలి ముసుగుతీసి ఒక జవ్వని, తారలెంతగా మెరిసేనో, రేయి ఆగిపోని, సిపాయీ సిపాయీ.. ఎంత గొప్ప పాటలవి.

6) అన్నమయ్య : నేదునూరి గారు, మల్లిక్, రాళ్ళపల్లి గారు, బాలకృష్ణప్రసాద్ వంటి పండితులు కట్టిన బాణీలనే అన్నమయ్య చిత్రంలో దాదాపుగా వాడినా అవి ఎన్నటికీ వాడిపోని పూలలాంటివి గనుక శాశ్వతంగా నిలిచిపోయాయి. pick of the album : అంతర్యామి పాట.

7) మేఘసందేశం: దాసరి నారాయణరావు తీసిన అత్యుత్తమ చిత్రం ఇదే. నాగేశ్వరరావు గారు, జయప్రద, జయసుధ, జగ్గయ్య.. అందరూ దిగ్గజాలే. రమేశ్ నాయుడు సంగీతం. తెలుగుదనం ఉట్టిపడే లలిత సంగీతం. మాధురీ లహరి. ఆకులో ఆకునై,పాడనా వాణి కళ్యాణిగా, సిగలో అవి విరులో, ముందు తెలిసెనా ప్రభూ, నిన్నటిదాకా శిలనైనా, ప్రియే చారుశీలే, శీత వేళ రానీయకు అన్ని మంచిపాటలు ఒకే చిత్రంలోనే. జేసుదాస్, సుశీల గారు. simply the best.

8) శ్రీ షిర్ది సాయిబాబా మహత్యం : విజయచందర్ సాయిబాబా పాత్రలో జీవించిన ఈ చిత్రంలో అన్ని పాటలూ హిట్సే. ఇళయరాజా సంగీతం, ఆత్రేయ సాహిత్యం పడుగు పేక లాగా కలిసిపోయి చక్కటి పాటలు వెలిశాయి. మా పాపాల తొలగించు, నువ్వు లేక అనాథలం,సాయి శరణమ్, బాబా సాయిబాబా,దైవం మానవ రూపంలో అన్నీ మేలిమి వజ్రాలే. ప్రత్యేకించి : బాలు పాడిన బాబా సాయిబాబా పాట.

9) శ్రీ సాయి మహిమ: అంతగా వెలుగులోకి రాని ఈ చిత్రం లోని పాటలకు నేను పెద్ద పీటే వేస్తాను. అత్య్తుత్తమ సంగీతం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. సంగీతం అనూరాధ పౌడ్వాల్ కుమారుడైన ఆదిత్య పౌడ్ వాల్. అంత చిన్న కుర్రవాడు ఈ స్థాయి సంగీతం అందించాడంటే నేను ఇప్పటికీ నమ్మలేను. సినారె సాహిత్యం అత్యుత్తమంగా ఉంది. బాలు, జానకి, అనురాధ గార్లు అన్నిపాటలకు ప్రాణం పోశారు.
నిజం చెప్పాలంటే ఈ గీతమాలికలోని అన్నిపాటలు నాకు చాలా ఇష్టం. సాయిదివ్యరూపం, నిన్ను గని శరణమని, సాయి దేవా, ఎంతెంత దయనీది ఓ సాయి. divine music.

10) శంకరాభరణం: విశ్వనాధ్ గారి చిత్రం లేకుండా ఈ జాబితా పూర్తి చేయటం పెద్ద తప్పు అవుతుంది. అన్నీ గొప్ప బాణీలు అని చెప్పలేను కానీ పవిత్రత, నిబద్ధత కలిగిన సంగీతం. ముఖ్యంగా సామజవరగమన పాటమధ్యలో చరణాలు కల్పించటం చాలా చక్కగా కుదిరింది. దొరకునా ఇటువంటి సేవ పాట అత్యుత్తమం. కానీ రెండు అసంతృప్తులు ఉన్నాయి. సుశీలగారికి ఈ చిత్రంలో పాట లేక పోవటం. అలాగే ఓంకారనాదానుసంధానమౌ, రాగం తానం పల్లవి ఈ రెండు పాటల బదులు సంప్రదాయ గీతాలు పెట్టి ఉంటే బాగుండేది అనిపించింది.

almost there : భక్త ప్రహ్లాద, మహాకవి కాళిదాసు.

అమ్మయ్య. ఎప్పటినుంచో వ్రాయాలి అనుకున్న ఈ టపా ఇప్పటికి నెరవేరింది. ఈ జాబితా నా personal choice మాత్రమే. సంగీత ప్రేమికుల జాబితాలో తప్పక ఇతర చిత్రాలు ఉండటం perfectly possible and okay.

Saturday, September 24, 2011

కారుచీకటిలో కాంతి రేఖవై మూగగుండెలో దివ్యవాణివై

70 వ దశకం చివర్లో ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రతి ఆదివారం ఏసు ప్రభువు పాటలు పెట్టేవారు ఉదయం ఎనిమిదింటికి అనుకుంటా. అవి ఈ నాటికి నా మదిలో పదిలంగా ఉన్నాయి. అద్భుతమైన బాణీలు. అంతకు మించిన గానం సుశీల బాలు గార్లది. ఈ పాటలకు స్వరకర్త ఎవ్వరో నాకు ఇప్పటికీ తెలియలేదు. బహుశ: పాలగుమ్మి విశ్వనాథంగారేమో అని నా ఊహ. జాలం పుణ్యమా అని ’హృదయమే నీ ఆలయం క్రీస్తు’ ఆదిగా గల అన్నిపాటలు మళ్ళీ వినగలుగుతున్నాను.

ఈ క్రీస్తుపాటల సంకలనం లో నాకు అమితంగా నచ్చిన కొన్ని పాటలు.

హృదయమే నీ ఆలయం క్రీస్తూ.

ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో

శాశ్వతమా ఈ దేహం

ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం

నేనే మార్గము సత్యము జీవముని

ఈ లంకెలో పాటలు వినవచ్చు

ముఖ్యంగా ’మధుర మధుర సేవ ’ అనే పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. దేశ్ రాగంలోని వినసొంపుదనం. బాలుగారి అద్భుతగానం ఈ పాటకు ప్రాణం పోశాయి. ఒకే గీత సంకలనంలో ఇన్ని ఆణిముత్యాలు పొదిగిన స్వరకర్తకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది.
సుశీలగారు, బాలుగారు ఈ పాటలను గొప్పగాపాడారో చెప్పటానికి మాటలు చాలవు. ఈ తరం శ్రోతలు తప్పక విని శాశ్వతంగా భద్రపరచుకోవాల్సిన పాటలు ఇవి. సాహిత్యం కొంచెం typically క్రైస్తవంగా అనిపిస్తుంది కానీ బాణీల లోని మాధుర్యం మాటలను అధిగమిస్తుంది.

తెలుగుదనం, భారతీయత ఉట్టిపడే ఈ పాటలు తప్పక ఒకసారి స్మరించుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కరుణామయుడైన యేసు ప్రభువు ప్రశాంత వదనం కళ్ళకు కట్టించే పాటలు ఇవి.

నేను క్రైస్తవుడిని కాను కాని ఈ పాటలు మాత్రం నేను అమితంగా అభిమానిస్తాను. స్వస్తి.

Thursday, August 25, 2011

మోహనరాగమహా -మూర్తిమంతమాయే

మోహనరాగం. ఈ రాగం లోని పాటలు వింటే మనసు ఎంతో ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా మారిపోతుంది. హాయిగా అనిపిస్తుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది. గోవిందుడు అందరివాడేలే అన్నట్టుగా మోహనరాగం అందరికీ ఇష్టమైనదే. ఒకసారి కొత్తపాళీ గారి బ్లాగులో మోహనరాగాన్ని వంకాయకూరతో పోలికతెచ్చి ఎంతో బాగా వ్రాశారు.

సినీ గీతాలవరకూ చూస్తే మోహనం హిందోళం మమ్మీ డాడీ రాగాలు.

ఎన్నో వందలపాటలు స్వరపరచబడ్డాయి మోహనంలో.



అందరికీ తెలిసిన పాటలు కాకుండా రెండు కన్నడ పాటలు పరిచయం చేయాలనిపించింది నాకు. రెంటికీ స్వరకర్తలు రాజన్ నాగేంద్ర. వీరు జనరంజకంగా పాటలు కట్టడంలో సిద్ధహస్తులు.

’నన్న ఆశె హణ్ణాగి’అనే ఈ పాట ఒక చక్కని యుగళగీతం. బాలు గారి గొంతు ఎంతబాగుంటుందో మాటల్లో చెప్పలేను. ఈ పాట తరువాత తెలుగులో, తమిళంలో కూడా వచ్చింది. (విశేషమేమంటే బాలు కన్నడంలో జానకిగారితో, తెలుగులో సుశీలగారితో,అరవంలో వాణీ జయరాం గారితో ఈ పాట పాడారు. ఈ పాటలో నటించిన శంకర్ నాగ్ (అనంతనాగ్ తమ్ముడు) తరువాతి కాలంలో కారు ప్రమాదంలో చనిపోయాడు.). మూడు భాషలలోనూ, కన్నడపాటే ఉత్తమంగా ఉంది. బాలు గొంతుకోసమే ఈ పాట నేను చాలాసార్లు విన్నాను.

యుగళగీతం చివర్లో గాయనీ గాయకులు ఇద్దరినీ తప్పకుండా కలిపి పాడించటం రాజన్ నాగేంద్ర ప్రత్యేకత.

’జేనిన హొళెయో హాలిన మళెయో’ఈ పాట కన్నడ కంఠీరవ డా. రాజకుమార్ పాడినది. కన్నడ దేశపు ఔన్నత్యాన్ని తెలిపే ఈ పాటకూడా చాలా బాగుంటుంది.
రానా స్వరపరచిన పంతులమ్మ గీతాలు ఎంత బాగుంటాయో అందరికీ తెలుసును. ’సిరిమల్లె నీవె’ పాట చరణాల్లో కొన్ని అన్య స్వరాలు వచ్చినా మోహనరాగం ఆధారితమే.

పాటలు విన్నతరువాత మోహనమీ ప్రకృతి. మోహనమీ జగతి. అనిపిస్తుంది.

Friday, August 12, 2011

కళ్ళెత్తితే చాలు- కనకాభిషేకాలు

ఈ బంగారు నగల షాపువాళ్ళ ad లు ఎవరు తీస్తున్నారోగానీ చాలా సృజనాత్మకంగా lively గా ఉంటున్నాయి.

ఉద్యమం వార్తలు , పచ్చ మీడియా systematic గా చేసే character assassination కథనాలు, ఓదార్పు, వై యస్ బొమ్మల వార్తలు, ఇతర దరిద్రగొట్టు కార్యక్రమాల నుంచి చాలా relief గా అనిపించాయి (yeah. I took care to be politically correct) .

నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ ad బాగుంది.


నేపథ్యంలో వచ్చే వేణువు చాలా నచ్చింది నాకు. లఘుచిత్రంలోనే ఒక చిన్నకథను చెప్పినట్టుగా చాలా బాగా తీశారు.


జూ ఎన్టీఆర్ మలబార్ గోల్డు
కూడా బానే ఉంది. తను మంచి సహజనటుడు. కానీ తను నటించే సినిమాలన్నింటిలోనూ నేలవిడిచి సాము చేసే పాత్రలే. ఆ సినిమాల్లో లేని సహజత్వం ఈ adలలో నాకు కనిపించింది. కొంచెం swagger తగ్గించుకుంటే ఇంకా బాగుండేది.




ఈ తనిష్క్ వారి glamgold ad భలేగా ఉంది. ముఖ్యంగా leading lady ఎంతో graceful గా ఉంది

కొంచెం గాయని సునీత పోలికలు ఉన్నాయి ఆమెలో.

నాకు ఈ ప్రచారచిత్రాలు నచ్చాయి. అంతే కానీ బంగారం కూడబెట్టే ఉద్దేశ్యమేవీ లేదు.

p.s. టపా శీర్షిక కొంచెం class ఎక్కువైనట్టుగా ఉంది.

Tuesday, July 26, 2011

ముగ్గురన్నలూ. please retire అవ్వండి.

మనవాళ్ళు చెత్తగా చిత్తుగా ఓడిపోయారు lords test లో. దీనికి ప్రధానకారణం defeatist attitude మాత్రమే.
ఇంగ్లాండ్ చక్కగా ఆడటం, మనలో positive mindset లేకపోవటం, సహజమైన ఆట ఆడకపోవటం, అతిగా ఆడటం ఇతర కారణాలు.


సచిన్: god of indian cricket. ఇప్పుడు కేవలం ఉత్సవవిగ్రహం మాత్రమే. దయచేసి 100 వ సెంచరీ పూర్తిచేసి తప్పుకో భయ్యా. ఎంతో ability ఉంచుకొని కూడా అంత దరిద్రంగా జిడ్డు ఆట ఆడటమెందుకు. ఒకప్పుడు వెన్నపూసలో వేలు పెట్టినట్టుగా ఉండిన నీ ఆట ఈ రోజు వెన్నుపూసపైన కాలు పెట్టినట్టుగా ఉంటోంది (పుత్తడిబొమ్మ- జంధ్యాల). అయితే ఒక్క విషయం. సచిన్ all time great క్రీడాకారుడు అనేది నిండు నిజం. he is well past the sell by date అనేది ఇంకా నిజం.


ద్రావిడ్: బాబోయ్ ఏం జిడ్డు batting అండీ బాబూ. తను ప్రేక్షకులకోసం ఆడుతున్నాడో తన కోసం ఆడుతున్నాడో అర్థంకాదు. lords లో కొట్టిన century ఏమాత్రం ఆకర్షణీయంగా లేదు. boring game. match draw చేయటం కోసమే ఆడటం ఇతని ప్రత్యేకత.





లక్ష్మణ్: మంచి stroke player అయ్యి ఉండి కూడా పై ఇరువురి ప్రభావం వల్ల అదరగొట్టే లక్ష్మణ్ పూర్తిగా dull లక్ష్మణ్ గా మారిపోయాడు.

positive frame of mind ఉన్న ఆటగాడు ధోనీ ఆటతీరు కూడా దరిద్రంగా మారిపోయింది. stroke players బలవంతంగా defence ఆడితే ఏమీ ఉపయోగం ఉండదు.

మొన్నటికి మొన్న వీళ్ళూ west indies లో మూడో test ను కుళ్ళబొడిచిన తీరు చాలా దారుణం. గెలుపుకోసం కనీస ప్రయత్నం చేయకుండా draw చేసుకోని పై పెచ్చు సంబరాలు చేసుకోవటం ...my god . perplexing.

మీరు ముగ్గురు దయతో తప్పుకుంటే కుర్రవాళ్ళకు అవకాశాలు వస్తాయి. our fellows dont retire gracefully. it is in their genes.

ఓటమికి భయపడేవాడు గెలవటం కష్టం.

అసలు ఎందుకు ఆడుతున్నారు. ప్రేక్షకులను రంజింప జేయటానికా లేక records పెంచుకోటానికా.. ఈ దరిద్రపు ఆట చూసి బాధతో ఈ టపా వ్రాశాను. చాలామట్టుకు క్రికెట్ మీద ఆసక్తి పోయింది. అప్పుడప్పుడు మనవాళ్ళు అదరగొడుతుంటారు. అప్పుడు మళ్ళీ మామూలే.

Thursday, July 14, 2011

స్టైలే స్టైలే ఇది రజనీ స్టైలే

రజనీకాంత్ వచ్చేశాడు. ఆరోగ్యవంతుడై. ఎంతోమందిలాగే నేనూ all happys.

తనలో ఒక magic ఉంది. ముఖ్యంగా తన సినిమాలలో ఇతర పాత్రధారులను గౌరవించే విధానం నాకు బాగా నచ్చుతుంది.

robot సినిమాలో తను usual mannerism లను పక్కనబెట్టి చాలా బాగా act చేశాడు అనిపించింది నాకు. రోబోట్ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు కానీ రజని deserves award for his acting as robot.

తను మరీ super mega star అవ్వకముందరి రెండు పాటలు ఒకసారి వింటే బాగుంటుంది అనిపించింది.

మొదటి పాటsp baalu పాడిన ఒక classic అని చెప్పవచ్చు. పాట చిత్రీకరణ కూడా చాలా హృద్యంగా ఉంది. రజని, సుహాసిని, ప్రభు-- చాలా బాగా వచ్చింది పాట picturization. ఇళయరాజా prime లో ఉన్నప్పటి పాట. బాలు హుందాగా, స్పష్టంగా majestic గా పాడాడు. రజని, సుహాసిని చాలా అందంగా కనిపిస్తారు simple yet elegant. చూసి, విని తీరాల్సిన పాట ఇది. పాట చివరిలో సుశీలగారు, మలేశియా వాసుదేవన్ రెండు లైన్ల కోసం తమ గొంతులను కలపటం పాటను elevate చేసింది.

రెండో పాట. కె.జె. జేసుదాస్ గొంతులో. 80 లలో chartbuster గా నిలిచిన ఈ పాట. dasettan తన clean vocals తో పాటకు జీవం పోశారు. wonderful rendition. very neat composition.

ఇవి evergreen పాటలు. ఏపాటైనా కొన్ని దశాబ్దాలతరువాత విన్నా ఆకట్టుకుందంటే, ఆ పాట contemporary గా అనిపించిందంటే అది గొప్పపాట. ఇది purely నా వ్యక్తిగత అభిప్రాయం.

పై రెండు పాటలకు ఆ లక్షణాలు ఉన్నాయి. Hi Rajani. welcome back.

Sunday, May 15, 2011

వేసవికాలపు వెన్నెల కాదు కదా-- తిలాంగ్ రాగం.

తిలాంగ్ రాగం. రెండు నిషాదాలతో గమ్మత్తుగా ఉంటుంది. ఇట్టే ఆకట్టుకుంటుంది.

మూడు మంచి పాటలను ఒకసారి replay చేసుకుంటాను.

1) నాకు అమితంగా నచ్చిన ఈ పాట సింగార వేలన్ చిత్రంలోనిది. ఇంత మంచి పాటలను సృష్టించిన ఇళయరాజా కు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలము అనిపిస్తుంది. గానం బాలు , జానకి గారు. అద్భుతంగా పాడారు.

2) సుశీలమ్మగారు పాడిన ’మనసా కవ్వించకే’నన్నిలా పాట చాలా ఇష్టం నాకు. పండంటి కాపురం చిత్రంలోనిది. soliloquy ని పాటగా మలచిన తీరు బాగుంది. తిలాంగ్ లో ఇంకా బాగా కుదిరింది. కష్టమైన పాట అనిపిస్తుంది. పాటల పోటీలలో పాల్గొనే వారు ఈ పాట పాడాలంటే ముచ్చెమటలు పోయటం ఖాయం.

3) ఏమొకో చిగురుటధరమున -mlv గొంతులో ఇక్కడ బహుళ ప్రాచుర్యం పొందిన ఈ అన్నమయ్య పదం -- ముఖ్యంగా శోభారాజు ఇంకా బాలు గారు ఇద్దరు కూడా ఈ పాటకు ప్రాణం పోస్తారు.

నిలువుమా నిలువుమా నీలవేణి పాట కూడా చాలా మధురమైన యుగళగీతం.

Saturday, April 16, 2011

వేణువై తాను భువనానికి వచ్చి గాలిలా గగనంలో కలిసిపోయిన చిన్నారి.



చిత్రగారు. మధుర గాయని. స్వచ్చమైన నవ్వుతో చూడగానే పవిత్రభావం కలిగే ముఖం ఆమెది. ఆమె తెలుగు ఉచ్చారణ ఎంత బాగా ఉంటుంది! పెను విషాదం. వివాహమైన పదిహేనేళ్ళకు పుట్టిన అమ్మాయి తొమ్మిదేళ్ళ చిన్నారి మరణం ఆమె అభిమానుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తోంది.

చిన్నారి నందన. అందరికీ అమృతం పంచిన మీ అమ్మ ను ఎలా ఓదార్చ గలమమ్మా?

చిత్రగారు ఎన్నో వందల పాటలు పాడారు. ఆమె కర్ణాటక సంగీతం క్షుణ్ణంగా నేర్చుకున్నవారు. అందుకే ఆమె గొంతులో శ్రుతి, శ్రావ్యత ఉత్తమ స్థాయిలో ఉంటాయి.

రెండు మంచి పాటలు గుర్తు చేసుకుంటాను.

ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో-- ఈ పాటకు తప్పకుండా జాతీయ బహుమతి ఇవ్వవలసిన పాట. చిత్రగారు తప్ప ఇంకెవ్వరూ ఈ పాట పాడలేరు.

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి. శుభపంతువరాళి లోని విషాదం చిత్రగారిని కమ్ముకుంది. ఆమె దు:ఖం ఎవరూ తీర్చలేనిది.

Thursday, April 7, 2011

సుజాత-కమల హాసన్-ఇళయరాజా-ఒక పడవ పాట

సుజాత. వెళ్ళిపోయింది. సముద్రం లోకి సూరీడు అస్తమించినంత సహజంగా. మనకున్న dignified నటులలో ఆమె ఒకరు.

ఒక మంచిపాట ద్వారా ఒకసారి స్మరించుకుంటాను.

పడవపాటలు చాలా వరకు ఆకట్టుకుంటాయి. ఆ నెమ్మదితనం, మద్యలో నావికుడో, సరంగో చేసే ex tempore ఆలాపనలు. ఇలాంటిపాటలు సంగీతదర్శకులు పాడితే మరీ బాగుంటాయి.

ఈ పాట ఇళయరాజా స్వరపరచిన ఒక classic. గానం జయచంద్రన్, జానకి గారు. interludes ఎంతో మాధుర్యంతో,ఒకేసారి simple గానూ, intricate గానూ అనిపిస్తాయి. చాలా చక్కగా చిత్రీకరించారు కూడాను.

కమల హాసన్ కంటె పెద్దదానిలాగా సుజాత అనిపిస్తుంది.

ఈ పాట నాకు ఎంతో ఇష్టం. దాదాపు 30 ఏళ్ళయినా retro effect ఏమీ పడలేదు. చాలా హాయిగా సాగుతుంది.

Wednesday, March 30, 2011

బిలహరీ అని పిలువకుంటే బాగుండదు.

స్వధర్మే నిధనం శ్రేయ: అనుపల్లవిలో కొన్ని సంగీతకబుర్లు చెప్పుకుంటేనే బ్లాగుంటుంది అనిపించింది.

బిలహరి. పెద్దగా నన్ను ఆకట్టుకోదు ఈ రాగం. వినగా వినగా.. sort of grows on ears.

ఆరోహణలో మోహనం +అవరోహణ శంకరాభరణం= బిలహరి.

ఈ రాగంలో ఓ రెండు పాటలను పొగిడి ఒక పాటను తిడితే ఒక టపాయిపోతుంది.

ఒకమంచిపాట-- ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకూ.-దేవులపల్లి వారి రచన. పాట ఎత్తుగడ ఎంతో బాగుంది. ఎంతో హాయిగా సుశీలమ్మ గారు పాడారు.

ఇళయరాజా బిలహరిలో ఇచ్చిన రెండుపాటలు ఇలా ఉన్నాయి

1) రుద్రవీణలో ’నీతోనే ఆగేనా సంగీతం’- నాకు నచ్చని పాటలలో ఇది ఒకటి. తన తండ్రి పరిస్థితిని పాట రూపంలో కచ్చేరీలో పాడటం చాలా కృతకంగా అనిపిస్తుంది. అలాగే పాట బాణీ కూడా కృత్రిమంగా ఉంది. ఈ చిత్రంలోనే ’లలిత ప్రియ కమలం విరిసినది’ అనే పాట కూడా నాకు నచ్చదు. (మరీ రివర్సు లో సమీక్షిస్తున్నానేమో తెలియదు)

2) బాలనాగమ్మ అనే తమిళ చిత్రంలోని ’కూందళిలే మేగం’ అనే పాట బానే ఉంటుంది బిలహరిలో.

సంగీత సామ్రాట్ ( anr, జయప్రద, రమేశ్ నాయుడు, సుశీలగారు.)చిత్రంలోని ఎంతసొగసు గాడే పాట బాగుంది.

బాగా ప్రసిద్ధమైన సంప్రదాయ గీతం ’రార వేణు గోపబాల రాజిత సద్గుణ జయశీల’

Thursday, March 10, 2011

మౌనమే వేదమనిపించే పాట-thanks vidya

విద్యాసాగర్ కు నేను పూర్తి స్థాయిలో అభిమాని అవటానికి ఈ పాట కారణం. it is sheer magic.

తన career లోనే అత్యుత్తమమైన పాట. ఈ పాట తరువాతే తను తమిళంలో, మళయాళంలో ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. ’మలరే మౌనమా’ ముందు, తరువాత అన్నంతగా అతని జీవితం మారిపోయింది.

ఒక interview లో తనే చెప్పాడు. ’బాలుగారు సాధారణంగా తొమ్మిదింటి తరువాత పాడరు”. విద్యా ’ఈ పాట జానకిగారు track పాడారు. just వినండి’ అని అన్నారట. బాలుగారు was bowled over. రాత్రి పన్నెండింటి దాకా improvise చేసి పాడి ధ్వనిముద్రణ అయ్యాకే వెళ్ళారట.

బాలు, జానకి గారు పాటకు జీవం పోశారు అనటం stating the obvious అవుతుంది.

కర్ణ సినిమా (1995)లోని ’మలరే మౌనమా’పాట. రాగం దర్బారి కానడా.

అర్జున్, రంజిత. yeah. she was famous for all the wrong reasons recently. nevertheless, both looked very gorgeous in this song.

thanks విద్యా.

Tuesday, February 22, 2011

మలేషియా వాసుదేవన్ - కొన్ని మట్టి వాసనల గురుతులు.

మహా గాయకుడు కాదు. కానీ మంచి పాటగాడు. open voice తో,బలమైన గొంతుతో పాడేవాడు. ముఖ్యంగా మలేశియా + ఇళయరాజా + భారతి రాజా+ వైరముత్తు.. వీరి కలయికలో పల్లెటూరి పాట అంటే అది మట్టివాసన లాగా చుట్టుకుంటుంది. సహజంగా pretence లేకుండా పాడుతాడు.

వెళ్ళిపోయాడు. అయితేనేమి. పదుల సంఖ్యలో మంచిపాటలు పాడి వెళ్ళాడు.

నాకు అమితంగా నచ్చిన రెండు పాటలు గుర్తుచేసుకుంటాను.

తూరల్ నిన్ను పోచ్చి సినిమాలోని ’తంగ చంగిలి’ పాట ఒక గొప్ప యుగళగీతం.

out of this world orchestrization.

ఇళయరాజాకు కీరవాణి రాగం అంటే మహా ప్రీతి. మలేశియా, జానకి గారు పాటకు జీవం పోశారు.

కోళి కూవుదు చిత్రంలోని ’పూవే ఇళయపూవే’.  ఎంత గొప్ప పాట. ilayaraja  created such a masterpiece. మలేశియా చాలా చక్కగా పాడాడు.

ముదల్ మరియాదై చిత్రంలో పాటలు అజరామరాలు.

పత్రికలలో మలేశియా మరణవార్త చూశాక ఒక్కసారి ఆ ’పాత’ మధురాలు గుర్తుకొచ్చాయి.

thanks malaysia vasudevan గారు .

Friday, February 11, 2011

మల్లెతీగ ఒక్కనాటికీ వాడిపోదు మాండు రాగంలో

రాజన్-నాగేంద్ర-ఈ సంగీత దర్శక ద్వయం ఎన్నో జనరంజకమైన గీతాలు స్వరపరిచారు.

ఒకే చిత్రంలో దాదాపు అన్ని పాటలు hit songs' చేయటం వీరి ప్రత్యేకత.

పూజ cinema లో అన్నీ మంచి పాటలే ఉన్నాయి. అందులో
మాండు రాగం లో ఉన్న ’మల్లెతీగ వాడిపోగ మరల పూలు పూయునా’ ఒక చక్కటి పాట.

రహమాన్ అప్పుడప్పుడూ మాండ్ రాగం లోకి relapse అవుతుంటాడు. ఇరువర్ సినిమాలోని శశివదనే పాటలో interludes లోను చరణంలోనూ చాలా అందంగా మాండురాగచ్చాయలు అగపడతాయి. duet cinema లోని ’అంజలీ అంజలీ’ పాట లోని చరణాలు మరొక ఉదాహరణ.

చక్రవర్తి గొప్పగా సంగీతం ఇచ్చింది 70 లలోనే . అందులోని ఒక ఆణిముత్యం ’కుశలమా నీకు కుశలమేనా’-బలిపీఠం లోనిది.

ఎంత గొప్ప యుగళగీతమో మాటల్లో చెప్పలేను. ఆత్మ సౌందర్యం ఉన్న పాటలు అవి.

మాండు రాగ చాయలలో ఉన్నట్టు నాకు అనిపించింది.

శ్రీ మధ్వాచార్య అనే కన్నడ సినిమా తెలుగు అనువాదంలో బాలమురళి పాడిన ’నాదు హృదయ వీణ మీటి’ అనే గీతం link నాకు దొరకలేదు.